iPhone 15 Pro Heating issue : హమ్మయ్యా.. ఐఫోన్ 15 ప్రో హీటింగ్ సమస్యకు అసలు కారణం ఆపిల్ కనిపెట్టేసింది..!

iPhone 15 Pro Heating issue : ఐఫోన్ 15 ప్రో మోడల్స్‌లో ఓవర్ హీటింగ్ సమస్యకు అసలు కారణం ఏంటో ఆపిల్ ఎట్టకేలకు కనిపెట్టేసింది. త్వరలో ఈ సమస్యకు పరిష్కారాన్ని అందించనుంది.

iPhone 15 Pro Heating issue : హమ్మయ్యా.. ఐఫోన్ 15 ప్రో హీటింగ్ సమస్యకు అసలు కారణం ఆపిల్ కనిపెట్టేసింది..!

iPhone 15 Pro Heating issue : bug in iOS 17, Apple promises software update to fix the issue

iPhone 15 Pro Heating issue : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) సెప్టెంబర్ 12న జరిగిన (Wonderlust) ఈవెంట్‌లో (iPhone 15 Series) సిరీస్‌ను లాంచ్ చేసింది. అయితే, ఐఫోన్ 15 సిరీస్ Pro మోడల్‌లలో వినియోగదారులు హీటింగ్ సమస్యలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా iOS 17లోని బగ్, ఇతర కారణాల వల్ల ఈ ఓవర్ హీటింగ్ సమస్యలు (iPhone 15 Pro Overheating) తలెత్తుతున్నాయని ఆపిల్ ధృవీకరించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 12న జరిగిన వండర్‌లస్ట్ ఈవెంట్‌లో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ (CEO Tim Cook) ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro) మోస్ట్ ఇంట్రెస్టింగ్ మోడల్ అని చెప్పారు. అయితే, సెప్టెంబరు 22న అమ్మకానికి వచ్చిన ఈ ఫోన్ హీటింగ్ సమస్యలు ఉన్నాయని తేలింది.

కొంతమంది వినియోగదారులు ఈ ఐఫోన్ హ్యాండిల్ చేయలేనంత వేడిగా ఉందని ఫిర్యాదులు చేశారు. మరికొందరు థర్మామీటర్‌తో ఫోన్ ఉష్ణోగ్రతను కొలిచిన తర్వాత ఫొటోలను కూడా షేర్ చేశారు. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ రెండింటిలో హీటింగ్ సమస్యలు ఉన్నాయని, టైటానియం బాడీ కారణంగా ఇలా హీటింగ్ వస్తుందని ఊహాగానాలు వినిపించాయి. వాస్తవానికి ఆపిల్ ఈ టైటానియం బాడీని మొదటిసారిగా ప్రవేశపెట్టింది. ఇప్పుడు, ఈ ఐఫోన్ 15 ప్రో మోడల్స్ హీటింగ్ సమస్య తలెత్తడానికి ఐఓఎస్ 17 (iOS 17 Update)లోని బగ్ కారణమని కంపెనీ క్లారిటీ ఇచ్చింది.

iOS 17లో బగ్.. హీటింగ్ ఇష్యూ ఫిక్స్ చేస్తాం :
ఆపిల్ ఐఫోన్ 15 (Apple iPhone 15), ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ హీటింగ్ సమస్యలపై ఒక ప్రకటనలో ఆపిల్ పేర్కొంది. ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ అంచనా కంటే కొంచెం వెచ్చగా ఉందని గుర్తించినట్లు తెలిపింది. మీరు డివైజ్ సెటప్ చేసినప్పుడు లేదా రీస్టార్ట్ చేసినప్పుడు ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో ప్రారంభంలో వేడెక్కవచ్చని టెక్ దిగ్గజం చెబుతోంది. iOS 17లో బగ్, థర్డ్-పార్టీ యాప్ అప్‌డేట్‌లు కూడా ఫోన్ వేడెక్కడానికి దారితీయవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ (iOS 17)లో బగ్‌ను ఫిక్స్ చేయడం ద్వారా ఫోన్ హీటింగ్ సమస్యను పరిష్కరిస్తామని ఆపిల్ తెలిపింది. CNET ప్రకారం.. రాబోయే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా iPhone 15 Pro మోడల్‌ల పర్ఫార్మెన్స్ ప్రభావితం చేయదని కుపెర్టినో దిగ్గజం పేర్కొంది.

Read Also : Apple Warn iPhone 15 Users : ఐఫోన్ 15 యూజర్లకు ఆపిల్ వార్నింగ్.. ఆండ్రాయిడ్ ఛార్జర్లను పొరపాటున కూడా వాడొద్దు.. తస్మాత్ జాగ్రత్త..!

