మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో గూగుల్ అసిస్టెంట్ యాప్ వాడుతున్నారా? అందులో ఓ ఫీచర్ ఇక నుంచి పనిచేయదు. OK గూగుల్ అనగానే.. మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్ర్కీన్ అన్ లాక్ కావడం చూసే ఉంటారు.
మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో గూగుల్ అసిస్టెంట్ యాప్ వాడుతున్నారా? అందులో Unlock ఫీచర్ ఇక నుంచి పనిచేయదు. OK గూగుల్ అనగానే.. మీ ఆండ్రాయిడ్ ఫోన్ Screen అన్ లాక్ కావడం చూసే ఉంటారు. అసిస్టెంట్ యాప్ లో Voice match ఫీచర్ ఉంటుంది.. ఈ ఫీచర్ సాయంతో మీ ఫోన్ స్క్రీన్ అన్ లాక్ అవుతుంది. ఈ ఫీచర్ మీరు వాడే ఆండ్రాయిడ్ ఫోన్ కు అంత సురక్షితం కాదట. ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ వాయిస్ మ్యాచ్ ఫీచర్ ను అసిస్టెంట్ యాప్ నుంచి తొలగిస్తోంది.
Read Also : గెలాక్సీకి పోటీగా : మడతబెట్టే మోటరోలా RAZR వచ్చేస్తోంది
తద్వారా ఈ ఆండ్రాయిడ్ ఫోన్ మరింత సెక్యూర్ చేసుకోవచ్చు. వాయిస్ మ్యాచ్ కమాండ్ ఫీచర్ కారణంగా ఆండ్రాయిడ్ లాకింగ్ సిస్టమ్ కు సెక్యూరిటీ రిస్క్ ఉండటంతో గూగుల్.. ఈ ఫీచర్ ను కొత్తగా అప్ డేట్ చేస్తోంది. అదే.. 9.31 అప్ డేట్. ఆండ్రాయిడ్ ఫోన్ స్క్రీన్ అన్ లాక్ కాకుండా ఉండేలా ఈ ఫీచర్ ను రిడిజైన్ చేస్తోంది.
కొంతమంది వాయిస్ మీ సొంత వాయిస్ కు మ్యాచ్ అవుతుంటుంది. ఇతరులు ఎవరైనా OK గూగుల్ అంటే చాలు.. మీ ఆండ్రాయిడ్ ఫోన్ అన్ లాక్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఇతరులు మీ ఫోన్ ఈజీగా ఫుల్ యాక్సెస్ చేయొచ్చు.
Read Also : Booking Start : జియోఫోన్2 ఫ్లాష్ సేల్ సందడి
అందుకే.. గూగుల్ అన్నీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ఫీచర్ ను తొలగిస్తోంది. ఇప్పటికే గూగుల్ ఫిక్సల్ 3, 3 ఎక్స్ఎల్ స్మార్ట్ ఫోన్లలో వాయిస్ మ్యాచ్ ఫీచర్ ను తొలగించింది. భవిష్యత్తులో అన్నీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ఫీచర్ ను తొలగించనుంది.
మోటో ఎక్స్, ఫిక్సల్ ఎక్స్ఎల్ ఫోన్లలో 9.27 అప్ డేట్ ఫీచర్ ఫంక్షనాలిటీ ఆగిపోయింది. ఇకపై ఈ ఫీచర్ మీ ఆండ్రాయిడ్ ఫోన్ మ్యానువల్ (పిన్, ప్యాటరన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్) గా అన్ లాక్ చేశాకే.. గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేయొచ్చు. అసిస్టెంట్ ఫీచర్ లో వాయిస్ అన్ లాక్ ఫీచర్ తొలగించడంతో పర్సనల్ రిజల్ట్స్ మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుందని 9టూ5 గూగుల్ తెలిపింది.