Google Maps on Fitbit Watches : మీ స్మార్ట్‌వాచ్‌లో గూగుల్ మ్యాప్స్ కావాలా? ఫిట్‌బిట్ వాచ్ అదిరే ఆఫర్.. ఇప్పుడే కొనేసుకోండి.. ఫీచర్లు, ధర ఎంతంటే?
Google Maps on Fitbit Watches : సాధారణంగా ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు గూగుల్ మ్యాప్స్ (Google Maps) చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాంటి గూగుల్ మ్యాప్స్ (Google Maps) ఇప్పుడు స్మార్ట్‌వాచ్‌లోనూ అందుబాటులోకి వచ్చింది.

Want Google Maps on smartwatches_ Fitbit watches now offer it
Google Maps on Fitbit Watches : సాధారణంగా ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు గూగుల్ మ్యాప్స్ (Google Maps) చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాంటి గూగుల్ మ్యాప్స్ (Google Maps) ఇప్పుడు స్మార్ట్‌వాచ్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. ఇందులో కనెక్టవిటీ ఫీచర్లు ఎన్నో ఉంటాయి. ఫిట్‌బిట్ వాచ్ (Fitbit Watches) మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. Fitbit Sense 2 లేదా Fitbit Versa 4 స్మార్ట్‌వాచ్‌లను కలిగి ఉన్న యూజర్లు Google Mapsను ఉపయోగించవచ్చు.
ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు అప్‌డేట్ చేసుకోవడం ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త అప్‌డేట్ అందుబాటులోకి రావాలంటే ఐఫోన్ యూజర్లు 2023 వరకు వేచి ఉండాల్సిందే. మీ స్మార్ట్‌ఫోన్‌లో అధికారిక Fitbit యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ప్రొఫైల్ విభాగంలో Google Maps ఆప్షన్ చూడవచ్చు. మీరు ఆప్షన్‌పై నొక్కిన తర్వాత మీ Fitbit డివైజ్‌లో Google మ్యాప్స్ నావిగేషన్‌ను సెటప్ చేసుకోవచ్చు. సెటప్ పూర్తయిన తర్వాత మీ వాచ్ యాప్ లిస్ట్‌లో మ్యాప్స్‌ని చూడవచ్చు. మీరు యాప్‌కి కొన్ని అనుమతులను ఇవ్వాల్సి ఉంటుంది.
Read Also : Google Maps : కొత్త ఫీచర్.. ఇకపై గూగుల్ మ్యాప్‌లోనే టోల్ ధరలు చూడొచ్చు..!
ప్రైవరీ ఫీచర్లను కూడా పొందవచ్చు. Fitbit వాచ్ యూజర్లు డ్రైవింగ్ సమయంలో Google Mapsని ఉపయోగించవచ్చు. ఈ యాప్ ఆటోమాటిక్‌గా ఓపెన్ అవుతుంది. ఈ ఆటో-స్టార్ట్ ఫీచర్ వాకింగ్ లేదా సైక్లింగ్ సమయంలో అందుబాటులో ఉండదని గమనించాలి. ఫిట్‌బిట్ యూజర్లు వివిధ కార్యకలాపాల కోసం మ్యాప్స్‌ని ఉపయోగించడానికి Settings ద్వారా వెళ్లవచ్చు.

Want Google Maps on smartwatches_ Fitbit watches now offer it
ఇతర స్మార్ట్‌వాచ్‌లలో ఈ కొత్త నావిగేషన్‌ను ఇంకా లాంచ్ చేయలేదు. కానీ, Fitbit యాప్‌లో ఈ ఫీచర్‌ని యాక్సెస్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ద్వారా నావిగేషన్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. అంటే.. మీరు మీ డివైజ్‌ను ప్రతిచోటా తీసుకెళ్లాలి. మీరు స్మార్ట్‌వాచ్‌తో మ్యాప్స్‌ని ఉపయోగించలేరు. మీ వాచ్ ఫోన్ నుంచి డిస్‌కనెక్ట్ కాకుండా ఉండేలా చూసుకోవాలి అని అర్థం. మీరు స్మార్ట్‌వాచ్‌లలో Google Maps యాప్‌ను చాలా అరుదుగా ఉంటాయని చెప్పాలి.
అమాజ్‌ఫిట్, షియోమి, గార్మిన్‌లకు చెందిన ప్రముఖ వాచీలు కూడా మ్యాప్స్ ఆప్షన్ అందుబాటులో లేవు. కొన్ని శాంసంగ్వాచ్‌లు వినియోగదారులకు మెరుగైన మరింత సౌకర్యవంతమైన ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉంటాయి. Fitbit Sense 2, Versa 4 ఆల్-రౌండర్ పర్ఫార్మెన్స్ కోసం చూస్తున్న యూజర్లు లక్ష్యంగా చేసుకున్నాయి.
వరుసగా రూ. 20,499, రూ. 24,999 ధర ట్యాగ్‌లను కలిగి ఉంటాయి. Fitbit Sense 2 స్లీప్ విధానాలు, ఒత్తిడి స్థాయిలను ట్రాక్ చేయవచ్చు. మీ నిద్రను ట్రాక్ చేయగలదు. 40 వ్యాయామ మోడ్‌లు, GPS, హృదయ స్పందన ట్రాకింగ్, కొత్త శరీర ప్రతిస్పందన సెన్సార్ వంటి సామర్థ్యాలతో వస్తుంది. వెర్సా 4 అదనంగా ECG ట్రాకింగ్‌ను అందిస్తుంది. గడియారాలు WearOS by Googleలో పనిచేయవని గమనించాలి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..