HMD Phones : కొత్త HMD 2G ఫోన్లు భలే ఉన్నాయి.. స్మార్ట్‌ఫోన్లే కాదు.. ఈ ఫీచర్ ఫోన్లు కూడా కొనండి.. ధర రూ.1,800 నుంచి..!

HMD Phones : హెచ్ఎండీ గ్లోబల్ భారత్‌లో HMD 150 మ్యూజిక్, HMD 130 మ్యూజిక్ ఫీచర్ ఫోన్‌లను రిలీజ్ చేసింది. ప్రత్యేకమైన మ్యూజిక్ బటన్లు, యూపీఐ సపోర్టు, లాంగ్ బ్యాటరీ లైఫ్ అందిస్తాయి.

HMD Phones Launch (Image Credit : Google )

HMD Phones Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? స్మార్ట్‌ఫోన్లకు దీటుగా ఫీచర్లు ఫోన్లు కూడా అదే రేంజులో ఉంటున్నాయి. తాజాగా హెచ్ఎండీ గ్లోబల్ నుంచి సరికొత్త 2G ఫీచర్ ఫోన్లు వచ్చేశాయి. HMD 150 మ్యూజిక్, 130 మ్యూజిక్ ఫీచర్ ఫోన్లు భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఈ HMD ఫీచర్ ఫోన్ల ధరలు రూ. 1,800 నుంచి ప్రారంభమవుతాయి. ఫోన్ల లభ్యత, స్పెసిఫికేషన్లను ఓసారి చూద్దాం..

హెచ్ఎండీ గ్లోబల్ HMD 150 మ్యూజిక్, HMD 130 మ్యూజిక్ అనే రెండు సరికొత్త ఫీచర్ ఫోన్‌లను లాంచ్ చేసింది. పవర్‌ఫుల్ మొబైల్ ఎక్స్‌పీరియన్స్ ఇష్టపడే సంగీత ప్రియులను లక్ష్యంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

Read Also : iPhone 17 Leaks : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త ఐఫోన్ 17 వచ్చేస్తోంది.. కెమెరా ఫీచర్లు కేక.. లాంచ్ డేట్, ధర వివరాలివే!

ఈ ఫీచర్ ఫోన్లు ప్రత్యేకమైన మ్యూజిక్ బటన్లు, లాంగ్ టైమ్ బ్యాటరీ లైఫ్, ఇంటర్నల్ యూపీఐ పేమెంట్ ఫీచర్లతో వస్తాయి. స్ట్రాంగ్ డిజైన్, FM రేడియో, బ్లూటూత్ సపోర్టు, స్టోరేజీ కూడా విస్తరించుకోవచ్చు. HMD రోజువారీ యూజర్లకు సరసమైన ధరలో స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల రేంజ్‌లో ఫోన్‌ను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫీచర్ ఫోన్ల స్పెసిఫికేషన్లు, ధర, లభ్యత గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

HMD 150 మ్యూజిక్, 130 మ్యూజిక్ స్పెసిఫికేషన్లు :
ఈ రెండు ఫోన్‌లు అద్భుతమైన డిజైన్ కలిగి ఉన్నాయి. స్ట్రాంగ్ ఎడ్జ్‌లతో పాటు స్క్రాచ్-రెసిస్టెంట్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. HMD 130 మ్యూజిక్‌లో డ్యూయల్ ఫ్లాష్‌లైట్ ఉంది. తక్కువ కాంతిలో కూడా డిస్‌ప్లే బాగా కనిపిస్తుంది. ఈ ఫోన్లు టైప్-C ఛార్జింగ్‌తో కూడిన 2,500mAh రిమూవబుల్ బ్యాటరీతో వస్తాయి. 50 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్, 36 రోజుల స్టాండ్‌బై టైమ్ అందిస్తాయి.

కనెక్టివిటీ విషయానికి వస్తే.. HMD 130 మ్యూజిక్ ఇంటర్నల్ UPI పేమెంట్లకు సపోర్టు ఇస్తుంది. అయితే, హెచ్ఎండీ 150 మ్యూజిక్ స్కాన్, పే ఫంక్షనాలిటీతో వస్తుంది. రెండు ఫోన్లలో హిందీ, ఇంగ్లీషులో టెక్స్ట్-టు-స్పీచ్ ఫీచర్ (ఫోన్ టాకర్) ఉంటుంది. ఈ ఫోన్‌లు ఆడియో కోసం బిగ్ సౌండ్ స్పీకర్లతో రూపొందించింది. ప్రత్యేకమైన మ్యూజిక్ బటన్‌లు, రికార్డింగ్ సపోర్ట్‌తో FM రేడియో, బ్లూటూత్ 5.0, 32GB వరకు SD కార్డ్ స్టోరేజీని విస్తరించుకోవచ్చు.

Read Also : Lava Bold 5G : తగ్గేదేలే.. దిమ్మతిరిగే ఫీచర్లతో స్వదేశీ లావా 5G ఫోన్ వచ్చేసిందోచ్.. చైనా ఫోన్లు జుజుబీ.. ధర కూడా చాలా తక్కువే..!

భారత్‌లో HMD 150 ఫ్యూజన్, HMD 130 ఫ్యూజన్ ధర ఎంతంటే? :
హెచ్ఎండీ 130 మ్యూజిక్ ధర రూ. 1,899 ఉండగా, బ్లూ, డార్క్ గ్రే, రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. HMD 150 మ్యూజిక్ ఫోన్ లైట్ బ్లూ, పర్పుల్, గ్రే వంటి కలర్ ఆప్షన్లలో రూ. 2,399కు లభిస్తుంది. ఈ రెండు మోడళ్లు ప్రముఖ రిటైల్ స్టోర్లు, (HMD.com), భారత్ అంతటా ప్రధాన ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంటాయి.