Google Pixel 8 to Vivo V29 series, a look at smartphones launching in October
Upcoming Smartphones October : స్మార్ట్‌ఫోన్ ప్రియులందరికీ గుడ్ న్యూస్.. అక్టోబర్‌లో అనేక స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి. (Vivo V29 Series) నుంచి (Google Pixel 8 Series) సిరీస్ వరకు ఈ నెలలో చాలా ఫోన్‌లు రిలీజ్ కానున్నాయి. రాబోయే ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లకు సంబంధించిన ఊహాగానాలు కొంతకాలంగా ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. లాంచ్ కానున్న కొన్ని స్మార్ట్‌ఫోన్‌లను సంబంధించిన వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
గూగుల్ పిక్సెల్ 8, గూగుల్ పిక్సెల్ 8 ప్రో :
గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ అక్టోబర్ 4న లాంచ్ కానుంది. ఈ సిరీస్‌లో (Google Pixel 8), (Google Pixel 8 Pro) అనే 2 మోడల్‌లు ఉంటాయి. లీకైన స్పెషిఫికేషన్ల ప్రకారం.. గూగుల్ పిక్సెల్ 8 6.17-అంగుళాల ఫుల్ HD AMOLED డిస్ప్లేతో 120HZ రిఫ్రెష్ రేట్, 2400×1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. మరోవైపు, ప్రీమియం పిక్సెల్ 8 ప్రో 3120×1440 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల OLED డిస్‌ప్లేను చూడవచ్చు. గూగుల్ పిక్సెల్ 8 మాదిరిగా గూగుల్ పిక్సెల్ 8 ప్రో కూడా 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండవచ్చు. అదనంగా, రెండు స్మార్ట్‌ఫోన్‌లు 50MP ప్రైమరీ రియర్ కెమెరాతో వస్తాయని భావిస్తున్నారు.
Read Also : iPhone 15 Pro Heating issue : హమ్మయ్యా.. ఐఫోన్ 15 ప్రో హీటింగ్ సమస్యకు అసలు కారణం ఆపిల్ కనిపెట్టేసింది..!
గూగుల్ పిక్సెల్ 8 అల్ట్రా-వైడ్ యాంగిల్ షాట్‌లతో సోనీ IMX386 సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండవచ్చు. పిక్సెల్ 8 ప్రో ఫోన్ 64MP, 48MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. రెండు ఫోన్‌ల ఫ్రంట్ కెమెరాలో 11MP సెన్సార్ ఉండే అవకాశం ఉంది. పిక్సెల్ ఫోన్‌లు గతంలో కెమెరా పర్పార్మెన్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. ఈసారి గూగుల్ పిక్సెల్ ఫోన్లపై ఎలాంటి ఆఫర్ చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ధర పరంగా, గూగుల్ పిక్సెల్ 8 EUR 799 యూరోల (సుమారు రూ. 70,200) ధరతో లాంచ్ కావచ్చునని అంచనా. అయితే, గూగుల్ పిక్సెల్ 8 ప్రో ప్రారంభ ధర EUR 1099 (దాదాపు రూ. 96,500)గా ఉంటుంది.
వివో V29, వివో V29 ప్రో సిరీస్ :
అక్టోబర్ 4న ఆవిష్కరించనున్న మరో స్మార్ట్‌ఫోన్ లైనప్ Vivo V29 సిరీస్. వివో V29, వివో V29 ప్రో అనే 2 ఫోన్‌లు భారత మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్‌లు 3 విభిన్న కలర్ ఆప్షన్లలో వస్తాయి. Vivo V29 బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు ముందు ఫ్లిప్‌కార్ట్‌లో లిస్టు అయింది. ఈ ఫోన్‌లో అల్ట్రా స్లిమ్ కర్వ్డ్ డిస్‌ప్లే ఉన్నట్లు వెబ్‌సైట్ చూపిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో పోస్ట్ ప్రకారం.. వెనుక ప్యానెల్ బ్లూ కలర్ ఆప్షన్‌లో ఉంటుంది. రెండు కెమెరా సెన్సార్‌లను కలిగిన కెమెరా మాడ్యూల్, వివో సిగ్నేచర్ రింగ్ లైట్‌ను వివో V27 ప్రోలో కూడా చూడవచ్చు.
Upcoming Smartphones October : Google Pixel 8 to Vivo V29 series launching in October
ముందు భాగంలో వివో V29 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 778G చిప్‌సెట్ ద్వారా పవర్ పొందే అవకాశం ఉంది. మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. ఈ డివైజ్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఉండవచ్చు. వివో V29 ప్రో విషయానికి వస్తే.. 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సర్టిఫికేషన్‌తో 1.5K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. నివేదికల ప్రకారం.. ఈ ఫోన్ MediaTek Dimensity 8200 చిప్‌తో పనిచేసే అవకాశం ఉంది. వివో ఫోన్ 50MP ప్రైమరీ కెమెరాను కూడా కలిగి ఉండవచ్చు.
Samsung Galaxy S23 FE :
శాంసంగ్ గెలాక్సీ S23 FE ఫోన్ కూడా అక్టోబర్ 4న లాంచ్ కానుంది. ఈ ఫోన్ 6.4-అంగుళాల డిస్‌ప్లే, 50MP + 8MP + 12MP కెమెరా సెన్సార్‌లతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఫ్రంట్ కెమెరా 10MPగా ఉంటుందని భావిస్తున్నారు. శాంసంగ్ ఫోన్ 4500mAh బ్యాటరీని కలిగి ఉండే అవకాశం ఉంది. శాంసంగ్ Exynos 2200 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 55వేల లోపు ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ S23 మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.