Spy Cameras : హోటళ్లకు వెళ్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఆ గదుల్లో సీక్రెట్ కెమెరాలు మీ ఫోన్‌తోనే కనిపెట్టొచ్చు తెలుసా?

Spy Cameras in Hotels : మీ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించి సీక్రెట్ కెమెరాలను కనుగొనడానికి, స్కామ్‌ల నుంచి సురక్షితంగా బయటపడేందుకు కొన్ని సురక్షితమైన మార్గాలు ఉన్నాయి.

Spy Cameras : హోటళ్లకు వెళ్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఆ గదుల్లో సీక్రెట్ కెమెరాలు మీ ఫోన్‌తోనే కనిపెట్టొచ్చు తెలుసా?

How to find hidden cameras from phones

Updated On : January 24, 2025 / 8:28 PM IST

Spy Cameras : ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఆయా ప్రదేశాల్లో మీకు కనిపించని సీక్రెట్ కెమెరాలు ఉండి ఉండవచ్చు. మీ వ్యక్తిగత పనులు చేసే సమయంలో చాలా అప్రమ్తతంగా ఉండాల్సి ఉంటుంది. లేదంటే.. మీ ప్రైవసీకి భంగం కలిగే ప్రమాదం పొంచి ఉంటుంది జాగ్రత్త..

ఈ రోజుల్లో కొత్త ప్రదేశానికి ప్రయాణించేటప్పుడు ఆందోళన కలిగించే విషయాల్లో హోటల్ గదులు, షాపింగ్ మాల్స్ ఒకటి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో యజమానులు, ట్రావెలర్లలు ఇతరులచే మోసపోతుంటారు. మీ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించి సీక్రెట్ కెమెరాలను కనుగొనడానికి, స్కామ్‌ల నుంచి సురక్షితంగా బయటపడేందుకు కొన్ని సురక్షితమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

Read Also : BSNL Plan : ఇదెక్కడి బాధరా బాబూ.. సెకండ్ సిమ్‌కి నెలనెలా రీచార్జ్ చేయాల్సి వస్తుందనుకుంటున్నారా?.. బీఎస్ఎన్ఎల్ ఖతర్నాక్ రీచార్జ్ ప్లాన్

ప్రపంచంలోని ప్రతి ప్రదేశంలో స్కామ్‌లు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో చాలా మంది ట్రావెలర్లకు హోటల్ గదులు అసురక్షిత ప్రదేశంగా మారాయి. తాము ఉండే హోటల్ గదుల్లో రహస్య కెమెరాలు ఉంటున్నాయని వాపోతున్నారు. కొన్నిసార్లు ఆయా గదుల్లో స్పై కెమెరాలు ఫిక్స్ చేశారనే విషయం కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి చర్యలు తమ ప్రైవసీకి ఇబ్బందిగా మారుతున్నాయని చెబుతున్నారు.

అందువల్ల, ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించాలన్నా ఏ రకమైన స్కామ్ లేదా బెదిరింపుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఆయా ప్రదేశాలను నిశితంగా పరిశీలించడం ఎంతైన అవసరమని గుర్తించాలి. ఆ గదిని తలక్రిందులుగా స్కాన్ చేసి తెలుసుకోవడం చాలా కీలకం.

మార్కెట్లో సీక్రెట్ హైడ్ కెమెరాలను గుర్తించడానికి అనేక గాడ్జెట్‌లు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ, మీ స్మార్ట్‌ఫోన్ కూడా చాలా స్మార్ట్‌గా పనిచేస్తుంది. అయితే మీ ఫోన్ ఎలా ఉపయోగించాలి అనేదానికి సరైన మార్గాలను తెలుసుకోవాలి. హోటల్ గదుల్లోని ఫోన్‌ల నుంచి రహస్య కెమెరాలను కనుగొనడానికి ఈ 4 స్మార్ట్ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హోటల్ గదుల్లో సీక్రెట్ కెమెరాలను కనిపెట్టేందుకు 4 మార్గాలివే :

మీ ఫోన్‌లోని ఫ్లాష్‌లైట్ మోడ్‌ను ఆఫ్ చేయండి :
సీక్రెట్ కెమెరాను గుర్తించడానికి సులభమైన మార్గం.. మీ స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్‌లైట్‌ని కెమెరాను హైడ్ ఉంచే అనుమానాస్పద ప్రదేశాలకు పాయింట్ చేయడం. మీ ఫోన్ నుంచి వచ్చే తెల్లని కాంతి కెమెరాను గుర్తించడంలో సాయపడుతుంది. ఎందుకంటే ఏదైనా లెన్స్ కాంతిని ప్రతిబింబిస్తుంది. మీరు ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే మాన్యువల్‌గా దగ్గరగా చూడండి.

ఇన్‌ఫ్రారెడ్ లైట్ కోసం స్కాన్ చేయండి :
ఇలా హైడ్ చేసిన కెమెరాల్లో ఎక్కువ భాగం ఇన్‌ఫ్రారెడ్ లైట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మానవ కంటికి కనిపించదు. కానీ, చాలా స్మార్ట్‌ఫోన్ కెమెరాలు ఈ లైట్లను గుర్తించగలవు. అందువల్ల, మీ హోటల్ గదిలోని లైట్లను తగ్గించండి. మీ స్మార్ట్‌ఫోన్ కెమెరా నుంచి అన్ని అనుమానిత ప్రాంతాలలో రికార్డ్ చేయండి. ఆపై స్క్రీన్‌పై ఏదైనా పల్సింగ్ డాట్ కనిపిస్తోందో చూడండి. ఆ ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించండి.

3. కెమెరా-స్పాటింగ్ యాప్స్ ఉపయోగించండి :
ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అనేక ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆధారిత కెమెరాలు యాప్ స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఇవి గదిలో దాచిన కెమెరాలను గుర్తించడంలో మీకు సాయపడతాయి. Detectify, Hidden IR Camera Detector, Hidden Spy Camera Finder Pro ఇతర యాప్‌లను వాడటం ద్వారా వాటి నుంచి మీకు అవసరమైన అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ యాప్‌లు కెమెరాలను, వాటి ఇన్‌ఫ్రారెడ్ లైట్లను సమర్థవంతంగా గుర్తించగలవు. ముందుగానే మీకు అనేక సూచనలను అందించి అలర్ట్ చేస్తాయి.

4. మీ Wi-Fi నెట్‌వర్క్‌ని చెక్ చేయండి :
అనేక వైర్‌లెస్ కెమెరాలకు ఇంటర్నెట్ యాక్సెస్ అవసరం. చాలా కెమెరాలు వై-ఫై నెట్‌వర్క్‌లతో కనెక్ట్ అవుతాయి. కాబట్టి, మీ స్మార్ట్‌ఫోన్‌లో నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉన్న డివైజ్‌ల కోసం స్కాన్ చేయండి. నెంబర్లు లేదా స్పెషల్ క్యారెక్టర్లతో ప్రారంభమయ్యే ఏదైనా అనుమానాస్పద నెట్‌వర్క్‌ను గుర్తించండి. ఇది మీ స్మార్ట్‌ఫోన్‌లోని బ్లూటూత్ ఫీచర్ ద్వారా కూడా గుర్తించవచ్చు. ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే అప్రమత్తం అయ్యేందుకు వీలుంటుంది.

Read Also : Alien Signal : భూమికి ఏలియన్ సిగ్నల్.. గ్రహంతరవాసులు ఉండేది ఇక్కడేనట.. స్థావరాన్ని కనిపెట్టిన ఖగోళ శాస్త్రవేత్తలు!