Google Chrome : వెబ్‌సైట్ల నోటిఫికేషన్లతో విసిగిపోయారా? ఇకపై క్రోమ్ బ్లాక్ చేస్తుంది..!

Google Chrome యూజర్లకు గుడ్ న్యూస్.. వెబ్ సైట్ల నుంచి వచ్చే నోటిఫికేషన్లతో విసిగిపోయారా? గూగుల్ క్రోమ్ బ్రౌజర్ నుంచి కొత్త కోడ్ అప్‌డేట్ తీసుకొస్తోంది.

Google Chrome యూజర్లకు గుడ్ న్యూస్.. వెబ్ సైట్ల నుంచి వచ్చే నోటిఫికేషన్లతో విసిగిపోయారా? గూగుల్ క్రోమ్ బ్రౌజర్ నుంచి కొత్త కోడ్ అప్‌డేట్ తీసుకొస్తోంది. ఈ కోడింగ్ అప్‌డేట్ ద్వారా అవసరం లేని వెబ్ సైట్ల నుంచి వచ్చే నోటిఫికేషన్లను ఆటోమాటిక్‌గా బ్లాక్ చేసేస్తుంది. ఈ కొత్త అప్‌డేట్ ద్వారా త్వరలో క్రోమ్ యూజర్లు రిలీజ్ పొందవచ్చు. యూజర్లకు చిరాకు తెప్పించే వెబ్‌సైట్‌ల నుంచి అవాంఛిత నోటిఫికేషన్‌లను బ్లాక్ చేసేందుకు గూగుల్ కొత్త అప్ డేట్ పై పనిచేస్తోంది. ఇందులో భాగంగా కొత్త కోడ్ మార్పులు చేస్తోంది. యూజర్లకు నోటిఫికేషన్‌లను అందించడానికి వెబ్‌సైట్ నోటిఫికేషన్ల అనుమతిని ఆటోమాటిక్ కాకుండా ఉండేలా Chromeలో మార్పులు చేస్తోందని 9to5Google నివేదిక పేర్కొంది.

అలాంటి నోటిఫికేషన్‌లను మళ్లీ పుష్ చేసేందుకు అనుమతిని అడిగే ప్రయత్నం చేస్తే.. ఆ వెబ్‌సైట్ నుంచి భవిష్యత్తులో ఎలాంటి నోటిఫికేషన్లు రాకుండా Chrome నిరోధించవచ్చు. ఒక వెబ్‌సైట్ నోటిఫికేషన్ల అనుమతి కోరినప్పుడు.. కుక్కీలను (Cookies) స్టోర్ అవుతాయి. కొన్నిసార్లు యూజర్లు తమకు తెలియకుండానే ఆయా నోటిఫికేషన్లను అనుమతిస్తుంటారు. అలాంటి సందర్భాలలో, వెబ్‌సైట్‌లు అవాంఛిత/అనవసరమైన నోటిఫికేషన్‌లు వస్తుంటాయి. మీరు స్పామ్‌ను వెబ్‌సైట్ నుంచి Chrome నోటిఫికేషన్‌లకు సభ్యత్వాన్ని పొందినట్లయితే నోటిఫికేషన్ల బెడద ఎక్కువ ఉంటుంది. అందుకే ఇలాంటి సమస్యను అధిగమించేందుకు గూగుల్ కొత్త అప్ డేట్స్ తీసుకొస్తోంది.

Google Chrome Will Soon Block Notifications From Disruptive Websites 

తప్పుదారి పట్టించే విధంగా అనుమతిని కోరే వెబ్‌సైట్‌ల నుంచి నోటిఫికేషన్ ప్రాంప్ట్ మ్యూట్ చేయడానికి యూజర్లకు అనుమతిస్తుంది. వెబ్‌సైట్ల నోటిఫికేషన్లపై నిబంధలను మరింత కఠినతరం చేయడానికి Google ప్రయత్నిస్తోంది. Chrome హానికరమైన సైట్ నుంచి వచ్చే నోటిఫికేషన్‌లను ఆటోమాటిక్‌గా ఆపివేస్తుంది. నోటిఫికేషన్‌లను పంపే సాధారణ వెబ్‌సైట్‌లపై ఈ కొత్త అప్‌డేట్ ప్రభావం పడకుండా ఉండేలా క్రోమ్ ఈ కొత్త అప్ డేట్ తీసుకురానుంది. కేవలం హనికరమైన స్పామ్ వెబ్‌సైట్‌ల నుంచి నోటిఫికేషన్‌లు, అనుమతులను మాత్రమే బ్లాక్ చేస్తుంది. నోటిఫికేషన్ ప్రాంప్ట్‌లు మ్యూట్ చేసిన సైట్‌ల జాబితా నుంచి భిన్నంగా ఉంటుందా లేదా బ్లాక్ చేసే ప్రత్యేక పద్ధతి ఉంటుందా లేదా అనేది క్లారిటీ లేదు.

Read Also : Google Chrome: క్రోమ్ క్లోజ్ చేయాలంటే ఇకపై ఇది తప్పనిసరి

ట్రెండింగ్ వార్తలు