Android Users : ఆండ్రాయిడ్ యూజర్లు.. ఇకపై ఆపిల్ ఐఫోన్ మాదిరిగానే బ్యాటరీ హెల్త్ చెక్ చేసుకోవచ్చు..!

Android Users : ఆండ్రాయిడ్ యూజర్లు బ్యాటరీ హెల్త్ చెక్ చేసుకునేందుకు వీలుగా గూగుల్ ఒక ఫీచర్‌పై పనిచేస్తోందని నివేదించింది. ఈ ఫీచర్ ఇప్పటికే ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.

Google will soon allow Android users to check their battery health just like iPhone

Android Users : ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ సరికొత్త ఫీచర్ ఒకటి తీసుకొస్తోంది. ఐఫోన్లలో మాదిరిగా బ్యాటరీ హెల్త్ చెక్ చేసుకునేందుకు ఈ కొత్త ఫీచర్ పనిచేస్తుంది. సాధారణంగా ఏదైనా ఒక ఫోన్ ఎక్కువ సంవత్సరాలు పనిచేయాలంటే బ్యాటరీని తప్పనిసరిగా మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే.. ఫోన్ బ్యాటరీలు కాలక్రమేణా మన్నిక తగ్గిపోతాయి. మీ ఫోన్‌లో వేగంగా పవర్ అయిపోతుంది. కొత్త బ్యాటరీని ఎప్పుడు మార్చుకోవాలో తెలుసుకోవడం చాలా కష్టం. బ్యాటరీ జీవితకాలం ఎంత ఉందో చెక్ చేయడానికి సులభమైన మార్గం లేదు. కొన్ని యాప్‌లు ఉన్నప్పటికీ కచ్చితమైన సూచనలు అందించలేవు. వాటిని గుర్తించడానికి చాలా సమయం కావాలి.

కొన్నిసార్లు థర్డ్ పార్టీ యాప్‌లను నమ్మలేని పరిస్థితి. భద్రత విషయంలో అనేక సమస్యలు తలెత్తవచ్చు. అదే.. ఆపిల్ ఐఫోన్ వినియోగదారులు ప్రత్యేక బ్యాటరీ ఆరోగ్య ఫీచర్‌ని కలిగి ఉన్నందున ఈ సమస్య ఆండ్రాయిడ్ యూజర్లలో మాత్రమే కనిపిస్తోంది. కానీ ఇప్పుడు, గూగుల్ తన ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కూడా ఒక ఫీచర్ తీసుకొచ్చే దిశగా ప్రయత్నిస్తోంది. ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ప్రకారం.. బ్యాటరీ స్టేటస్ చూపించడానికి గూగుల్ ఇప్పటికే ఆండ్రాయిడ్ 14లో మార్పులు చేస్తోంది. ఇప్పుడు, మరిన్ని ఫ్యూచర్ అప్‌గ్రేడ్‌లతో ఆండ్రాయిడ్ 15 ప్రత్యేకంగా రిలీజ్ చేయనుంది. కంపెనీ మీ ఫోన్ బ్యాటరీ హెల్త్ గురించి మీకు మరింత చూపించాలని యోచిస్తోంది.

Read Also : Apple iPhone 14 Sale : ఆపిల్ ఐఫోన్ 14పై బిగ్ డిస్కౌంట్.. కేవలం రూ.24,999కే కొనుగోలు చేయొచ్చు.. డోంట్ మిస్!

డిసెంబర్‌లో పిక్సెల్ ఫోన్‌లలో లేటెస్ట్ అప్‌డేట్‌తో గూగుల్ ఫోన్ సెట్టింగ్‌లలో ‘బ్యాటరీ ఇన్ఫర్మేషన్’ అనే కొత్త పేజీని చేర్చింది. మీ బ్యాటరీ ఎప్పుడు తయారు అయింది. ఎన్నిసార్లు ఛార్జ్ అయింది అనే పేజీ మీకు తెలియజేస్తుంది. దానితో పాటు, ఆండ్రాయిడ్ 14తో గూగుల్ కొన్ని కొత్త టూల్స్‌ను కూడా ప్రవేశపెట్టింది. మీరు ఫోన్ బ్యాటరీని ఉపయోగించడం ప్రారంభించినప్పుడు అది ఎలా ఛార్జ్ అవుతుంది. ప్రస్తుత బ్యాటరీ హెల్త్ ఎలా ఉంది దానిపై అవసరమైన వివరాలను షేర్ చేస్తుంది. అయితే, వీటన్నింటితో పాటు మీ బ్యాటరీ ఎంత బాగా పని చేస్తుందో తెలియజేసే డెడికేటెడ్ ‘బ్యాటరీ హెల్త్ ఫీచర్’ని అందించాలని గూగుల్ ప్లాన్ చేస్తోంది.

బ్యాటరీ హెల్త్ ఎలా ఉందో చెక్ చేయొచ్చు :
ఆండ్రాయిడ్ ఫోన్‌ల సెట్టింగ్‌లలో బ్యాటరీ హెల్త్ చూపించే ఫీచర్‌ను తీసుకురావాలని గూగుల్ యోచిస్తున్నట్లు సమాచారం. నివేదిక ప్రకారం.. పిక్సెల్ సహా కొన్ని ఇతర డివైజ్‌లలో వివిధ ఫంక్షన్‌లను కంట్రోల్ చేసే సెట్టింగ్‌ల సర్వీసు యాప్‌కి కొత్త అప్‌డేట్ అందించనుంది. ఇందులోనే బ్యాటరీ హెల్త్ ఎలా ఉంది అనేది గూగుల్ డిస్‌ప్లే చేయనుంది. ఈ యాప్ ఆండ్రాయిడ్ అప్‌డేట్‌ల నుంచి విడిగా అప్‌డేట్ అయినప్పటికీ, బ్యాటరీ హెల్త్ మానిటరింగ్ సెక్షన్ అందించనుంది. సెట్టింగ్‌ల యాప్‌లో కొత్త ‘బ్యాటరీ హెల్త్’ పేజీ గురించి యాప్ కొన్ని సీక్రెట్ సూచనలను అందిస్తోంది.

Google Android users 

కొత్త బ్యాటరీతో పోలిస్తే.. ప్రస్తుతం బ్యాటరీ పనితీరు ఎలా ఉంది అనేది అంచనా వేయగలదు. ముఖ్యంగా, బ్యాటరీ హెల్త్ చూపే సెట్టింగ్‌ పేజీ ఇంకా లైవ్‌లో లేదు. అయితే, ఫీచర్‌ని మాన్యువల్‌గా యాక్టివేట్ చేసి, Settings> Battery కింద కనిపించేలా టెస్టింగ్ చేసింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ కేవలం బ్యాటరీలు కాలక్రమేణా క్షీణించడం, ఛార్జింగ్ తక్కువ గంటల పాటు వస్తుందని హెచ్చరిస్తుంది. కానీ త్వరలో, రాబోయే వారాల్లో బ్యాటరీ హెల్త్ గురించి మరింత సమాచారాన్ని అందించాలని భావిస్తున్నారు.

ఆసక్తికరంగా, ప్రత్యేకమైన బ్యాటరీ ఆరోగ్య ఆప్షన్లను అందించడంలో గూగుల్ ఆసక్తి చూపడం ఇదే మొదటిసారి కాదు. అక్టోబరు 2022లో, గూగుల్ ఆండ్రాయిడ్ 13తో ఇదే విధమైన ప్రయత్నాన్ని చేసింది. ప్రత్యేకంగా బ్యాటరీ హెల్త్ సూచించే ప్రత్యేక విభాగాన్ని పిక్సెల్ ఫోన్‌లలో తీసుకురావాలని భావించింది. దురదృష్టవశాత్తూ, ఈ ఫీచర్ టెస్టింగ్ వరకు వెళ్లలేదు. అయితే, ఇప్పుడు గూగుల్ తన ఫోకస్‌ని పిక్సెల్ ఫోన్‌లకు మించి విస్తరించాలని భావిస్తోంది. వివిధ రకాల డివైజ్‌ల్లోనూ యాక్సెస్ చేయగల కొత్త ఆప్షన్ కోసం ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది.

Read Also : Apple iPhone Lost : మీ ఆపిల్ ఐఫోన్ పోగొట్టుకున్నారా? రాబోయే ఈ కొత్త అప్‌డేట్‌తో దొంగిలించిన డివైజ్ ఎవరూ అన్‌లాక్ చేయలేరు..!