iPhone 17 Leaks : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త ఐఫోన్ 17 వచ్చేస్తోంది.. కెమెరా ఫీచర్లు కేక.. లాంచ్ డేట్, ధర వివరాలివే!
iPhone 17 Leaks : కొత్త ఆపిల్ ఐఫోన్ కావాలా? ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు ధర వివరాలు లీక్ అయ్యాయి.. పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.

iPhone 17 Leaks
iPhone 17 Leaks : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త ఐఫోన్ 17 సిరీస్ వచ్చేస్తోంది. లీకుల ప్రకారం.. ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ను సెప్టెంబర్ 2025లో లాంచ్ చేయనుంది. లీక్‌లను పరిశీలిస్తే.. కొన్ని భారీ అప్‌గ్రేడ్‌లు రాబోతున్నాయని సూచిస్తున్నాయి.
అతిపెద్ద మార్పులలో ఒకటి.. ఐఫోన్ ప్లస్ మోడల్ పక్కన పెట్టేసి ఆపిల్ కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టినట్లు సమాచారం. ఐఫోన్ 17 ఎయిర్ పేరుతో రిలీజ్ చేయనుంది. ఈ పుకార్లు నిజమని తేలితే.. ఆపిల్ లైనప్‌లో అతిపెద్ద మార్పును సూచిస్తుంది.
లైనప్ మార్పులతో పాటు ఆపిల్ డిజైన్ మార్పులు, కెమెరా అప్‌గ్రేడ్స్ కూడా తీసుకువస్తుందని రుమర్లు వినిపిస్తున్నాయి. స్టాండర్డ్ ఐఫోన్ 17 మోడల్ ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఐఫోన్ 17 డిజైన్, డిస్‌ప్లే (అంచనా) :
ఐఫోన్ 17 మరింత ప్రీమియం ఫీచర్లతో రానుంది. బ్యాక్ ప్యానెల్ అల్యూమినియం, గ్లాస్ మిక్సింగ్‌తో కంపెనీ ఆవిష్కరించనుందని నివేదికలు సూచిస్తున్నాయి. మరో ఆసక్తికరమైన మార్పు ఏమిటంటే.. ట్రేడషనల్ వర్టికల్ సెటప్ స్థానంలో హారిజెంటల్ కెమెరా లేఅవుట్ ఉండవచ్చు. డిస్‌ప్లే విషయానికొస్తే.. స్టాండర్డ్ ఐఫోన్ 17 6.3-అంగుళాల స్క్రీన్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఆపిల్ 120Hz ప్రోమోషన్ టెక్నాలజీని అన్ని మోడళ్లకు కూడా తీసుకురావచ్చు.
ఐఫోన్ 17 కెమెరా (అంచనా) :
ఐఫోన్ 17 మోడల్ 48MP మెయిన్ సెన్సార్, 2x జూమ్‌తో 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఫ్రంట్ కెమెరా 24MPకి అప్‌గ్రేడ్ అవుతుంది. ప్రస్తుత 12MP సెన్సార్ నుంచి రిజల్యూషన్ రెట్టింపు అవుతుందని భావిస్తున్నారు.
ఐఫోన్ 17 స్పెసిఫికేషన్లు ఫీచర్లు (అంచనా) :
ఆపిల్ ఐఫోన్ 17 ఫోన్ 3-నానోమీటర్ ప్రాసెస్‌పై A19 చిప్‌తో వచ్చే అవకాశం ఉంది. కస్టమ్ బ్లూటూత్, Wi-Fi 7 చిప్‌తో కనెక్టివిటీ కూడా అప్‌గ్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది.
భారత్‌లో ఐఫోన్ 17 ధర, లాంచ్ టైమ్‌లైన్ (అంచనా) :
ఆపిల్ సెప్టెంబర్ 11, సెప్టెంబర్ 13, 2025 మధ్య ఐఫోన్ 17 సిరీస్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది. భారత మార్కెట్లో స్టాండర్డ్ ఐఫోన్ 17 దాదాపు రూ.79,900 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ వివరాలన్నీ లీక్‌లు, ఊహాగానాలు మాత్రమేనని గమనించాలి. అసలు లాంచ్ ధర ఎప్పుడు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.