ఏదైనా డివైజ్‌లో screenshots ఎడిట్ చేయాలంటే ఎలా?

ఏదైనా డివైజ్‌లో స్ర్కీన్ షాట్ తీసుకోవచ్చు. అది కంప్యూటర్, ల్యాప్ టాప్ ఏదైనా కావొచ్చు.. లేదా స్మార్ట్ ఫోన్ కావొచ్చు.. కొన్ని డివైజ్ ల్లో ఇన్ బుల్ట్ స్ర్కీన్ షాట్ టూల్ ఉంటుంది.

ఏదైనా డివైజ్‌లో screenshots ఎడిట్ చేయాలంటే ఎలా?

How To Edit Screenshots On Any Device (2)

Updated On : August 27, 2021 / 6:53 PM IST

How to edit screenshots on any device : ఏదైనా డివైజ్‌లో స్ర్కీన్ షాట్ తీసుకోవచ్చు. అది కంప్యూటర్, ల్యాప్ టాప్ ఏదైనా కావొచ్చు.. లేదా స్మార్ట్ ఫోన్ కావొచ్చు.. మీకు అవసరమైనదాన్ని డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా స్ర్కీన్ షాట్ తీసుకోవచ్చు. కొన్ని డివైజ్ ల్లో ఇన్ బుల్ట్ స్ర్కీన్ షాట్ టూల్ ఉంటుంది. కొన్ని డివైజ్‌ల కోసం థర్డ్ పార్టీ టూల్స్ పై ఆధారపడాల్సి వస్తుంది. సాధారణంగా చాలామంది ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వాడుతుంటారు. అలాగే ఐఓఎస్, ఐప్యాడ్, విండోస్, మ్యాక్ ఓఎస్, థర్డ్ పార్టీ టూల్స్ ద్వారా ఈజీగా స్ర్కీన్ షాట్ తీసుకోవచ్చు. అది ఎలానో ఓసారి చూద్దాం..

ఆండ్రాయిడ్ (Android) :
మీ ఆండ్రాయిడ్ ఫోన్ పవర్ బటన్, వాల్యూమ్ బటన్ ఉపయోగించి స్ర్కీన్ షాట్ తీసుకోవచ్చు. గూగుల్ పిక్సల్, శాంసంగ్ ఫోన్లలో కూడా ఈ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ రెండు బటన్లను ఒకేసారి నొక్కినప్పుడు చిన్నపాటి థంబునైల్ లోయర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ లో కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేసి… ఎడిట్ బటన్ పై క్లిక్ చేయండి. వెంటనే ఎడిట్ చేయకపోతే.. స్ర్కీన్ పై మాయమైపోతుంది. మీకు ముందుగా కనిపించే ఆప్షన్.. స్ర్కీన్ షాట్ క్రాప్ చేసుకోవచ్చు. షాట్ అంచులను రెండు వేళ్లతో పట్టుకుని మూవ్ చేసి అవసరమైనంతగా అడ్జెస్ట్ చేసుకోవచ్చు.

స్ర్కీన్ కిందిభాగంలో నాలుగు టూల్స్ కనిపిస్తాయి. అందులో undo tool ద్వారా బ్యాక్ వెళ్లొచ్చు.. లేదంటే redo tool ద్వారా ముందుకు వెళ్లొచ్చు. పెన్ బటన్ పై ట్యాప్ చేస్తే.. మీకు గ్యాలరీ కనిపిస్తుంది. అక్కడే కలర్ ప్యాలెట్ కనిపిస్తుంది. మీకు నచ్చిన కలర్ ద్వారా అవసరమైన చోట మార్క్ చేసుకోవచ్చు. Done బటన్ పై ట్యాప్ చేసి Save బటన్ పై క్లిక్ చేయండి. కావాలంటే టెక్స్ట్ లేయర్లు యాడ్ చేసుకోవచ్చు. మెయిన్ గూగుల్ ఫొటోస్ యాప్ పై ట్యాప్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. మీ హ్యాండ్ సెట్ బట్టి ఆండ్రాయిడ్ ఫోన్లలో స్ర్కీన్ షాట్ ప్రాసెస్ ఉంటుంది. శాంసంగ్ ఫోన్లలో అయితే ఎడిట్ బటన్ కనిపించదు. ఒక పెన్ ఐకాన్ మాత్రమే కనిపిస్తుంది. మీరు క్యాప్చర్ చేసిన స్ర్కీన్ షాట్‌ను క్రాప్ చేసి ట్యాప్ బటన్ పై డ్రా చేసుకోవచ్చు.

