Google Magic Editor : గూగుల్ మ్యాజిక్ ఎడిటర్ ఫీచర్ ఇదిగో.. ఇకపై అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలోకి..!

Google Magic Editor : మ్యాజిక్ ఎడిటర్ ఫీచర్ లేటెస్ట్ వెర్షన్ 6.85కి అప్‌డేట్ తర్వాత పిక్సెల్, శాంసంగ్ ఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ లేదా ఇతర తయారీదారుల ఫోన్‌లలో మ్యాజిక్ ఎడిటర్ ఉపయోగించాల్సి ఉంటుంది.

Google Magic Editor : గూగుల్ మ్యాజిక్ ఎడిటర్ ఫీచర్ ఇదిగో.. ఇకపై అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలోకి..!

Google Magic Editor ( Image Credit : Google )

Google Magic Editor : గూగుల్ మ్యాజిక్ ఎడిటర్ ఫీచర్‌ను పిక్సెల్ ఫోన్‌లకు మించి శాంసంగ్ ఫోన్లతో సహా ఇతర ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు విస్తరిస్తోంది. గూగుల్ ప్రారంభంలో అక్టోబర్ 2023లో పిక్సెల్ 8 సిరీస్‌తో మ్యాజిక్ ఎడిటర్ గతంలో పిక్సెల్ ఫోన్‌లకు మాత్రమే ప్రత్యేకమైనది. ఈ డివైజ్‌లలో గూగుల్ ఉచితంగా ఫీచర్‌ను అందిస్తోంది. పిక్సెల్ యూజర్లకు ఈ అప్‌డేట్ ప్రత్యేకంగా అందిస్తోంది. అయితే, ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లకు ఎడిటింగ్ చేసే ఫొటోలకు పరిమితి ఉంది.

Read Also : ITR Filing Online : ఐటీఆర్ ఫైలింగ్.. ఆన్‌లైన్‌లో ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఎలా ఫైల్ చేయాలి? ఇదిగో సింపుల్ ప్రాసెస్!

నివేదిక ప్రకారం.. మ్యాజిక్ ఎడిటర్ ఫీచర్ లేటెస్ట్ వెర్షన్ 6.85కి అప్‌డేట్ అయిన తర్వాత పిక్సెల్, శాంసంగ్ ఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ లేదా ఇతర తయారీదారుల ఫోన్‌లలో మ్యాజిక్ ఎడిటర్ ఉపయోగించాల్సి ఉంటుంది. గూగుల్ వన్ ప్రీమియం ప్లాన్‌కు సభ్యత్వం పొందకపోతే నెలకు 10 ఎడిట్‌‌తో పాటు సేవ్ లిమిట్ పొందవచ్చు. అన్‌లిమిటెడ్ ఎడిటింగ్ కోసం వినియోగదారులు గూగుల్ వన్ ప్రీమియం (2టీబీ)కి నెలకు 9.99 డాలర్ల సభ్యత్వాన్ని పొందవచ్చు. అయినప్పటికీ, పిక్సెల్ యూజర్లు సభ్యత్వం లేకుండా అన్‌లిమిటెడ్ ఎడిట్ ఆప్షన్ పొందుతారు.

మ్యాజిక్ ఎడిటర్ అంటే ఏంటి? ఎలా ఉపయోగించాలి? :
మీ ఫొటోలలో మ్యాజిక్ ఎడిటర్ వివిధ ఎడిటింగ్ ఆప్షన్లను నిర్వహించేందుకు అనుమతిస్తుంది. మీ ఫొటోలలోని వస్తువులను నొక్కడం ద్వారా వాటి సైజును మార్చవచ్చు. రీపోజిషన్ చేయవచ్చు. ఆపై వాటిని మార్చడం లేదా సైజు మార్చవచ్చు. మీ ఫొటోలను అవసరమైన విధంగా ఎడిట్ చేయొచ్చు. మీ ఫొటోల లైటింగ్ బ్యాక్‌గ్రౌండ్ మెరుగుపర్చేందుకు సూచనలను కూడా పొందవచ్చు. ఉదాహరణకు.. మీ ఫొటోలకు యాష్ కలర్ యాడ్ చేయొచ్చు. ఎడిట్ చేసిన తర్వాత మ్యాజిక్ ఎడిటర్ ఎంచుకోవడానికి మల్టీ రిజల్ట్స్ ఆప్షన్లను కూడా అందిస్తుంది.

మేజిక్ ఎడిటర్ ఎలా ఉపయోగించాలి :
మ్యాజిక్ ఎడిటర్‌ ఉపయోగించేందుకు గూగుల్ ఫొటోలతో ఎడిట్ చేసే ఫొటోను ఎంచుకోండి. మ్యాజిక్ ఎడిటర్ ఆప్షన్‌పై నొక్కండి. ఆపై మీరు ఉపయోగించాలనుకుంటున్న ఎడిటింగ్ టూల్ ఎంచుకోండి. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న ఆబ్జెక్ట్‌ను నొక్కండి లేదా సర్కిల్ చేయండి. ఆపై రీపోజిషన్ చేసేందుకు లాగండి. కొన్ని ట్యాప్‌లతో లైటింగ్, బ్యాక్‌గ్రౌండ్ మార్పులకు సూచనలను కూడా అప్లయ్ చేయొచ్చు.

Read Also : OnePlus Nord CE 4 Lite : వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 18నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?