బ్రౌజింగ్ చేసేవారే టార్గెట్ : ఆన్‌లైన్‌లో Ads కంట్రోల్ చేయండిలా!

ఆన్‌లైన్ యూజర్లకో హెచ్చరిక. గూగుల్ లో ఏం సెర్చ్ చేస్తున్నారు. మీరు సెర్చ్ చేసే ప్రతిదాన్ని యాడ్స్ ట్రాకింగ్ చేస్తుంటాయని మీకు తెలుసా? బ్రౌజర్‌లో సెర్చ్ చేసే ప్రతి కీవర్డ్ సాయంతో మీకు ఆయా యాడ్స్ డిస్ ప్లే అవుతుంటాయి. మీకు తెలియకుండానే మీరు యాడ్స్ టార్గెట్ అవుతున్నారని గుర్తించలేకపోతున్నారు. తస్మాత్ జాగ్రత్త. మీ ప్రైవసీ డేంజర్ లో ఉన్నట్టే. అయితే.. యాడ్స్ ట్రాకింగ్ నుంచి తప్పించుకులేమా?
మీ డేటాను ట్రాక్ చేయకుండా యాడ్స్ కంట్రల్ చేయవచ్చు. సాధారణంగా ఏదైనా వెబ్ సైట్ లేదా గూగుల్, ఫేస్ బుక్ ఓపెన్ చేసినప్పుడు వెబ్ పేజీల్లో యాడ్స్ డిస్ ప్లే అవుతుంటాయి గమనించారా? ఆ యాడ్స్.. ప్రత్యేకించి ఇంట్రెస్టడ్ ఆడియోన్స్ కు మాత్రమే కనిపించేలా సెట్ చేస్తారు. అందుకే మనం ఏదైనా ప్రొడక్టుకు సంబంధించి బ్రౌజర్ లో సెర్చ్ చేసినప్పుడు దానికి రిలేటెడ్ యాడ్స్ వెబ్ పేజీపై కనిపిస్తాయి.
ఇలా యాడ్స్ డిస్‌ప్లే చేయడం ద్వారా మీరు ఏం సెర్చ్ చేస్తున్నారో ఇతరులకు ఈజీగా తెలిసిపోతుంది. అంతేకాదు.. మీకు తెలియకుండానే మీ పర్సనల్ డేటాను తస్కరించే అవకాశం ఉంటుంది. అడ్వర్టైజింగ్ కోసం మీ డేటాను ఇతరులు యాక్సస్ చేసుకునే ప్రమాదం ఉందని మరిచిపోవద్దు. కొంతమంది యూజర్లు తమ బ్రౌజర్లలో యాడ్ బ్లాక్ సెట్ చేసుకునే అవకాశం ఉంది. అంతేకాక.. ఎలాంటి యాడ్స్ కనిపించకుండా బ్లాక్ చేయాల్సిన అవసరం లేకుండానే వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. అది ఎలానో ఓసారి చూద్దాం.
గూగుల్లో యాడ్స్ కంట్రోలింగ్ :
Step : 1
* ముందుగా.. మీకో గూగుల్ అకౌంట్ ఉండాలి. ఒకవేళ లేదంటే క్రియేట్ చేసుకోండి.
* అకౌంట్ లాగిన కాగానే మీకు కొన్ని మెనేజ్ మెంట్ సెట్టింగ్స్ కనిపిస్తాయి.
* Gmail ఓపెన్ చేశాక.. టాప్ రైట్ కార్నర్ మీ ప్రొఫైల్ పై క్లిక్ చేయండి.
* Privacy & Personalization రెండు ఆప్షన్లు ఉంటాయి.
* Manage your data & పర్సనలైజేషన్ మరో ఆప్షన్ ఉంటుంది.
Step : 2
* ఆ ఆప్షన్ క్లిక్ చేయగానే కొత్త Window ఓపెన్ అవుతుంది.
* ప్రైవసీ రిలేటెడ్ ఆప్షన్లు మరెన్నో కనిపిస్తాయి.
* Ads సంబంధిత ఆప్షన్లు కావాలంటే ఆ సెక్షన్ ఎంచుకోండి.
* Ad personalization block ఉంటుంది.
* Go సెలెక్ట్ చేసి.. Ad సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
Step : 3
* Ad personalization Settings ఓపెన్ చేయండి.
* డిఫాల్ట్ గా Ad personalization ఆప్షన్ ON ఉంటుంది.
* సింపుల్ గా OFF చేయండి చాలు..
* గూగుల్.. యాడ్స్ ట్రాక్ చేయకుండా Stop చేస్తుంది.
Step : 4
* How your ads are personalized ఆప్షన్ కనిపిస్తుంది.
* అక్కడ బ్రాండ్లు, టాపిక్స్, ఇండస్ట్రీల డేటా డ్రాప్ లిస్టు కనిపిస్తుంది.
* ఆ భారీ జాబితాలో ఏ యాడ్స్ కంట్రోల్ చేయాలో దానిపై క్లిక్ చేయండి.
* Turn off అని బటన్ కనిపిస్తుంది. దానిపై Click చేస్తే సరిపోతుంది.
* ఎన్ని కావాలంటే అన్నింటిని Turn off చేసుకోవచ్చు.
* ఆయా యాడ్స్ ఇకపై మీరు చేసే బ్రౌజింగ్ ట్రాకింగ్ చేయలేవు.
Facebookలో Ads కంట్రోల్ ఇలా :
* గూగుల్ యాడ్స్ మాదిరిగానే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ లో యాడ్స్ ఉంటాయి. మీ ఫేస్ బుక్ అకౌంట్లలో పోస్టులతో పాటు సెర్చ్ ఆధారంగా యాడ్స్ డిస్‌ప్లే చేసే అవకాశం ఉంది. సోషల్ మీడియా ప్లాట్ ఫాంపై యూజర్లను టార్గెట్ చేస్తూ వారి ప్రైవసీ డేటాను తస్కరించే అవకాశం ఉంది. ఫేస్ బుక్ యూజర్ల పర్సనల్ డేటాను ట్రాకింగ్ చేసే వీలుంది.
ప్రమోటెడ్ యాడ్స్ ఎక్కువగా సోషల్ ప్లాట్ ఫాంపై మీ అకౌంట్ న్యూస్ ఫీడ్ లో కనిపిస్తుంటాయి. ఇలాంటి యాడ్స్ కనిపించకుండా.. మీ డేటాను ట్రాక్ చేయకుండా ఉండాలంటే కొన్ని సెట్టింగ్స్ మార్పులు చేసుకోవచ్చు. దీంతో డేటా ఆధారంగా డిస్ ప్లే అయ్యే యాడ్స్ నిలిచిపోతాయి. ఇందుకు మీరు చేయాల్సిందిల్లా బేసిడ్ డేటా యాడ్స్ అనుమతి ఇవ్వరాదు. ఆ సెట్టింగ్స్ ఎలా మార్చుకోవాలో చూద్దాం.
Step 1:
* మీకు Facebook అకౌంట్ ఉందా? Login అవ్వండి.
* Top right కార్నర్‌లో menu Sectionపై క్లిక్ చేయండి.
* Arrow Point బటన్‌పై క్లిక్ చేయండి.
Step 2 :
* Settings menu దగ్గర క్లిక్ చేయండి.
* Left side కిందిభాగంలో Ads సెక్షన్ Click చేయండి.
* Your ad preferences అనే ఆప్షన్ కనిపిస్తుంది.
Step 3 :
* Ad Settings (Wheel icon)పై క్లిక్ చేయండి.
* Ads Based on data from Partnersపై Tap చేయండి.
* Allowed అని డిఫాల్ట్ గా ఉంటుంది.. Not Allowed గా మార్చండి.
Step 4 :
* Hide ad topics సెట్టింగ్స్ కూడా మార్చుకోవచ్చు.
* Ad టాపిక్స్, పరిమిత సమయం లేదా శాశ్వతంగా Hide చేసుకోవచ్చు.
* అవసరానిబట్టి మీకు నచ్చిన Option ఎంచుకోవచ్చు.
* Alcohol, Parenting, Pets యాడ్స్ Hide చేసుకోవచ్చు.
Ad blocker (ABP)తో యాడ్స్ కంట్రోల్ :
* మీరు ఏ బ్రౌజర్ వాడుతున్నారు. Google Chrome వాడితే ఇలా చేయండి.
* Chorme Web Store నుంచి Ad blocker Plus Install చేయండి.
* ఇదో Extensionగా వర్క్ అవుతుంది.
* ఒకసారి మీ బ్రౌజర్ లో Allow చేయగానే యాడ్స్ బ్లాక్ అవుతాయి.
* Chrome బ్రౌజర్ Top Right కార్నర్ దగ్గర Block icon కనిపిస్తుంది.
* Block Icon ట్యాప్ చేయగానే డ్రాప్ లిస్ట్ కనిపిస్తుంది.
* Ad Block On చేయాలి. వెబ్ పేజీపై యాడ్స్ అన్నీ బ్లాక్ అవుతాయి.