HMD Feature Phones : ఇన్‌బిల్ట్ యూపీఐ సపోర్టుతో హెచ్ఎండీ 110, హెచ్ఎండీ 105 కొత్త ఫీచర్ ఫోన్లు.. ధర ఎంతంటే?

HMD Feature Phones Launch : భారత మార్కెట్లో హెచ్ఎండీ 110, హెచ్ఎండీ 105 ధర వరుసగా రూ. 999, రూ. 1,119 అని కంపెనీ ధృవీకరించింది. ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా జూన్ 11 నుంచి ఫోన్‌లు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.

HMD Feature Phones : ఇన్‌బిల్ట్ యూపీఐ సపోర్టుతో హెచ్ఎండీ 110, హెచ్ఎండీ 105 కొత్త ఫీచర్ ఫోన్లు.. ధర ఎంతంటే?

HMD 110, HMD 105 Feature Phones ( Image Source : Google )

Updated On : June 11, 2024 / 10:35 PM IST

HMD Feature Phones Launch : భారత మార్కెట్లోకి హెచ్ఎండీ కంపెనీ సొంత బ్రాండ్ మంగళవారం (జూన్ 11)న రెండు కొత్త ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసింది. నోకియా బ్రాండ్ ఫోన్లను తయారుచేసే ఈ కంపెనీ HMD 110, HMD 105 పేరుతో ఫీచర్ ఫోన్లను ప్రకటించింది. భారత్‌లో కంపెనీ మొట్టమొదటి సెల్ఫ్-బ్రాండెడ్ ఫీచర్ ఫోన్‌లు మల్టీ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి.

Read Also : India Semiconductor Industry : 2027 నాటికి సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్‌కు 3 లక్షల మంది నిపుణులు అవసరం!

మల్టీమీడియా ఫీచర్‌లతో కూడిన బడ్జెట్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. అందులో వాయిస్ అసిస్టెన్స్, భారీ డిస్‌ప్లేలు కూడా ఉంటాయి. కంపెనీ ఈ కొత్తగా ప్రవేశపెట్టిన ఫీచర్ ఫోన్‌లలో బిల్ట్-ఇన్ యూపీఐ యాప్‌లను కూడా అందిస్తోంది. ఈ ఫోన్లను ఒకసారి ఛార్జ్ చేస్తే..18 రోజుల వరకు స్టాండ్‌బై బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. హెచ్ఎండీ 110 హ్యాండ్‌సెట్‌లో బ్యాక్ కెమెరా యూనిట్ కూడా ఉంది.

భారత్‌లో హెచ్ఎండీ 110, హెచ్ఎండీ 105 ధర, లభ్యత :
భారత మార్కెట్లో హెచ్ఎండీ 110, హెచ్ఎండీ 105 ధర వరుసగా రూ. 999, రూ. 1,119 అని కంపెనీ ధృవీకరించింది. హెచ్ఎండీ.కమ్ ఇ-కామర్స్ సైట్‌లు, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా జూన్ 11 నుంచి దేశంలో ఫోన్‌లు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. హెచ్ఎండీ 110 ఫోన్ బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. అయితే, హెచ్ఎండీ 105 ఫోన్ బ్లాక్, బ్లూ, పర్పల్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.

హెచ్ఎండీ 110, హెచ్ఎండీ 105 స్పెసిఫికేషన్స్, ఫీచర్లు :
హెచ్ఎండీ 110, హెచ్ఎండీ 105 ఫోన్ టాకర్, ఆటో కాల్ రికార్డింగ్, ఎంపీ3 ప్లేయర్ వంటి టూల్స్‌తో కూడిన ఫీచర్ ఫోన్‌లు, హ్యాండ్‌సెట్‌లు వైర్డు, వైర్‌లెస్ ఎఫ్ఎమ్ రేడియో రెండింటికీ సపోర్ట్‌తో వస్తాయి. చౌకైన హెచ్ఎండీ 105 మోడల్ డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్లను కలిగి ఉంటుంది. అయితే, హెచ్ఎండీ 110 బ్యాక్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంటుంది. కెమెరా యూనిట్ వివరాలు ఇంకా వెల్లడించలేదు.

ఈ రెండు ఫోన్‌లు కూడా ఇంటర్నల్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) అప్లికేషన్‌లతో అమర్చబడి ఉంటాయి. వినియోగదారులకు సురక్షితమైన డబ్బు లావాదేవీలు చేయడంలో సాయపడతాయి. హెచ్ఎండీ 110, హెచ్ఎండీ 105లకు 1,000mAh బ్యాటరీలు 18 రోజుల వరకు స్టాండ్‌బై టైం అందజేస్తాయని పేర్కొన్నారు. ఈ హ్యాండ్‌సెట్‌లు ఇన్‌పుట్‌ల కోసం 9 స్థానిక భాషలకు, రెండరింగ్ కోసం 23 భాషలకు సపోర్టు ఇస్తాయి. ఈ హెచ్ఎండీ ఫోన్‌ల ఇతర స్పెసిఫికేషన్‌లను పూర్తిగా రివీల్ చేయలేదు.

Read Also : WWDC 2024 iOS 18 Release : ఆపిల్ మెగా ఈవెంట్‌లో iOS 18 అప్‌డేట్ రిలీజ్.. ఏయే ఐఫోన్లలో సపోర్టు చేస్తుందంటే? ఫుల్ లిస్టు ఇదిగో!