సోషల్ మీడియాలో అమ్మగా పిలుచుకునే..‘గూగుల్’లో కొత్త కొత్త ఫీచర్లతో ముందుకు వస్తోంది. నెటిజన్లకు ఎలాంటి అసౌకర్యం ఉండకుండా గూగుల్ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా మరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ సెర్చ్ లో యూజర్లు పీపుల్ కార్డ్ ఫీచర్ ను ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది.
దీని సహాయంతో యూజర్లు తమ వర్చువల్ విజిటింగ్ కార్డును క్రియేట్ చేసుకోవచ్చని తెలిపింది. దీనివల్ల ఉపయోగం ఉంది. ప్రపంచంలో ఇతరులకు విషయాలు తెలుస్తాయి. మీరు ఎ పని చేస్తున్నారో ? ఇతరత్రా విషయాలు అందరకీ తెలుస్తాయి. వ్యాపార వేత్త…అయితే..మీ వ్యాపారం గురించి ఇతరులకు తెలుసుకొనే ఛాన్స్ ఉంది.
ఎలా క్రియేట్
ముందుగా గూగుల్ అకౌంట్‌లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. సెర్చ్‌లో పేరు లేదా, యాడ్ మి టు సెర్చ్ చేయాలి. కార్డును క్రియేట్ చేసేందుకు గూగుల్ అకౌంట్‌లో ఉన్న పేరును ఎంపిక చేసుకోవచ్చు. లేదా వేరే ఏదైనా పేరు యాడ్ చేయవచ్చు.
అలాగే మీ డిస్క్రిప్షన్, వెబ్‌సైట్ లింకులు, సోషల్ మీడియా ప్రొఫైల్స్, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ ఇతరత్రా వివరాలను ఎంటర్ చేయాలి. ఫోన్ నంబర్‌తో ఆథెంటికేషన్ ఇవ్వాలి. అంతే… వర్చువల్ విజిటింగ్ కార్డు క్రియేట్ అవుతుంది. ఇలా చేయడం వల్ల వ్యాపారం చేసేవారు, ఇతర ఉద్యోగులు, ప్రోఫెషనల్స్ కు ఉపయోగం ఉంటుందంటున్నారు.