Google : గేమింగ్ లవర్స్‌‌కు గూగుల్ గుడ్ న్యూస్

గేమింగ్ లవర్స్ ఆసక్తిని గూగుల్ గమనించింది. అందుకే..విండోస్ ప్లాట్ ఫామ్ లో కూడా ప్లేస్టోర్ లాంటి ప్రత్యేక ప్లాట్ ఫామ్ తీసుకుని రానున్నట్లు వెల్లడించింది.

Google : గేమింగ్ లవర్స్‌‌కు గూగుల్ గుడ్ న్యూస్

Online Game

Updated On : December 10, 2021 / 5:17 PM IST

Google Is Bringing Android Games : మీకు గేమింగ్ ఆడే అలవాటు ఉందా ? గేమింగ్ లవర్స్ కు గూగుల్ గుడ్ న్యూస్ వినిపించింది. విండోస్ ప్లాట్ ఫామ్ లో కూడా ప్లే స్టోర్ లాంటి ప్రత్యేక ప్లాట్ ఫామ్ త్వరలోనే తీసుకొని రానున్నట్లు ప్రకటించింది. విండోస్ ప్లాట్ ఫామ్ మీద గేమ్స్ ఆడాలంటే…వేర్వేరు పోర్టల్ నుంచి గేమ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చేది. దీంతో గేమింగ్ ఆడేవారు కొంత అసౌకర్యానికి గురయ్యేవారు.

Read More : Myanmar Military attack:మయన్మార్ లో మారణహోమం..చేతుల కట్టేసి..11మందిని సజీవ దహనం చేసిన మిలటరీ బలగాలు

గేమింగ్ లవర్స్ ఆసక్తిని గూగుల్ గమనించింది. అందుకే..విండోస్ ప్లాట్ ఫామ్ లో కూడా ప్లేస్టోర్ లాంటి ప్రత్యేక ప్లాట్ ఫామ్ తీసుకుని రానున్నట్లు వెల్లడించింది. గూగుల్ నిర్మించిన గూగుల్ ప్లే గేమ్స్ యాప్ విండోస్ ప్లాట్ ఫాం కూడా లభ్యం కానుంది. తమ విండోస్ పీసీలో ఆండ్రాయిడ్ గేమ్స్ ఎంచక్కా ఆడుకోవచ్చు. ఆండ్రాయిడ్, గూగుల్ ప్లేలోని గేమ్స్ గురించి..గూగుల్ ప్రొడక్ట్ డైరెక్టర్ హార్ట్రెల్ ది వెర్జ్ మాట్లాడారు. త్వరలోనే…ఫోన్, క్రోమ్ బుక్, విండోస్ పీసీ, టాబ్లెట్ లలో ఎలాంటిం అంతరాయం లేకుండా…గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేయగలరని తెలిపారు. అయితే..ఇది ఎప్పుడు లాంఛ్ అవుతుందనే విషయంపై ఖచ్చితమైన వివరాలు ప్రకటించలేదు. వచ్చే సంవత్సరం రానుందని తెలుస్తోంది.