Google Account : మీ గూగుల్ అకౌంట్లో డేటా భద్రమేనా? ఇలా ప్రొటెక్ట్ చేసుకోండి..!

ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అనేక సర్వీసులను అందిస్తోంది. అందులో ప్రధానంగా జీమెయిల్ ఒకటి..

Google Account : మీ గూగుల్ అకౌంట్లో డేటా భద్రమేనా? ఇలా ప్రొటెక్ట్ చేసుకోండి..!

Google Account

Updated On : February 8, 2022 / 10:55 PM IST

Google Account : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అనేక సర్వీసులను అందిస్తోంది. అందులో ప్రధానంగా జీమెయిల్ ఒకటి.. అలాగే యూట్యూబ్, గూగుల్ డ్రైవ్ స్టోరేజీ, వీడియో కాలింగ్, మెసేజింగ్ యాప్స్ వంటి మరెన్నో సర్వీసులను గూగుల్ అందిస్తోంది. షాపింగ్ న్యూస్, ఫొటోస్, క్యాలెండర్, కాంటాక్ట్స్ సర్వీసులను కూడా అందిస్తోంది. ఈ సర్వీసులను యూజర్లు వినియోగించుకోవాలంటే తప్పనిసరిగా గూగుల్ అడిగే కొంత డేటాను ఇవ్వాల్సి ఉంటుంది. అది మీ వ్యక్తిగత డేటాలో పేరు, పుట్టినతేదీ, ప్రొఫైల్ ఫొటో, మెయిల్ ఐడీ, జెండర్, ఉద్యోగం, వృత్తి, అడ్రస్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ వ్యక్తిగత సమాచారాన్ని గూగుల్ స్టోరేజీ చేయడం ద్వారా ఆన్ లైన్ మోసగాళ్లకు చిక్కే అవకాశం లేకపోలేదు. గూగుల్ సర్వీసుల్లో మీ వ్యక్తిగత డేటాను సైబర నేరగాళ్ల కంటపడకుండా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవడం తెలుసా? సాధారణంగా గూగుల్ సర్వీసుల్లో స్టోర్ చేసిన వ్యక్తిగత డేటాను బయటకు కనిపించకుండా హైడ్ చేసుకునే వీలుంది. అదే.. Personal Me Info Section వంటి కొన్ని ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆప్షన్ల ద్వారా ఈజీగా మీ వ్యక్తిగత డేటాను భద్రపరుచుకోవచ్చు. ముందుగా మీరు చేయాల్సిందిల్లా.. గూగుల్ అకౌంట్ ఓపెన్ చేయండి.. అందులో పర్సనల్ మీ ఇన్ఫో సెక్షన్ ఓపెన్ చేయండి.

అక్కడే What Others See అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత About Me అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. మీకు అక్కడ ADD అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులోనే Edit, Remove అనే ఆప్షన్లు కూడా ఉన్నాయి. మీ ప్రొఫైల్ కు సంబంధించి ఏదైనా డేటా అదనంగా యాడ్ చేయాలంటే చేసుకోవచ్చు.

లేదంటే ఉన్న డేటాను కూడా డిలీట్ చేసుకోవచ్చు. మీ పేరులో ఏమైనా మార్పులు చేయాలన్నా చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకుని దానిపై క్లిక్ చేస్తే చాలు.. అప్పుడు మీ వ్యక్తిగత డేటా హైడ్ అవుతుంది. Only Me అనే ఆప్షన్ తప్పకుండా ఎంచుకోవాలి. అప్పుడు మాత్రమే మీ వ్యక్తిగత డేటా ఇతరులకు కనిపించదు.

Read Also : Khiladi: ధైర్యంగా థియేటర్లకి ఖిలాడీ.. మాస్ రాజాకి ఇంత నమ్మకమేంటి?