Google Issues Urgent Security Warning for Android Users
Google Warning : ఆండ్రాయిడ్ యూజర్లకు బిగ్ అలర్ట్.. మీ ఫోన్ భద్రమేనా? వ్యక్తిగత డేటాకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. సెక్యూరిటీ అప్‌డేట్స్ అందుకోని ఆండ్రాయిడ్ ఫోన్లను హ్యాకర్లు హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. మీకు తెలియకుండానే మాల్వేర్ సాఫ్ట్‌వేర్ మీ డివైజ్‌లోకి ఇంజెక్ట్ చేసి వ్యక్తిగత డేటాను యాక్సస్ చేయొచ్చు.
ఇప్పటికే చాలా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ తరహా మాల్వేర్ అప్లికేషన్లు ఉన్నట్టుగా సెర్చ్ దిగ్గజం గుర్తించింది. తమ ఆండ్రాయిడ్ యూజర్లను అప్రమత్తంగా ఉండాలంటూ గూగుల్ హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్లను తక్షణమే అప్‌డేట్ చేసుకోవాలని సూచనలు చేసింది. గూగుల్ లేటెస్ట్ సెక్యూరిటీ బులెటిన్ ప్రకారం.. ఈ భద్రతా లోపాలను సైబర్ నేరస్థులు ఇప్పటికే యాక్సస్ చేస్తున్నారని హెచ్చరించింది.
మీ ఫోన్ ఇప్పుడే అప్‌డేట్ చేయండి :
సెక్యూరిటీ లోపాల గురించి ఆండ్రాయిడ్ యూజర్లను సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరస్థులు సెక్యూరిటీ లోపాలు కలిగిన ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్లను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని జామ్ఫ్ సీనియర్ సెక్యూరిటీ స్ట్రాటజీ మేనేజర్ ఆడమ్ బాయ్న్టన్ హెచ్చరించారు.
సెక్యూరిటీ లోపం కలిగిన ఫోన్లలో హ్యాకర్లు మాల్వేర్ ఫైల్ స్టోర్ చేసిన Android/data, Android/obb, Android/sandbox ఫోల్డర్‌లను ఇంజెక్ట్ చేసి యాక్సెస్ చేస్తున్నారు. మీ వ్యక్తిగత డేటాను తస్కరించడంతో పాటు ఆర్థికపరమైన మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
మీ ఫోన్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? :
ఈ సెక్యూరిటీ లోపాలను పరిష్కరించేందుకు గూగుల్ ఇప్పటికే సెక్యూరిటీ అప్‌డేట్స్ విడుదల చేసింది.
మీ ఫోన్ అప్‌డేట్స్ చెక్ చేయండి : (Settings)లో (Security & updates) సెలక్ట్ చేసి ‘Software Update’ క్లిక్ చేయండి. ఏదైనా అప్‌డేట్ ఉంటే ఇన్‌స్టాల్ చేయండి.
టూ ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ : మీ గూగుల్ అకౌంట్ అదనపు సెక్యూరిటీ కోసం ఈ సెటప్ చేసుకోండి.
అనుమానాస్పద యాప్‌లు, లింక్స్ నివారించండి : భద్రతా లోపాలు కలిగిన గుర్తుతెలియని యాప్స్, స్పామ్ లింక్‌ల పట్ల జాగ్రత్తగా ఉండండి.
Read Also : PAN Card 2.0 : క్యూఆర్ కోడ్‌తో కొత్త పాన్ కార్డ్.. ఆన్‌లైన్‌లో ఎలా అప్లయ్ చేయాలో తెలుసా? ఫుల్ గైడ్ మీకోసం..!
పిక్సెల్ ఫోన్ యూజర్లు ఇప్పుడు సెక్యూరిటీ అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ, మొబైల్ మేకర్లు వేర్వేరు సమయాల్లో అప్‌డేట్‌లను విడుదల చేశారు. శాంసంగ్, వన్‌ప్లస్, షావోమీ ఇతర ఆండ్రాయిడ్ బ్రాండ్‌ల యూజర్లు మరింతకాలం వేచి ఉండాల్సి రావచ్చు.
మీ ఫోన్ సపోర్ట్ చేస్తుందా? :
మీ ఫోన్‌లో సెక్యూరిటీ అప్‌డేట్స్ రావడం లేదా? ఇకపై సపోర్టు ఉండకపోవచ్చు. తద్వారా సైబర్ ఎటాక్ గురయ్యే రిస్క్ ఎక్కువ. వెంటనే మీ ఫోన్ సెక్యూరిటీ ప్యాచ్‌లను అందుకునే కొత్త మోడల్‌కు అప్‌గ్రేడ్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా ఇప్పుడే మీ ఆండ్రాయిడ్ ఫోన్ చెక్ చేయండి.