iOS and iPadOS :
ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ డివైజ్ ల్లో Home button నుంచి ఈజీగా స్ర్కీన్ షాట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీ డివైజ్ Touch ID కలిగి ఉంటే.. Sleep/wake button ఒకేసారి కలిపి ట్యాప్ చేయాలి. లేదంటే Face ID ఉంటే Volume up బటన్ Sleep/wake button ఒకేసారి ట్యాప్ చేయాలి. అప్పుడు స్ర్కీన్ షాట్ లోయర్ లెఫ్ట్ కార్నర్ లో కనిపిస్తుంది. ఎడిట్ కోసం ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు షాట్ అంచులను రెండు వేళ్లతో డ్రాగ్ చేసి క్రాప్ చేసుకోవచ్చు. లేదంటే జూమ్ చేసుకోవచ్చు. చిన్న పెన్ ఐకాన్ పై ట్యాప్ చేస్తే మీకు వేర్వేరు డ్రాయింగ్ టూల్స్ కనిపిస్తాయి. ఏదైనా ఒక ఐకాన్ ఎంచుకోవాలి. రైట్ సైడులో మీకు కలర్ ప్యాలెట్ ఐకాన్ కనిపిస్తుంది. మీకు నచ్చిన కలర్ ఎంచుకోవచ్చు. అక్కడే ఎరేజర్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది. రెండు మోడ్స్ ఉంటాయి. అందులో ఒకటి ఎంచుకోండి. టాప్ లెఫ్ట్ కార్నర్ లో పెన్ ఐకాన్ కనిపిస్తుంది. మీకు కావాల్సిన ప్లేసుకు మూవ్ చేసుకోవచ్చు.

లోయర్ రైట్ కార్నర్‌లో +icon ట్యాప్ చేస్తే.. అందులో టెక్స్ట్ లేయర్ యాడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ ఓపాసిటీ కూడా మార్చుకోవచ్చు. స్పీచ్ బబుల్ స్పేస్ లేదా సిగ్నేచర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చివరిగా Done ట్యాప్ చేయాలి. Done ట్యాప్ చేసి.. Save to Photos బటన్‌పై నొక్కాలి. కావాలంటే మళ్లీ ఎడిట్ ఆప్షన్ ద్వారా ఏమైనా మార్పులు చేసుకోవచ్చు.

Windows :
విండోస్ సిస్టమ్ లో స్ర్కీన్ క్యాప్చర్ చేసేందుకు అనేక ఆప్షన్లు ఉన్నాయి. Win+Shift+S బటన్ పై నొక్కాలి. Snip & Sketch టూల్ బార్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ ద్వారా మీరు ఏదైనా విండో లేదా మొత్తం పీసీ స్ర్కీన్ క్యాప్చర్ చేయొచ్చు. లోయర్ రైట్ కార్నర్ లో మీకు థంబనైల్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. అన్ని టూల్స్ టాప్ లోనే కనిపిస్తాయి. పెన్ టూల్ కూడా అక్కడే ఉంటుంది. పెన్సిల్, హైలేటర్ టూల్స్ ఉంటుంది. ఈ టూల్స్ లో చిన్నపాటి యారో ఒకటి కనిపిస్తుంది. మీకు నచ్చిన కలర్ పిక్ చేయాలి.. రైడ్ సైడ్ లో ఒక ఎరేజర్ టూల్ కనిపిస్తుంది. అక్కడే క్రాప్ టూల్ కూడా కనిపిస్తుంది. క్యాప్చర్ అయిన పిక్చర్ కార్నర్లను మీకు కావాలిసినంతవరకు డ్రాగ్ చేయాలి. ఇమేజ్ క్రాప్ చేయాలి.. అప్పుడు Save బటన్ పై క్లిక్ చేయాలి. అక్కడే కాపీ బటన్ కూడా ఉంటుంది. విండోస్ క్లిప్ బోర్డుకు స్ర్కీన్ షాట్ లో నుంచి మీకు నచ్చిన అప్లికేషన్ లో Paste చేసుకోవచ్చు.

