Joker Malware Returns : మీ ఫోన్‌లో ఈ 8 యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి!

వామ్మో జోకర్ మాల్‌వేర్ మళ్లీ వచ్చిందట.. మీ ఫోన్‌లో పర్సనల్ డేటా, బ్యాంకు అకౌంట్లో డబ్బులు జాగ్రత్త.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఫ్రీగా యాప్స్ డౌన్ లోడ్ చేసి ఇన్ స్టాల్ చేస్తున్నారా?

Joker Malware Returns : వామ్మో జోకర్ మాల్‌వేర్ మళ్లీ వచ్చిందట.. మీ ఫోన్‌లో పర్సనల్ డేటా, బ్యాంకు అకౌంట్లో డబ్బులు జాగ్రత్త.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఫ్రీగా యాప్స్ డౌన్ లోడ్ చేసి ఇన్ స్టాల్ చేస్తున్నారా? ఈ జోకర్ మాల్ వేర్ కొన్ని యాప్స్‌లలో సీక్రెట్‌గా హైడ్ అయి ఉంటుందట. అందుకే ఈ యాప్స్ మీ ఫోన్లో ఉంటే వెంటనే డిలీట్ చేయమంటోంది బెల్జియం పోలీసులు. ఈ డేంజరస్ జోకర్ వైరస్.. గూగుల్ ప్లే స్టోర్లలోని యాప్స్ లో తిష్టవేసి ఉందని హెచ్చరించారు. ఆండ్రాయిడ్ ఫోన్లపై ఈ వైరస్ ఎప్పుడైనా ఎటాక్ చేసే ప్రమాదం ఉందని అంటున్నారు. జోకర్ వైరస్ ఉన్న యాప్స్ ఇన్ స్టాల్ చేసుకున్న యూజర్ల ఫోన్లలో వారి అనుమతి లేకుండానే పేమెంట్ సర్వీసులను హ్యాకర్ల కంట్రోల్ లోకి వెళ్లిపోతాయి. ఈ వైరస్ హైడ్ మోడ్‌లో ఉండటంతో గుర్తించడం కష్టమని అంటున్నారు. గూగుల్ బ్యాన్ చేసిన ఈ ఎనిమిది యాప్స్ లలో జోకర్ వైరస్ ఉందని బెల్జియన్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా ఈ యాప్స్ డౌన్ లోడ్ చేసుకుని ఉంటే వెంటనే డిలీట్ చేసుకోవాలంటున్నారు. ఒకవేళ ఈ యాప్స్ ఇన్ స్టాల్ చేసి ఉంటే.. మీకు తెలియకుండానే మీ పర్సనల్ డేటా, బ్యాంకు అకౌంట్లలో నగదుతో పాటు అన్ని వివరాలు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ 8 యాప్స్ లో డేంజరస్ వైరస్ ఉందని క్విక్ హీల్ సెక్యూరిటీ ల్యాబ్స్ పరిశోధకులు గుర్తించారు. దాంతో మాల్ వేర్ యాప్స్ ను గూగుల్ తమ ప్లే స్టోర్ నుండి తొలగించింది. ఇప్పటికే ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యూజర్లు ఈ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకుని ఉంటే.. వెంటనే ఫోన్లలో నుంచి డిలీట్ చేయాలంటూ హెచ్చరిస్తోంది.
Google Apps : మొబైల్ యూజర్లకు వార్నింగ్.. వెంటనే ఈ యాప్స్ డిలీట్ చేయండి

ఈ డేంజరస్ జోకర్ మాల్ వేర్.. మీ ఫోన్లో డేటాను హ్యాకర్ల డార్క్ వెబ్ లో అమ్మేస్తుంది. మీ అకౌంట్లలో డబ్బులను కాజేస్తారు. జోకర్‌ మాల్‌వేర్‌ తొలిసారిగా 2017 గూగుల్‌ ప్లేస్టోర్‌లో గుర్తించారు. క్విక్ హీల్ రీసెర్చర్ల ప్రకారం.. జోకర్‌ ఒక డేంజరస్ మాల్‌వేర్‌. యూజర్‌కు తెలియకుండానే క్షణాల్లో అకౌంట్లను ఖాళీ చేసేస్తుంది. ఆండ్రాయిడ్‌ యూజర్ల ఫోన్లలో యాడ్స్‌ రూపంలో ఈ మాల్‌వేర్‌ చొరబడుతుంది. మీ మెసేజ్‌లు, ఓటీపీ, పాస్‌వర్డ్‌లు, పేమెంట్‌ల వివర్లను క్యాప్చర్ చేసి హ్యాకర్లకు చేరవేస్తుంది. ఇంతకీ జోకర్ మాల్ వేర్ ఉన్న గూగుల్ బ్యాన్ చేసిన ఆ ఎనిమిది యాప్స్ జాబితాను బెల్జీయం పోలీసులు రిలీజ్ చేశారు. అందులో Auxiliary Message, Element Scanner, Fast Magic SMS, Free Cam Scanner, Go Messages, Super Message, Super SMS, Travel Wallpapers యాప్స్ లో ఉన్నాయని గుర్తించారు. ఈ యాప్స్ మీ ఫోన్లో ఉంటే వెంటనే డిలీట్ చేయడం మంచిది. లేదంటే విలువైన డేటాను కోల్పోతారు.. తస్మాత్ జాగ్రత్త..

ట్రెండింగ్ వార్తలు