Google Gmail Shutdown : ఆగస్టు 2024లో జీమెయిల్ పూర్తిగా నిలిచిపోనుందా? పుకార్లను నమ్మొద్దంటూ క్లారిటీ ఇచ్చిన గూగుల్!

Google Gmail Shutdown : 2024 ఏడాది ఆగస్ట్‌లో జీమెయిల్ సర్వీసును గూగుల్ పూర్తిగా నిలిపివేయనుందంటూ సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఇందులో కొంత మాత్రమే నిజమని సెర్చ్ దిగ్గజం క్లారిటీ ఇచ్చింది.

Google Gmail Shutdown : ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మిలియన్ల మంది జీమెయిల్ సర్వీసును వినియోగిస్తున్నారు. అందులో చాలామంది రోజులో ఒకసారైన జీమెయిల్ ఓపెన్ చేయకుండా ఉండరు. అంతేకాదు.. చాలా కంపెనీలు గూగుల్ ఇమెయిల్ ప్లాట్‌ఫారమ్‌పైనే ఎక్కువగా పనిచేస్తుంటాయి. ఫ్రీలాన్సర్‌లు సైతం తమ వృత్తిపరమైన కమ్యూనికేషన్‌ల కోసం జీమెయిల్ తప్పనిసరిగా ఉపయోగిస్తారు. అలాంటి జీమెయిల్ సర్వీసు గూగుల్ పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించిందంటూ గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో జీమెయిల్ సర్వీసులు నిలిచిపోనున్నాయనే విషయం తెలియగానే అనేక మంది జీమెయిల్ యూజర్లు ఆందోళన చెందారు.

Read Also : iQOO Neo 9 Pro Launch : అద్భుతమైన ఫీచర్లతో ఐక్యూ నియో 9 ప్రో ఫోన్ వచ్చేసింది.. లాంచ్ ఆఫర్లు, భారత్‌‌లో ధర ఎంతంటే?

అది ఫేక్ ఫొటో.. తేల్చేసిన గూగుల్ :
దీనిపై స్పందించిన గూగుల్.. ఇందులో కొంత మాత్రమే నిజం ఉందని, జీమెయిల్ యూజర్లు భయపడాల్సిన అవసరం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు గూగుల్ ట్విట్టర్ వేదికగా ధృవీకరించింది. జీమెయిల్ సర్వీసుల్లో ఒక ఫీచర్ మాత్రమే నిలిచిపోనుంది. ఆ ఫీచర్ ఇమెయిల్ ప్లాట్‌ఫారమ్ ప్రాథమిక HTML వెర్షన్ అని స్పష్టం చేసింది. గత ఏడాది సెప్టెంబరులో దీన్ని కంపెనీ ధృవీకరించింది. జీమెయిల్ సర్వీసు అధికారికంగా నిలిచిపోనుందంటూ వైరల్ అయిన ఫొటోలో నిజం లేదని, ఇది పూర్తిగా ఫేక్ ఫొటో అని తేల్చేసింది. మీరు సాధారణ జీమెయిల్ యూజర్ అయితే చింతించాల్సిన పని లేదని గూగుల్ స్పష్టం చేసింది. జీమెయిల్‌కు సంబంధించి ఒక వివరణను కూడా గూగుల్ విడుదల చేసింది.

నిలిచిపోనున్న జీమెయిల్ HTML వ్యూ ఫీచర్ :
ఈ ఏడాది ఆగస్టులో గూగుల్ జీమెయిల్ సర్వీసులో HTML వ్యూ ఫీచర్ నిలిపివేయాలని నిర్ణయించింది. గూగుల్ సపోర్టు పేజీలో జనవరి 2024 తర్వాత జీమెయిల్ యాక్సెస్ చేయడానికి వినియోగదారులందరికీ డిఫాల్ట్ మోడ్ HTML వ్యూ నుంచి స్టాండర్డ్ వ్యూకు మారుతుందని గత సెప్టెంబరు 2023లో వెల్లడించింది. ఈ మోడ్ వ్యూలో మీ ఇమెయిల్‌లను సాధ్యమైనంత సులభంగా చెక్ చేయవచ్చు.

యూజర్లకు తక్కువ ఇంటర్నెట్ నెట్‌వర్క్ ప్రాంతాల్లో ఉన్నప్పుడు స్టాండర్డ్ వ్యూ లోడ్ కానప్పుడు.. ఈ హెచ్‌టీఎంఎల్ వ్యూను యాక్సెస్ చేయడానికి సరైనదిగా సూచించింది. చాట్, స్పెల్ చెకర్, కీబోర్డ్ షార్ట్‌కట్‌లు, రిచ్ ఫార్మాటింగ్, సెర్చ్ ఫిల్టర్‌ల వంటి అనేక గూగుల్ ఫీచర్‌లు ఈ HTML వ్యూలో అందుబాటులో లేవు. తక్కువ కనెక్టివిటీ జోన్‌లలో ఉన్న యూజర్ల కోసం ఈ కొత్త మోడ్‌ను రిలీజ్ చేస్తుందో లేదో గూగుల్ అధికారికంగా ధృవీకరించలేదు.

Read Also : Google Gemini Ultra : జెమినిగా మారిన గూగుల్ బార్డ్.. ఇప్పుడు అల్ట్రా కూడా.. భారత్‌‌లో ఈ ఏఐ మోడల్ ధర ఎంత? ఎలా వాడాలో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు