Google Mak.ing Domain : గూగుల్ కొత్త డొమైన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలుసా? .ing డొమైన్ ఎలా పొందాలంటే?

Google Mak.ing Domain : గూగుల్ రిజిస్ట్రీ ఒక కొత్త టాప్ లెవల్ డొమైన్ (.ing)ని రిలీజ్ చేసింది. ఈ డొమైన్ ద్వారా వ్యాపారాలు, బ్రాండ్‌లు తమ కంపెనీ వెబ్‌సైట్‌ల కోసం సింగిల్-వర్డ్ డొమైన్ పేర్లను క్రియేట్ చేసుకోవచ్చు.

Mak.ing a new website on Google could cost you Rs 1 crore

Google Mak.ing Domain : ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) కొత్త డొమైన్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త డొమైన్‌లు ఇప్పుడు ‘ing.’తో సింగిల్ వర్డ్ వెబ్‌సైట్‌లను క్రియేట్ చేసుకునేందుకు వినియోగదారులను అనుమతిస్తాయి. (mak.ing) నుంచి (draw.ing) వరకు (Canva) ఇప్పటికే తీసుకుంది. వినియోగదారులు ఇప్పుడు వారి వెబ్‌సైట్‌లను ప్రత్యేకంగా, సులభంగా గుర్తుపట్టేలా అద్భుతమైన డొమైన్‌లను క్రియేట్ చేసుకోవచ్చు.

గూగుల్ అధికారిక బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. వినియోగదారులు ఇప్పుడు గూగుల్ ప్రారంభ యాక్సెస్ వ్యవధిలో (.ing) డొమైన్‌లను రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే, అదనంగా వన్-టైమ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు డిసెంబర్ 5 వరకు ప్రతిరోజూ తగ్గుతూ వస్తుంది. ఆ సమయంలో .ing డొమైన్‌లు 16:00 UTC (మధ్యాహ్నం ET)కి పబ్లిక్‌గా అందుబాటులో ఉంటాయి.

Read Also : Top SEO Ranking Factors 2023 : టాప్ 15 SEO ర్యాంకింగ్ టిప్స్.. మీ కొత్త వెబ్‌సైట్‌ను గూగుల్ ఫస్ట్ పేజీలో ఇలా ర్యాంక్ చేయొచ్చు!

ఈ టాప్ లెవల్ డొమైన్ కొనేందుకు మీకు ఆసక్తిగా ఉందా? అయితే, మీకోసం రెడీగా అందుబాటులో ఉంది. ఏదైనా కొత్త వెబ్‌సైట్‌ను ఆకర్షణీయమైన డిజైన్‌తో క్రియేట్ చేసేందుకు ఈ .ing డొమైన్ ప్రయోజనకరంగా ఉంటుంది. mak.ing, giv.ing design.ing, edit.ing వంటి ఎన్నో డొమైన్లు అందుబాటులో ఉన్నాయి. అడ్వెంచర్ వెబ్‌సైట్ కోసం (go.ing) డొమైన్, టాటా వెబ్‌సైట్ల కోసం (ink.ing) డొమైన్, dumpl.ing లేదా (adapt.ing) వంటి డొమైన్లను క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పటికే .ing అనే డొమైన్ ఎక్సెటెన్షన్ వేలానికి అందుబాటులో ఉంది. ఇప్పటికే (.ing)లో ఎవరు ఉన్నారు అనేదానిపై క్రిస్టినా యే గూగుల్ అధికారిక బ్లాగ్‌లో పేర్కొన్నారు.

రూ. కోటి విలువైన కొత్త డొమాన్లు : 
ఈ కొత్త డొమైన్‌ల ప్రారంభ యాక్సెస్ రూ. 1 కోటి వరకు ఉంటుంది. (ing) ఎండ్‌తో కూడిన డొమైన్లు ప్రస్తుతం చాలా ఖరీదైన ధరలో అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు.. think.ing, buy.ing రిజిస్టర్ చేసుకోవడానికి వరుసగా రూ. 32,49,999, ఏడాదికి 1,08,33,332.50 ఖర్చవుతుంది. (kin.ing) వంటి ఇతర పదాలు సంవత్సరానికి రూ. 16,249.17కి అందుబాటులో ఉన్నాయి. (Dye.ing) వంటి డొమైన్ ఏడాదికి రూ. 3,24,999 ధరకు అందుబాటులో ఉంది.

