ఫిక్సల్ 3 కెమెరా Fix: ఆండ్రాయిడ్ సెక్యూరిటీ Update

గూగుల్ ఫిక్సల్ 3 ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.. ఫిక్సల్ 3 డివైజ్ ల్లో కెమెరా ఫిక్స్ చేసేందుకు కొత్త సెక్యూరిటీ అప్ డేట్ ను రిలీజ్ చేసింది. అదే.. మార్చి 2019 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్ డేట్.

  • Published By: sreehari ,Published On : March 5, 2019 / 10:08 AM IST
ఫిక్సల్ 3 కెమెరా Fix: ఆండ్రాయిడ్ సెక్యూరిటీ Update

Updated On : March 5, 2019 / 10:08 AM IST

గూగుల్ ఫిక్సల్ 3 ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.. ఫిక్సల్ 3 డివైజ్ ల్లో కెమెరా ఫిక్స్ చేసేందుకు కొత్త సెక్యూరిటీ అప్ డేట్ ను రిలీజ్ చేసింది. అదే.. మార్చి 2019 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్ డేట్.

గూగుల్ ఫిక్సల్ 3 ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్.. ఫిక్సల్ 3 డివైజ్ ల్లో కెమెరా ఫిక్స్ చేసేందుకు కొత్త సెక్యూరిటీ అప్ డేట్ ను రిలీజ్ చేసింది. అదే.. మార్చి 2019 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్ డేట్. ఇందులో రెండు వివిధ ప్యాచ్ లెవల్స్ ఉంటాయి. హై నుంచి క్రిటికల్ స్థాయిల్లో ఇష్యులను ఫిక్స్ చేస్తాయి. ఈ కొత్త అప్ డేట్ తో ఇప్పటికే గూగుల్ 45కు పైగా సెక్యూరిటీ ఇష్యులను ఫిక్స్ చేసింది. గూగుల్ అందించే ఫిక్సల్ 3, ఫిక్సల్ 3 ఎక్స్ఎల్, ఫిక్సల్ 2, ఫిక్సల్ 2 ఎక్స్ఎల్, ఫిక్సల్ ఎక్స్ఎల్, ఫిక్సల్ సి ట్యాబెట్ వంటి స్మార్ట్ ఫోన్ల కోసం ప్రత్యేకించి గూగుల్ ఈ సెక్యూరిటీ అప్ డేట్ ను రిలీజ్ చేసింది.
Also Read : పేరంట్స్ Ok అనాలంట : PUBG గేమ్‌కు ఏజ్ లిమిట్

ఫిక్సల్ 3, ఫిక్సల్ 3 ఎక్స్ ఎల్ యూజర్ల ఫోన్లలో ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్ డేట్.. కెమెరా యాప్ జనరల్ రెస్పాన్సీవ్ ను మెరుగుపరుస్తుంది. అంతేకాదు.. ఫిక్సల్ 3 మోడల్స్ లోని స్టోరేజీ సామర్థ్యం, బ్లూటూత్ రిలియబులిటీని కూడా మెరుగుపరుస్తుంది. 2019-03-01, 18 ప్యాచ్ లెవల్ తో 27వరకు ఇష్యులను ఆండ్రాయిడ్ అప్ డేట్ రిజాల్వ్ చేసింది. కెర్నల్, క్వాల్ కామ్న్ కంపోనెట్స్ కు సంబంధించిన సిస్టమ్ ఇష్యులను కూడా ఈ అప్ డేట్ తో ఫిక్స్ చేయొచ్చు. 

ఇన్ స్టాల్ చేయండిలా: 2019 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్ డేట్..
* ఫిక్సల్ ఫోన్, ట్యాబ్లెట్ డివైజ్ లాక్ ఓపెన్ చేయండి. 
* సెట్టింగ్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
* సిస్టమ్, అడ్వాన్స్ డ్, స్టిస్టమ్ అప్ డేట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
* అంతే.. వెంటనే ఈ ఫిక్సల్ 3 డివైజ్ అప్ డేట్ అవుతుంది. 
* ఫ్యాక్టరీ ఇమేజ్ లను డౌన్ లోడ్ చేసుకోండి.
* లేటెస్ట్ అప్ డేట్ తో డివైజ్ ను ప్లాష్ చేయండి.
* డివైజ్ ను ఫ్లాష్ చేసే ముందు మీ డేటాను బ్యాకప్ తీసుకోండి. 
* కొత్త ప్యాకేజీ అప్ డేట్.. మీ డివైజ్ లోని ఎగ్జిస్ట్ డేటాను డిలీట్ చేస్తుంది.
Also Read : ఫీచర్ డిజేబుల్డ్ : ఆండ్రాయిడ్ టీవీలో బగ్.. యూజర్ల ఫొటోలు లీక్

OTA జిప్ ఫైల్స్ :
మార్చి ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్ డేట్ ను ఫిక్సల్ 3 డివైజ్ లో ఇన్ స్టాల్ చేసుకోనేందుకు గూగుల్ OTA జిప్ ఫైల్స్ ను విడుదల చేసింది. 
* అన్ లాకడ్ బూట్ లోడర్ సాయంతో మీ డివైజ్ లో సెక్యూరిటీ అప్ డేట్ ను డౌన్ లోడ్ చేసుకొని ఇన్ స్టాల్ చేయొచ్చు.
* లేటెస్ట్ సెక్యూరిటీ అప్ డేట్ పొందాలంటే.. ఫిక్సల్ డివైజ్ ల్లో రీసెంట్ ఆండ్రాయిడ్ వర్షన్ ఉండి ఉండాలి. 
Also Read : డోంట్ మిస్ : Airtel 4G మైండ్ బ్లోవింగ్ ఆఫర్స్