Motorola Edge 60 Fusion 5G : కొత్త మోటోరోలా 5G ఫోన్ ఆగయా.. ఫీచర్లు మాత్రం పిచ్చెక్కించేలా ఉన్నాయి.. ధర ఎంతో తెలుసా?
Motorola Edge 60 Fusion 5G : గుడ్ న్యూస్.. కొత్త మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5జీ ఫోన్ లాంచ్ అయింది. ఈ 5జీ ఫోన్ ఫస్ట్ సేల్ ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానుంది.

Motorola Edge 60 Fusion 5G
Motorola Edge 60 Fusion 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? మోటోరోలా ఫ్యాన్స్ కోసం మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G ఫోన్ వచ్చేసింది. ఏప్రిల్ 2న అధికారికంగా భారత మార్కెట్లో లాంచ్ అయింది.
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కన్నా కెమెరా, డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్ వంటి అనేక అప్‌గ్రేడ్‌లతో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాడ్-కర్వ్డ్ అమోల్డ్ ప్యానెల్, మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, (LPDDR4x) ర్యామ్, మోటో ఏఐ ఫీచర్లు, MLT 810 STD మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్‌ను అందిస్తుంది. మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్పెసిఫికేషన్లు :
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 6.7-అంగుళాల అమోల్డ్ 1.5K పాంటోన్ వాలిడేటెడ్ ప్యానెల్‌తో 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌తో వస్తుంది. 4,500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్, వాటర్ టచ్ సపోర్ట్‌ను అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.
ఈ మోటోరోలా ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్ ద్వారా 12GB వరకు (LPDDR4X) ర్యామ్, 256GB స్టోరేజ్ ద్వారా పవర్ పొందుతుంది. మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజీ విస్తరించవచ్చు.
ఈ మోటోరోలా ఫోన్ 5,500 mAh బ్యాటరీ, 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ 5G ఫోన్ ఎమఐఎల్-ఎస్టీడీ 810H సర్టిఫికేషన్‌తో పాటు IP69/IP68 అండర్ వాటర్ ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతుంది. AI మ్యాజిక్ ఎరేజర్, ఎడిటర్, సర్కిల్ టు సెర్చ్ వంటి మోటోఏఐ ఫీచర్‌లను కూడా అందిస్తుంది.
కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP సోనీ (LYTIA) 700C సెన్సార్, 13MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో సహా డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ ఫోన్ 4K రికార్డింగ్‌తో 32MP సెల్ఫీ షూటర్‌తో వస్తుంది.
భారత్‌లో మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ధర :
మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఫోన్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999 కాగా, 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999కు లభ్యమవుతున్నాయి. ఈ ధరలు అన్ని డిస్కౌంట్లతో మాత్రమేనని గమనించాలి. ఈ మోటోరోలా ఎడ్జ్ 60 ఫోన్ ఏప్రిల్ 9 నుంచి ఫ్లిప్‌కార్ట్, అధికారిక వెబ్‌సైట్, ఇతర రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.