సరసమైన ధరలో కొత్త డొమైన్లు ఇవే :

కొన్ని డొమైన్‌లు సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయి. అందులో gam.ing కోసం సెర్చ్ చేస్తే ఈ డొమైన్ అందుబాటులో లేదు. ముఖ్యంగా, కొన్ని డొమైన్‌లు ఇప్పటికే చాలామంది రిజిస్టర్ చేసుకున్నారు. ఉదాహరణకు, Canva ఇప్పటికే design.ing, draw.ingలను తీసుకుంది. (Adobe Acrobat) edit.ing, sign.ing డొమైన్లను తీసుకుంది. వినియోగదారులు ఈ కొత్త డొమైన్‌లతో ఈ వెబ్‌సైట్‌లను విజిట్ చేయడానికి ప్రయత్నించవచ్చు.

.ing డొమైన్‌ను ఎలా పొందాలంటే? :

* గూగుల్ ప్రారంభ యాక్సెస్ వ్యవధిలో వినియోగదారులు .ing డొమైన్‌ను రిజిస్టర్ చేసుకోవచ్చు.
* .ing డొమైన్ పొందడానికి మీరు ఈ కింది విధంగా ప్రయత్నించవచ్చు.
* GoDaddy, Namecheap లేదా Google Domains వంటి డొమైన్ రిజిస్ట్రార్‌కి వెళ్లండి.
* మీకు కావలసిన .ing డొమైన్ కోసం సెర్చ్ చేయండి.
* డొమైన్ అందుబాటులో ఉంటే.. మీరు రుసుము చెల్లించి రిజిస్టర్ చేసుకోవచ్చు.
* మీరు డొమైన్‌ను రిజిస్టర్ చేసిన తర్వాత మీరు డొమైన్ ఉపయోగించుకోవచ్చు.

Mak.ing new website on Google

ముఖ్యంగా, .ing డొమైన్ ప్రస్తుతం ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం అందుబాటులో ఉంది. అయితే, డిసెంబర్ 5 నుంచి ఈ డొమైన్విస్తృతంగా అందుబాటులో ఉంటుంది. కొంచెం చౌకగానే ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. గూగుల్ రిజిస్ట్రీ ఆగస్ట్ పోస్ట్‌లో ప్రకటించినట్లుగా fun.meme టాప్-లెవల్ డొమైన్‌ను డెవలప్ చేస్తోంది. .meme డొమైన్ ప్రస్తుతం రిస్ట్రిక్టెడ్ రిజిస్ట్రేషన్ స్టేజీలో ఉంది. నవంబర్ 28న ముందస్తు యాక్సెస్‌కు అనుమతించనుంది. డిసెంబర్ 5న పబ్లిక్‌కు అందుబాటులోకి వస్తుంది.

.ing అనేది ఇంటర్నెట్‌లో కొత్త వెబ్‌సైట్లను సింగిల్ వర్డ్‌ డొమైన్లకు ప్రయోజనకరంగా ఉంటుందని గూగుల్ పేర్కొంది. అంతేకాదు .ingతో, వినియోగదారులు వ్యాపారాలు, బ్రాండ్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. అందులో design.ing లేదా writ.ing అయినా, ink.ing లేదా row.ing, .ing వేలానికి అందుబాటులో ఉన్నాయి. ఏదైనా డొమైన్ కొనుగోలు చేయొచ్చు. మరోవైపు, .meme కల్చర్‌కు సంబంధించినది. ఈ డొమైన్ ద్వారా మీమ్‌ కోసం ఫన్ వెబ్‌సైట్లను క్రియేట్ చేసుకోవచ్చు.

Read Also : Domains Name: ఇండియా పేరు మారిస్తే.. .IN డొమైన్‌ వెబ్‌సైట్ల పరిస్థితి ఏంటి?