పరికరాన్ని సెటప్ చేసిన తర్వాత లేదా రీబూట్ చేసిన తర్వాత మొదటి కొన్ని రోజుల్లో బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీ కారణంగా డివైజ్ కొంచెం వేడిగా అనిపించవచ్చు. iOS 17లో కొంత మంది వినియోగదారులను ప్రభావితం చేసే బగ్‌ను కూడా గుర్తించాం. రాబోయే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో ఈ సమస్య ఫిక్స్ చేస్తాం. మరో సమస్య కూడా ఉందని, థర్డ్-పార్టీ యాప్‌లకు కొన్ని ఇటీవలి అప్‌డేట్‌లు సిస్టమ్‌ను ఓవర్‌లోడ్ చేసేలా కారణమవుతున్నాయి. ఈ యాప్ డెవలపర్‌లతో చర్చింది త్వరలోనే సమస్యలను ఫిక్స చేస్తాం’ అని కంపెనీ తెలిపింది.

iPhone 15 Pro's heating issues are due to a bug in iOS 17, Apple promises software update to fix the issue

iPhone 15 Pro’s heating issues Apple promises software update

ఐఫోన్ 15 ప్రో కలర్ మార్పు :
ఇంతకుముందు, సపోర్ట్ డాక్యుమెంట్‌లో.. ఆపిల్ ఐఫోన్ 15 ప్రో టైటానియం బాడీని కలిగి ఉన్నందున యూజర్ చర్మానికి తాకగానే ప్యానల్ కలర్ తాత్కాలికంగా మారవచ్చునని తెలిపింది. ఈ కలర్ మార్పు అనేది రివర్సబుల్ అని, దీనికి చింతించాల్సిన పని లేదని పేర్కొంది. ఆపిల్ ఐఫోన్ 15 అసలు రూపాన్ని పునరుద్ధరించడానికి ఒక మార్గాన్ని కూడా ఆపిల్ షేర్ చేసింది. అదేంటంటే.. iPhone 15 Pro, iPhone 15 Pro Max ఫోన్ టైటానియం బాడీ చర్మానికి తాకగానే తాత్కాలికంగా బయటి బ్యాండ్ కలర్ మారిపోతుంది. మీ ఐఫోన్‌ను మెత్తగా, కొద్దిగా తడిగా, మెత్తటి వస్త్రంతో తుడవడం వల్ల అసలు రంగుకు మారిపోతుందని డాక్యుమెంట్ పేర్కొంది.

iPhone 15 ప్రో ధర, టాప్ స్పెషిఫికేషన్లు :
భారత మార్కెట్లో గత ఏడాదిలో ఐఫోన్ 14 ప్రోతో పోలిస్తే.. ఐఫోన్ 15 ప్రో ధరలు భారీగా పెరిగాయి. ఐఫోన్ 15 ప్రో మొత్తం 4 స్టోరేజ్ వేరియంట్‌లు లాంచ్ అయ్యాయి. 128GB వేరియంట్ ధర రూ.1,34,900 కాగా, 256GB వేరియంట్ ధర రూ.1,44,900, 512GB వేరియంట్ రూ. 1,64,900, 1TB వేరియంట్ ధర రూ. 1,84,900గా ఉన్నాయి. ఐఫోన్ 15 మోడల్ బ్లాక్ టైటానియం, వైట్ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్ టైటానియం అనే 4 కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

ఐఫోన్ 15 ప్రో గ్రేడ్ 5 టైటానియం బాడీని కలిగి ఉంది. ఫోన్‌ను మరింత మన్నికైనదిగా, బరువు తేలికగా ఉంటుంది. ఈ ఐఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో ఐఫోన్‌లో సన్నని ఎడ్జ్‌లను కలిగి ఉంది. ముందు భాగంలో అదనపు ప్రొటెక్షన్ లేయర్ సిరామిక్ షీల్డ్ ఉంది. ఈ ఐఫోన్ అంచులు కూడా గుండ్రంగా, మృదువుగా ఉంటాయి. గత ఏడాది ఐఫోన్ ప్రో మోడల్‌ల మాదిరిగానే.. ఈ ఐఫోన్ డైనమిక్ ఐలాండ్ నాచ్‌ను కలిగి ఉంది. ఆపిల్ సాధారణ మ్యూట్ బటన్‌కు బదులుగా యాక్షన్ బటన్‌ను కూడా తీసుకొచ్చింది.

ఐఫోన్ 15 ప్రో ఇతర ఫీచర్లు :
ఐఫోన్ 15 ప్రో A17 ప్రో ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. పర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్‌లకు తగినట్టుగా ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే.. ఐఫోన్ 15 ప్రో అధిక రిజల్యూషన్ ఫొటోలను క్లిక్ చేయడానికి సపోర్టుతో 48MP ప్రధాన కెమెరాను కలిగి ఉంది. కెమెరాలలో 3 ఫోకల్ లెంగ్త్‌ల 24mm, 28mm, 35 mm మధ్య మారడానికి అనుమతిస్తుంది. ఇందులో ఒక కొత్త డిఫాల్ట్‌గా కూడా ఎంచుకోవచ్చు. ప్రైమరీ కెమెరాతో కాకుండా ఐఫోన్ 15 Pro విస్తారమైన 3x టెలిఫోటో కెమెరాతో కూడా వస్తుంది. బ్యాటరీ పరంగా, ఐఫోన్ 15 ప్రో ఒకసారి ఛార్జ్ చేస్తే.. రోజంతా ఉంటుందని ఆపిల్ పేర్కొంది. లైనప్‌లోని ఇతర ఫోన్‌ల మాదిరిగానే టైప్-C USB పోర్ట్ ద్వారా బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు.

Read Also : iPhone Heating Issues : ఐఫోన్‌లో iOS 16.4.1 అప్‌డేట్ చేశారా? మీ ఫోన్ వెంటనే హీటెక్కుతోందా? ఈ టిప్స్ తప్పక పాటించండి!