Google Pixel Phones
Google Pixel Phones : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సొంత పిక్సెల్ 6, పిక్సెల్ 7, పిక్సెల్ ఫోల్డ్ సిరీస్‌ల కోసం ఎక్స్‌టెండెడ్ సాఫ్ట్‌వేర్ సపోర్టు పాలసీని ప్రకటించింది. యూజర్లకు అదనంగా రెండు ఏళ్ల ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తోంది. ఈ ఫోన్లు ఇప్పుడు మునుపటి మూడేళ్ల పాలసీ కన్నా మొత్తం 5 ఏళ్ల సాఫ్ట్‌వేర్ సపోర్టును పొందుతాయి. లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫీచర్‌లు, మెరుగైన భద్రతకు పిక్సెల్ యూజర్లకు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.
గూగుల్ అప్‌డేట్ సపోర్టు పేజీ ప్రకారం.. ఈ ఎక్స్‌టెండెడ్ అప్‌డేట్ సైకిల్‌కు అర్హత ఉన్న డివైజ్‌ల జాబితాలో పిక్సెల్ ఫోల్డ్, పిక్సెల్ 7ఎ, పిక్సెల్ 7 ప్రో, పిక్సెల్ 6 ప్రో, పిక్సెల్ 6, పిక్సెల్ 6a ఉన్నాయి. అమెరికాలో గూగుల్ స్టోర్‌లో డివైజ్ మొదట అందుబాటులోకి వచ్చిన తేదీ నుంచి సాఫ్ట్‌వేర్ సపోర్టు ప్రారంభమవుతుంది. ఉదాహరణకు, అక్టోబర్ 2021లో లాంచ్ అయిన పిక్సెల్ 6 ఫోన్ ఇప్పుడు అక్టోబర్ 2026 వరకు అప్‌డేట్‌లను అందుకుంటుంది. దీని అర్థం.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఓఎస్ కూడా అందుకుంటుందని భావిస్తున్నారు.
జూలై 2022లో విడుదలైన పిక్సెల్ 6ఎ, జూలై 2027 వరకు అప్‌డేట్‌లను అందుకోనుంది. జూన్ 2027 నాటికి ఆండ్రాయిడ్ 18 స్టేబుల్ అప్‌డేట్ అందుబాటులోకి వస్తే.. పిక్సెల్ 6a కూడా అర్హత పొందవచ్చు. అదేవిధంగా, అక్టోబర్ 2022లో లాంచ్ అయిన పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రోలు కూడా ఐదేళ్ల సపోర్టును అందుకుంటాయి. ఈ కొత్త అప్‌డేట్‌లను 2027 వరకు పొడిగించవచ్చు. తద్వారా వాటిని ఆండ్రాయిడ్ 18కి అర్హత పొందవచ్చు. మే 2023లో ప్రవేశపెట్టిన పిక్సెల్ 7a, ఇప్పటికీ కొత్త ఫోన్ మాదిరిగానే మరికొన్ని సంవత్సరాల పాటు అప్‌డేట్స్ కొనసాగుతాయి.
ఆండ్రాయిడ్ 16 క్యూ2 2025లో విడుదల అవుతుందని అంచనా. అదే సంవత్సరంలో మరో కొత్త అప్‌డేట్ రానుంది. పిక్సెల్ 6, పిక్సెల్ 7 సిరీస్ వంటి పాత ఫోన్‌లు ఇప్పటికే ఆండ్రాయిడ్ 16 డెవలపర్ ప్రివ్యూని అందుకున్నాయి. 2025 ఏడాదిలో ఎప్పుడైనా స్టేబుల్ వెర్షన్‌ను అందుకునే అవకాశం ఉంది.
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 7 ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ. 30,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. పిక్సెల్ 7ఎ అదే ప్లాట్‌ఫారమ్‌లో రూ. 27,999కి జాబితా అయింది. పిక్సెల్ 6ఎ ఫోన్ ధర రూ. 43,999కి అందుబాటులో ఉంది. పిక్సెల్ 7ప్రో దాదాపుగా పిక్సెల్ 6ఎ ధరకే అమ్ముడవుతోంది. ఈ ఫోన్ రూ. 44,999 వద్ద జాబితా అయింది.
Read Also : TVS Ronin 2025 : టీవీఎస్ కొత్త రోనిన్ బైక్ వచ్చేసింది.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంతంటే?