Remove Your Personal Data : ఆన్‌లైన్‌లో మీ పర్సనల్ డేటాను డిలీట్ చేయాలంటే ఎలా? గూగుల్ కొత్త ఫీచర్ ఉందిగా..!

Remove Your Personal Data : గూగుల్ సెర్చ్‌లో మీ పర్సనల్ డేటా కనిపిస్తోందా? డోంట్ వర్రీ.. వెబ్‌లో కనిపించే వ్యక్తిగత వివరాలను సులభంగా డిలీట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Remove Your Personal Data : మీ పర్సనల్ డేటా గూగుల్ సెర్చ్‌లో కనిపిస్తోందా? అయితే, ఆందోళన చెందకండి. సాధారంగా వినియోగదారుల పేరు, చిరునామా లేదా ఫోన్ నంబర్ వంటి వ్యక్తిగత సమాచారంతో వెబ్‌లో సెర్చ్ చేసినప్పుడు అనేక విషయాలను పొందవచ్చు.

స్టాటిస్టా డేటా ప్రకారం.. వెబ్ మార్కెట్‌లో 83శాతం గూగుల్ ఆధిపత్యం చెలాయిస్తుంది. సమీప పోటీదారులైన (Microsoft) సొంత సెర్చ్ ఇంజిన్ (Bing), (Yahoo) లేదా (DuckDuckGo) కన్నా గూగుల్ సెర్చ్ ఇంజిన్ చాలా ముందుంది. ఎవరైనా మరో యూజర్ డేటా కోసం సెర్చ్ చేస్తుంటే.. ముందుగా గూగుల్‌లోనే ప్రయత్నించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Read Also : Google Search Mobile : గూగుల్‌ సెర్చ్‌లో మీ మొబైల్ నంబర్‌ కనిపిస్తుందా? వెంటనే డిలీట్ చేయండిలా..!

(CNBC) నివేదిక ప్రకారం.. గూగుల్ యూజర్ల వ్యక్తిగత సమాచారంతో ఫలితాలను కనుగొన్నప్పుడల్లా వారికి తెలియజేసేలా కొత్త హైడ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. సెర్చ్ ప్లాట్‌ఫారమ్ నుంచి తమ డేటాను తొలగించుకోవడానికి కూడా టెక్ దిగ్గజం వినియోగదారులను అనుమతిస్తుంది. అయితే, ఈ ఫీచర్ భారత్‌లో ఇంకా అందుబాటులోకి రాలేదని గమనించడం ముఖ్యం.

ఈ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే? :

గత వారమే గూగుల్ (Remove this result) అనే ఫంక్షన్ (బీటా వెర్షన్‌లో) ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. అంటే.. వినియోగదారులు గూగుల్ సెర్చ్ నుంచి తమ డేటాను తొలగించుకోవడానికి అభ్యర్థించవచ్చు. అయితే, ఈ టూల్ మొత్తం ఇంటర్నెట్ లేదా నిర్దిష్ట వెబ్‌సైట్ నుంచి మీ డేటాను తొలగించదు. ఇతర యూజర్లకు మీ డేటాను కనిపించకుండా చేస్తుంది. వాస్తవానికి, ఈ కొత్త ఫీచర్ ‘Remove this result‘ అనే టూల్ చాలా భిన్నంగా ఉంటుంది. ఈ ఫీచర్ పని చేయడానికి యూజర్లు గూగుల్‌కు ఎలాంటి అభ్యర్థన చేయాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా, ఫీచర్ యూజర్ల ఫోన్ నంబర్, ఇమెయిల్, ఇంటి చిరునామాను సెర్చ్ చేస్తుంది.

ఏదైనా వ్యక్తిగత డేటా కనిపిస్తే వెంటనే వారిని హెచ్చరిస్తుంది. ఆ తర్వాత, సెర్చ్ రిజల్ట్స్ నుంచి ఆ డేటాను డిలీట్ చేయమని వినియోగదారులు గూగుల్‌ని అడగవచ్చు. గత ఫీచర్ మాదిరిగానే.. గూగుల్ ఇంటర్నెట్ నుంచి ఎలాంటి సమాచారాన్ని తొలగించదు. కానీ, ఇతరులకు మీ డేటా కనిపించకుండా హైడ్ చేస్తుంది అంతే.. గూగుల్ సెర్చ్ నుంచి స్క్రబ్ చేస్తుంది. వినియోగదారులు తమ వ్యక్తిగత సమాచారాన్ని గుర్తించమని గూగుల్‌ను అడగవచ్చు. ఇదేలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Remove Your Personal Data : How to ask Google From Search

సెర్చ్‌లో వ్యక్తిగత డేటాను ఎలా గుర్తించాలో గూగుల్‌ని ఎలా అడగాలంటే? :

1. వెబ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేయండి.. myactivity.google.com/results-about-you అని టైప్ చేయండి.
2. ‘Results to review’ ఆప్షన్ ఎంచుకోండి.
3. ‘Get Started’ ఎంపికపై క్లిక్ చేసి ‘Next’ని రెండుసార్లు Tap చేయండి.
4. మీ పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఇమెయిల్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని సెర్చ్ చేయండి. ఒక్కోదానికి మల్టీ ఎంట్రీలను కూడా యాడ్ చేయొచ్చు.
5. అందించిన మీ సమాచారాన్ని(Confirm) నిర్ధారించండి.
6. వినియోగదారులకు గూగుల్ ఇమెయిల్, పుష్ నోటిఫికేషన్‌లు ఇలా మూడు మార్గాలను అందిస్తుంది. గూగుల్ అలర్ట్ చేయాలనుకునే మార్గాన్ని ఎంచుకోవాలి.
7. చివరగా, యూజర్లకు ‘We’re taking a look’ అని పాప్-అప్‌ని కనిపిస్తుంది.

ఆ తర్వాత, వినియోగదారులు గూగుల్ నుంచి వచ్చే నోటిఫికేషన్‌ల కోసం వేచి ఉండాలి. అలర్ట్ వచ్చిన వెంటనే వినియోగదారులు సెర్చ్ నుంచి డేటాను డిలీట్ చేయమని అడగవచ్చు లేదా హైడ్ చేయమని ఎంచుకోవచ్చు. డేటాను అందించేటప్పుడు.. వినియోగదారులు ఏవైనా తప్పులు చేసి ఉంటే.. వాటిని సరిదిద్దడానికి గూగుల్ అనుమతిస్తుంది. అలా చేయడానికి వినియోగదారులు ‘Results About You‘ పేజీకి తిరిగి వచ్చి మార్పులు చేసుకోవచ్చు.

Read Also : Google Search: గూగుల్ సెర్చ్‌లో గ్రామర్ చెక్ ఫీచర్ వచ్చేసింది.. ప్రస్తుతం ఆ ఒక్క భాషలో మాత్రమే అందుబాటులోకి..

ట్రెండింగ్ వార్తలు