Google Apps : మొబైల్ యూజర్లకు వార్నింగ్.. వెంటనే ఈ యాప్స్ డిలీట్ చేయండి

మీ స్మార్ట్ ఫోన్ లో ఈ 8 యాప్స్ ఉన్నాయా? అయితే వెంటనే అలర్ట్ అవ్వండి. ఆ యాప్స్ ను డిలీట్ చేయండి.. లేదంటే.. భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ యాప్స్

Google Apps : మొబైల్ యూజర్లకు వార్నింగ్.. వెంటనే ఈ యాప్స్ డిలీట్ చేయండి

Google Apps

Google Apps : టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. అన్ని పనులు సులభంగా మారాయి. ఇక స్మార్ట్ ఫోన్లు వచ్చాక పనులు మరింత ఈజీ అయ్యాయి. చాలా పనులు ఫోన్ లోనే నిమిషాల్లో అయిపోతున్నాయి. దీంతో చాలామంది స్మార్ట్ ఫోన్లపై డిపెండ్ అయ్యారు. అదే సమయంలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. సైబర్ క్రిమినల్స్, హ్యాకర్లు ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. ఫేక్ యాప్ లతో అడ్డంగా దోచేస్తున్నారు. తాజాగా హ్యాకర్ల కన్ను క్రిప్టో కరెన్సీ యాప్స్ మీద పడింది.

ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ అందరి దృష్టిని అట్రాక్ట్ చేస్తోంది. అదే సమయంలో హ్యాకర్లు రెడీ అయిపోయారు. స్మార్ట్ ఫోన్లలో డేంజరస్ మాల్ వేర్, ఆడ్ వేర్ ఇన్ స్టాల్ చేయించి అమాయకులను దోచుకుంటున్నారు. ఈ క్రమంలో గూగుల్ అలర్ట్ అయ్యింది. 8 ప్రమాదకర యాప్ లను గుర్తించింది. వెంటనే స్మార్ట్ ఫోన్ యూజర్లను అలర్ట్ చేసింది. క్రిప్టో కరెన్సీస్ మైనింగ్ యాప్స్ లో పలు హానికారకమైనవి కనుగొంది. వెంటనే ఆ యాప్స్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డిలీట్ చేసింది. స్మార్ట్ ఫోన్ యూజర్లు కనుక వాటిని ఇన్ స్టాల్ చేసుకుని ఉంటే వెంటనే అన్ ఇన్ స్టాల్ చేయాలని చెప్పింది.

సేఫ్టీ ఫర్మ్ ట్రెండ్ మైక్రో నివేదిక ప్రకారం.. 8 యాప్ లు ప్రమాదకరం. వెంటనే వాటిని గూగుల్ దృష్టికి తీసుకెళ్లింది. గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి వాటిని తొలగించింది. ప్లే స్టోర్ నుంచి తొలగించినప్పటికి ప్రమాదం పోలేదు. ఒకవేళ మీరు మీ ఫోన్ లో ఆ యాప్స్ ఇన్ స్టాల్ చేసి ఉంటే వెంటనే అన్ ఇన్ స్టాల్ చేయాలని గూగుల్ కోరింది.

ఆ 8 డేంజరస్ యాప్ లు ఇవే..

– BitFunds – Crypto Cloud Mining.
– Bitcoin Miner – Cloud Mining.
– Bitcoin (BTC) – Pool Mining Cloud Wallet.
– Crypto Holic – Bitcoin Cloud Mining.
– Daily Bitcoin Rewards – Cloud Based Mining System.
– Bitcoin 2021.
– MineBit Pro – Crypto Cloud Mining & btc miner.
– Ethereum (ETH) – Pool Mining Cloud.

ఇందులో రెండు యాప్స్ పెయిడ్ యాప్స్. యూజర్లు వాటికి డబ్బులు కట్టాల్సి ఉంది. ఒక యాప్ కి రూ.966, మరో యాప్ కి రూ.455 బిట్ కాయిన్ రూపంలో చెల్లించాలి.

ఇవే కాదు ఇంకా 120 క్రిప్టోకరెన్సీ మైనింగ్ యాప్స్ ఉన్నాయని, వాటి వల్ల నష్టమే తప్ప లాభం లేదని ట్రెండ్ మైక్రో తెలిపింది. ఆ యాప్స్ కారణంగా 4వేల 500 యూజర్లు ఎఫెక్ట్ అయినట్టు వెల్లడించింది.