మైక్రోసాఫ్ట్ విండోస్ లో అనేక వెర్షన్లను రిలీజ్ చేసింది. విండోస్ 7 నుంచి విండోస్ 8 మాదిరిగానే ఇప్పుడు విండోస్ 10 వెర్షన్ కూడా నడుస్తోంది. విండోస్ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌కు మైక్రోసాఫ్ట్ ఎప్పుడో అప్ డేట్స్ నిలిపివేసింది.
సెక్యూరిటీ పరంగా అప్ డేట్స్ విండోస్ 8, విండోస్ 10 వెర్షన్ లకు మాత్రమే అందిస్తోంది. విండోస్ 10లో అనేక అప్ డేట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇటీవల విండోస్ 10 వెర్షన్ 2004 అప్‌డేట్స్ వచ్చేశాయి. విండోస్ 10 కొత్త యాప్ అప్ డేట్‌లో ఇప్పుడు ఒక బగ్ వినియోగదారులను ఇబ్బంది పెడుతోంది.
PC కనెక్ట్ అయినప్పుడు మీ వెబ్ బ్రౌజర్ వర్క్ చేస్తున్నా కూడా విండోస్ 10 యాప్‌లను ఇంటర్నెట్ యాక్సెస్ చేయడం లేదంట.. దీనికి కారణంగా అందులోని బగ్ అని టెక్ నిపుణులు చెబుతున్నారు. విండోస్ 10 యూజర్లు తమ పీసీలో ఇంటర్నెట్ యాక్సస్ చేసుకోలేక పోతున్నారు. ‘నో ఇంటర్నెట్ యాక్సెస్’ అంటూ ఎల్లో ఎర్రర్ కనిపిస్తుంది.
Windows 10 సిస్టమ్ ట్రేలో ఈ ఎర్రర్ చూడొచ్చు. మైక్రోసాఫ్ట్ ఈ బగ్.. సపోర్ట్ ఫోరమ్ థ్రెడ్‌లో అంగీకరించింది. విండోస్ 10 నెట్‌వర్క్ కనెక్టివిటీ స్టేటస్ ఇండికేటర్ సూచిస్తోందని తెలిపింది. ఇంతకీ విండోస్ 10 వెర్షన్ 2004 నెట్‌వర్క్ కనెక్టివిటీ బగ్‌ను ఎలా పరిష్కరించాలో చూద్దాం..
* విండోస్ టాస్క్‌బార్‌లోకి వెళ్లండి..
* సెర్చ్ బార్‌ను ద్వారా ‘Registry Editor’ కోసం సెర్చ్ చేయండి.
* రిజిస్ట్రీ ఎడిటర్‌ను ఓపెన్ చేయండి.
* ప్రాంప్ట్ విండో కనిపిస్తుంది.. దానిపై ‘Yes’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
* రిజిస్ట్రీ ఎడిటర్ యాప్‌లోకి వెళ్లండి..
* HKEY_LOCAL_MACHINE\SYSTEM\CurrentControlSet\Services\NlaSvc\Parameters\Internet
* కుడివైపు భాగంలో “EnableActiveProbing” పై క్లిక్ చేసి Modify ఎంచుకోండి.
* ‘Value data’ ను 0 నుంచి 1కి మార్చండి.
* ‘OK’ పై క్లిక్ చేసి విండోను క్లోజ్ చేయండి. Save అవుతుంది.
* రిజిస్ట్రీ ఎడిటర్‌ను క్లోజ్ చేయండి.
* సెట్టింగ్ లో చేసిన మార్పులు అప్లయ్ కావాలంటే సిస్టమ్ రీసార్ట్ చేయాల్సి ఉంటుంది.
* మీ PC ని రీబూట్ చేసిన తర్వాత యాప్స్ మళ్లీ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అవుతాయి.
* అప్పటికి కాకపోతే మాత్రం రిజిస్ట్రీని రెండుసార్లు చెక్ చేయాలి.
* బగ్ ఇంకా ఫిక్స్ కాకపోతే మరో మార్గంలో ప్రయత్నించాలి లేదా మైక్రోసాఫ్ట్ పాచ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.