macOS :
మ్యాక్ ఓఎస్ లో స్ర్కీన్ షాట్ తీసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. Cmd+Shift+3 కలిపి ట్యాప్ చేస్తే మీ డివైజ్ స్ర్కీన్ అంతా క్యాప్చర్ అవుతుంది. అప్పుడు థంబునైల్ మీద క్లిక్ చేస్తే.. లోయర్ రైట్ కార్నర్ లో పాప్ అప్ కనిపిస్తుంది. ఎడిట్ ఆప్షన్ కూడా అక్కడే ఉంటుంది. టాప్ లెప్ట్ కార్నర్‌లో ప్రీహ్యాండ్ టూల్స్ ద్వారా డ్రా చేసుకోవచ్చు. షేప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఫొటోపై టెక్స్ట్ కూడా డ్రాప్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ లో కనిపించే ఐకాన్స్ ద్వారా లైన్ సైజు, కలర్ కూడా సెట్ చేసుకోవచ్చు. మీరు వాడే టూల్ బట్టి ఉంటుంది.. ఏదైనా ఎలిమెంట్ పై క్లిక్ చేయాలి. ఇక్కడే రిసైజ్ చేసుకోవచ్చు. స్ర్కీన్ షాట్ రొటేట్ చేసుకోవచ్చు. క్రాపింగ్ చేసుకోవచ్చు. క్రాప్ ఐకాన్ క్లిక్ చేస్తే కార్నర్ లో స్క్వెయిర్  లైన్లు కనిపిస్తాయి. మీకు ఎక్కడికి వరకు కావాలో ఫ్రేమ్ కార్నర్ ఎడ్జెస్ సెట్ చేసుకుని క్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడే Revert బటన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే undoలోకి మారిపోతుంది. ఎడిట్ చేయక ముందు స్ర్కీన్ షాట్ గా మారిపోతుంది. ఓకే అనుకుంటే Done ట్యాప్ చేయండి. అప్పుడు మీరు సేవ్ చేసిన స్ర్కీన్ షాట్ ఫొటోస్ యాప్ లో సేవ్ అయిపోతుంది. ఒకవేళ సేవ్ చేయలేదంటే… ప్రాంప్ట్ మెసేజ్ వస్తుంది.

Third-party tools :
థర్డ్ ఫార్టీ టూల్స్ ద్వారా కూడా మీ ల్యాప్ టాప్ లేదా స్మార్ట్ ఫోన్లలో స్ర్కీన్ షాట్ తీసుకోవచ్చు. ఇన్ బుల్ట్ స్ర్కీన్ షాట్ మాదిరిగానే ఎడిట్ ఆప్షన్లు ఉంటాయి. మీకు నచ్చిన్ టూల్ ఎంచుకుని బెటర్ స్ర్కీన్ షాట్ పొందవచ్చు. ఆండ్రాయిడ్ కోసం Screen Master అనే స్ర్కీన్ షాట్ ఎడిటింగ్ టూల్ పొందవచ్చు. క్రాప్ చేసుకోవచ్చు. టెక్స్ట్, స్టిక్కర్లు డ్రాప్ చేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ ఫొటోలను డ్రాప్ చేయొచ్చు. ఇందులో చాలా ఫీచర్లను ఉచితంగానే యాక్సస్ చేసుకోవచ్చు. అదే ప్రో వెర్షన్ అయితే 5 డాలర్లతో అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. అప్పుడు యాడ్స్ డిజేబుల్ అయిపోతాయి. కొన్ని అదనపు ఫీచర్లు యాడ్ అవుతాయి. స్ర్కీన్ షాట్ రీసైజు ఆప్షన్ యాడ్ అవుతుంది.