DeFi Hacking: హ్యాక్ అయిన డీఫై యాప్.. రూ.12వేల కోట్లు లూటీ

డీసెంట్రలైజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ భారీ మొత్తంలో హ్యాకింగ్ కు గురైంది. సరికొత్త ట్రేడింగ్‌గా ట్రెండ్‌ అవుతోన్న క్రిప్టోకరెన్సీ వ్యవస్థకే ఇది పెద్ద షాక్. పటిష్టమైన భద్రతా వ్యవస్థగా చెప్పుకుంటున్న బ్లాక్‌చైయిన్‌ను హ్యాకర్లు బ్రేక్ చేశారు.

DeFi Hacking: హ్యాక్ అయిన డీఫై యాప్.. రూ.12వేల కోట్లు లూటీ

Defi

Updated On : August 11, 2021 / 5:47 PM IST

DeFi Hacking: డీసెంట్రలైజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ భారీ మొత్తంలో హ్యాకింగ్ కు గురైంది. సరికొత్త ట్రేడింగ్‌గా ట్రెండ్‌ అవుతోన్న క్రిప్టోకరెన్సీ వ్యవస్థకే ఇది పెద్ద షాక్. పటిష్టమైన భద్రతా వ్యవస్థగా చెప్పుకుంటున్న బ్లాక్‌చైయిన్‌ను హ్యాకర్లు బ్రేక్ చేశారు. చరిత్ర నివ్వెరపోయే రీతిలో దాదాపు రూ.12వేల కోట్లు విలువ చేసే క్రిప్టో కరెన్సీని కొల్లగొట్టారు.

డీఫై యాప్‌
బ్యాంకులు చేసే అప్పులు ఇవ్వడం, తీసుకోవడం , మార్పిడి, లాభాలు తదితర పనులన్నింటికీ మారకంగా క్రిప్టోకరెన్సీని ఉపయోగిస్తారు. ఇదంతా బ్లాక్‌‌చెయిన్‌ అనే ఆర్టిఫీయల్‌ ఇంటిలిజెన్స్‌ ఆధారంగా జరుగుతుంది. ఈ సర్వీసులు అందించే యాప్‌లను ‘డీడీఫై యాప్‌’ అంటే డీ సెంట్రలైజ్డ్‌ యాప్‌ అని అంటారు. ఇలా పని చేసే పాలినెట్‌వర్క్‌ డీఫై యాప్‌ హ్యాకింగ్‌కి గురైంది.

12 వేల కోట్లు
పాలిగాన్‌ బ్లాక్‌చైయిన్‌ టెక్నాలజీపై దాడి చేసిన హ్యాకర్లు.. కళ్లు మూసి తెరిచేలోగా వేల కోట్ల రూపాయల విలువ చేసే డిజిటల్‌ కరెన్సీని లూటీ చేశారు. డీసెంట్రలైజ్డ్‌ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ అందించే పాలినెట్‌వర్క్‌ యాప్‌ను హ్యాక్‌ చేసి ఈ ఘటనకు పాల్పడినట్లు గుర్తించారు. పాలినెట్‌వర్క్‌ నుంచి ఈథేరమ్‌కి సంబంధించి 33 మిలియన్ల విలువైన స్టేబుల్‌ కాయిన్లను, 85 మిలియన్ల యూఎస్‌ డాలర్‌ కాయిన్లు, బినాన్స్‌ స్మార్ట్‌ చైయిన్‌కి సంబంధించి 253 మిలియన్ల టోకెన్లు, 273 మిలియన్‌ టోకెన్లు కొల్లగొట్టారు.

మొత్తంగా 611 మిలియన్‌ డాలర్ల క్రిప్టో కరెన్సీ హాంఫట్ అయింది. దీనిని ఇండియన్‌ కరెన్సీలో చెప్పుకోవాలనుకుంటే.. దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలతో సమానం.

బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీని క్రాక్‌ చేసి క్రిప్టో కరెన్సీ కొట్టేసిన హ్యాకర్లకు డీఫై యాప్‌ అయిన పాలినెట్‌వర్క్‌ టీమ్‌ లేఖ రాసింది. హ్యాకింగ్‌తో దోచేసిన సొత్తు తిరిగి ఇచ్చేయ్యాలని.. కొట్టేసిన డబ్బు వాడుకోలేరంటూ చెప్పడమే కాకుండా.. తర్వాత పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది.