iQOO Neo 9 Pro Launch : అద్భుతమైన ఫీచర్లతో ఐక్యూ నియో 9 ప్రో ఫోన్ వచ్చేసింది.. లాంచ్ ఆఫర్లు, భారత్‌‌లో ధర ఎంతంటే?

iQOO Neo 9 Pro Launch : భారత్‌కు ఐక్యూ నియో 9 ప్రో కొత్త ఫోన్ వచ్చేసింది. ఈ హ్యాండ్‌సెట్ అద్భుతమైన ఫీచర్లతో పాటు 5160ఎంఎహెచ్ బ్యాటరీ, 50ఎంపీ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

iQOO Neo 9 Pro Launch : అద్భుతమైన ఫీచర్లతో ఐక్యూ నియో 9 ప్రో ఫోన్ వచ్చేసింది.. లాంచ్ ఆఫర్లు, భారత్‌‌లో ధర ఎంతంటే?

iQOO Neo 9 Pro with Snapdragon 8 Plus Gen 2 SoC launched in India

iQOO Neo 9 Pro Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ ఐక్యూ నియో 9 ప్రో పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే.. ఐక్యూ నియో 9 ప్రో మోడల్.. ఐక్యూ నియో 7 ప్రోకు అప్‌గ్రేడ్ వేరియంట్ అని చెప్పవచ్చు. కంపెనీ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెనరేషన్ 2 ప్రాసెసర్‌ని అందిస్తోంది.

Read Also : Wet iPhone Rice : మీ ఐఫోన్ నీళ్లలో తడిసిందా? ఆరబెట్టేందుకు బియ్యంలో వేయవద్దు? యూజర్లకు ఆపిల్ హెచ్చరిక? ఎందుకంటే?

ఈ హ్యాండ్‌సెట్‌ పర్ఫార్మెన్స్ కోసం అద్భుతమైన స్పీడ్ అందిస్తుంది. ఐక్యూ నియో 9 ప్రో ప్రైమరీ స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌లో 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్920 సెన్సార్ ఉంది. 144హెచ్‌జెడ్ ఎల్‌టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 5160ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ 120డబ్ల్యూ ఫ్లాష్ ఛార్జ్ అనే ఫాస్ట్ ఛార్జర్‌తో ద్వారా వేగంగా ఛార్జింగ్ అవుతుంది.

ఐక్యూ నియో 9 ప్రో ధర, ఆఫర్లు :
ఐక్యూ నియో 9 ప్రో మొత్తం 3 కాన్ఫిగరేషన్‌లలో వస్తోంది. 8జీబీ+128జీబీ, 8జీబీ + 256జీబీ, 12జీబీ+256జీబీ స్టోరేజీ ఆప్షన్లతో వస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 35,999 నిర్ణయించగా.. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్‌ ధర రూ. 36,999 వరకు ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ సేల్ ఫిబ్రవరి 23 నుంచి ఐక్యూ స్టోర్, అమెజాన్ స్టోర్‌లో ప్రారంభం కానుంది.

ఐక్యూ నియో 9 ప్రోలో బ్యాంక్ ఆఫర్లు :
ఐక్యూ నియో 9 ప్రో స్మార్ట్‌ఫోన్ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌పై రూ. 1000 తగ్గింపును అందిస్తోంది. ఫిబ్రవరి 26 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే, కొన్ని ఎంపిక చేసిన బ్యాంకులపై కంపెనీ రూ.2వేల ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది.

ఐక్యూ నియో 9 ప్రో స్పెసిఫికేషన్‌లు :
ఐక్యూ నియో 9 ప్రో ఫోన్ 6.78-అంగుళాల ఎల్‌టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1-144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను పొందుతుంది. అలాగే ఈ హ్యాండ్‌సెట్ 1.5కె (2800×1260 పిక్సెల్) రిజల్యూషన్‌తో వస్తుంది. 3000నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్‌ని అందిస్తుంది.

ఐక్యూ నియో 9 ప్రో ప్రాసెసర్, ర్యామ్ వివరాలు :
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 చిప్‌సెట్ మోడల్ ఐక్యూ నియో 9 ప్రోలో వస్తోంది. 8జీబీ/12జీబీ ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్‌తో వస్తుంది. అంతేకాదు.. 12జీబీ ఎక్స్‌టెండెడ్ ర్యామ్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 128జీబీ/256జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ఆప్షన్‌లను కలిగి ఉంటుంది.

ఐక్యూ నియో 9 ప్రో బ్యాటరీ :
ఐక్యూ నియో 9 ప్రో హ్యాండ్‌సెట్ 5160ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 120డబ్ల్యూ ఫ్లాష్ ఛార్జ్ అనే ఫాస్ట్ ఛార్జర్‌తో వస్తుంది. ఇందులో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంది.

ఐక్యూ నియో 9 ప్రో కెమెరా :
ఐక్యూ నియో 9 ప్రో ఫోన్ 50ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. సోనీ ఐఎమ్ఎక్స్920 సెన్సార్‌తో వస్తుంది. సెకండరీ కెమెరా 8ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, సెల్ఫీ, వీడియో కాలింగ్‌కు16ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.

Read Also : Mahindra Scorpio-N Z8 : మహీంద్రా స్కార్పియోలో కొత్త వేరియంట్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్, ఏ వేరియంట్ ధర ఎంతంటే?