కొత్త స్మార్ట్‌ఫోన్.. విద్యార్థులకు iQOO Z10 ఫోన్ ఎంతగా ఉపయోగపడుతుందో తెలుసా?
IQOO Z10 సిరీస్ ఫోన్‌లు భారీ బ్యాటరీ సామర్థ్యంతో వచ్చాయి.

స్మార్ట్‌ఫోన్‌ను ఈ కాలంలో ఎన్నిరకాలుగా వాడుతున్నామో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ముఖ్యంగా విద్యార్థులు ఎన్నో రకాలుగా స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఆన్‌లైన్ తరగతులకు, అసైన్‌మెంట్ల కోసం రీసెర్చ్ చేయడం, పరీక్షలకు ముందు అర్ధరాత్రి గ్రూప్ కాల్స్ కు కూడా వాడుకుంటున్నారు.
ఇక గేమింగ్, సోషల్ మీడియా కోసం స్మార్ట్‌ఫోన్‌ను అందరూ వాడుతుంటారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని iQOO Z10 స్మార్ట్‌ఫోన్‌పై విశ్లేషకులు రివ్యూ ఇచ్చారు. ఇది విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం..
విద్యార్థులకు ఇన్ని రకాలుగా ఉపయోగాలు
IQOO Z10 సిరీస్ ఫోన్‌లు భారీ బ్యాటరీ సామర్థ్యంతో వచ్చాయి. IQOO Z10 అల్ట్రా-స్లిమ్ 7.89 మిమీ బాడీతో, ఏకంగా 7300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వచ్చింది. దీంతో చార్జింగ్ సమస్యలు లేకుండా విద్యార్థులు దీన్ని ఉపయోగించుకోవచ్చు. అధునాతన బ్లూవోల్ట్ బ్యాటరీ టెక్నాలజీతో ఇది విడుదలైంది.
ఇందులో థర్డ్ జనరేషన్ సిలికాన్-కార్బన్ యానోడ్స్, కార్బన్ నానోట్యూబ్స్, లేజర్-ఎచెడ్ ఎలక్ట్రోడ్‌ను వాడారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 2 రోజుల వరకు వినియోగించుకోవచ్చు. 90W ఫ్లాష్‌చార్జ్ తో నిమిషాల్లో చార్జింగ్ ఎక్కించుకోవచ్చు. ఇది కేవలం 33 నిమిషాల్లో ఫోన్ చార్జింగ్‌ను 0 నుంచి 50% వరకు పెంచుతోంది. Z10 రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు చేస్తుంది.
IQOO Z10 స్నాప్‌డ్రాగన్ 7S GEN 3 ప్రాసెసర్ తో వచ్చింది. IQOO Z10X మీడియాటెక్ డిమెన్సీ 7300తో విడుదలైంది. 4NM TSMC ఫ్లాగ్‌షిప్ ప్రాసెస్ ఇందులో ఉంది. విద్యార్థులు జూమ్ తరగతులు, యూట్యూబ్ ట్యుటోరియల్స్, నోట్స్, మల్టీ టాస్కింగ్ వంటికి బాగా ఉపయోగించుకోవచ్చు.
ధరలు
iQOO Z10 – అమెజాన్ ఇండియాలో..
8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ – రూ.21,999
8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్– రూ.23,999
12GB RAM + 256GB స్టోరేజ్ మోడల్– రూ.25,999
iQOO Z10x – ఏప్రిల్ 22 నుంచి అమెజాన్ ఇండియాలో లభిస్తుంది
6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్– రూ.12,499
8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్– రూ.13,999
8GB RAM + 256GB స్టోరేజ్ మోడల్– రూ.15,499