అంతరిక్షంలో వ్యర్థాలతో భూమికి ముప్పు : చెక్క శాటిలైట్లే చక్కని పరిష్కారం..!

Wooden satellites may be the solution to space junk : మనం భూగ్రహంపై పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలు ప్రాణకోటికి ఎంత ప్రాణాంతకంగా మారాయో.. ఇప్పుడు అంతరిక్షంలోనూ వ్యర్థాలు అంతే ప్రాణాంతకంగా మారాయంట.. భూమిపై చెత్త ఉపరితలంపై ఉంటుంది.

కానీ, అంతరిక్షంలోని వ్యర్థాలు మాత్రం గాల్లో తేలియాడుతూ ఉంటాయి. మీరు రోడ్డుపై వెళ్లేటప్పుడు రోడ్డుపై ఉన్న పదునైన రాళ్లన్ని గాల్లో ఎగురుతూ మీపైకి దూసుకోస్తే ఎలా ఉంటుంది. ఓసారి ఊహించుకోండి.. ఎంత డేంజర్.. ఇప్పుడు అంతరిక్షంలో ఇదే పరిస్థితి నెలకొంది.


అంతరిక్షంలో పేరుకుపోయిన చెత్త (స్పేస్ జంక్) శిధిలాలు పెద్ద సమస్యగా మారాయి. మనిషి తయారుచేసిన అనేక శాటిలైట్లు పాడైన స్థితిలో శిధిలాలుగా మారి అంతరిక్షంలో భూకక్ష్య చుట్టూ ప్రమాదకర వేగంతో తిరుగుతున్నాయి.

భూమిపై కంటే అంతరిక్షంలో పనిచేయని శాటిలైట్ల శిధిలాలతో అస్తవ్యస్తంగా మారిందని నాసా సైంటిస్టు జోస్ విల్లాస్ పేర్కొన్నారు. స్పేస్‌లో పేరుకుపోయిన వేలాది శాటిలైట్ వ్యర్థాల ట్రష్ మరింత అధ్వాన్నంగా మారిందని అంటున్నారు.

ఏదైనా మిషన్ పూర్తి కాగానే పనిచేయని శాటిలైట్లన్నంటిని తిరిగి భూవాతావరణంలోకి తీసుకురావాల్సి ఉంటుంది. అలా కాకుండా వాటిని అక్కడే కాల్చివేయడం ద్వారా వేలాది మొత్తంలో చిన్నపాటి అల్యుమినియం కణాలు విడుదలవుతున్నాయి.

ఈ కణాలు భూ వాతావరణానికి హానికరమంటున్నారు. అయితే, స్పేస్ జంక్ సమస్యకు ఒక పరిష్కారం ఉందంటున్నారు జపాన్ సైంటిస్టులు. క్యోటీ యూనివర్శిటీకి చెందిన Sumitomo Forestry జపాన్ కంపెనీ బృందం చక్కని పరిష్కారాన్ని సూచిస్తోంది.

అంతరిక్షంలో చెత్తను తగ్గించాలంటే.. చెక్కతో నిర్మించిన శాటిలైట్లు ఎంతో బెటర్ అంటోంది. అందుకే చెక్క శాటిలైట్లను జపాన్ రీసెర్చర్లు తయారుచేస్తున్నారు. ఈ కొత్త ఆలోచనతో.. అంతరిక్షంలో వాటిని కాల్చేసినప్పుడు ఎలాంటి అల్యుమినియం కణాలు విడుదల కావని అంటున్నారు. సాంప్రదాయక శాటిలైట్లతో అంతరిక్షంలో వ్యర్థాలను తగ్గించవచ్చునని అంటోంది.