Netflix Profile : నెట్‌ఫ్లిక్స్ ప్రొఫైల్ ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలో తెలుసా? అదనపు ఫీజు చెల్లించకుండానే పాస్‌వర్డ్ షేరింగ్ చేసుకోవచ్చు!
Netflix Profile : ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ప్లిక్స్ (Netflix) 2023 నాటికి ప్రొఫైల్ పాస్‌వర్డ్ (Profile Password)ను ఇతరులతో షేర్ చేసుకునే యూజర్లకు అదనపు ఫీజును వసూలు చేయనుంది.

How to transfer Netflix profile and avoid additional fees on password sharing
Netflix Profile : ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ప్లిక్స్ (Netflix) 2023 నాటికి ప్రొఫైల్ పాస్‌వర్డ్ (Profile Password)ను ఇతరులతో షేర్ చేసుకునే యూజర్లకు అదనపు ఫీజును వసూలు చేయనుంది. నెట్‌ఫ్లిక్స్ ఆదాయాన్ని పెంచుకునేందుకు చాలా మంది యూజర్లు అకౌంట్ ఉపయోగించకుండా Netflix అకౌంట్ బిల్లింగ్ వివరాలకు అదనపు ఛార్జీలను అందిస్తుంది. OTT దిగ్గజం ఛార్జీలను వెల్లడించలేదు. 3 డాలర్ల నుంచి 4 డాలర్ల మధ్య ఉండవచ్చనని భావిస్తున్నారు. మీ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ క్రెడెన్షియల్‌ను ఇతరులతో షేర్ చేస్తుంటే.. ఇకపై నిలిపివేయండి. లేదంటే మీకు కంపెనీ ఫైన్ విధించవచ్చు.
మీ అకౌంట్ స్నేహితులను వారి సొంత Netflix అకౌంట్ క్రియేట్ చేయమని అడగండి. మరొకరి అకౌంట్ ఉపయోగిస్తున్నయూజర్లు తమ నెట్‌ఫ్లిక్స్ సిఫార్సులు, వ్యూ హిస్టరీ, మై లిస్ట్, సేవ్ అయిన గేమ్‌లు, ఇతర సెట్టింగ్‌లను కోల్పోకుండా కొత్త ప్రొఫైల్‌కు మారవచ్చు. Netflix ఫీజులను నివారించేందుకు ట్రాన్స్‌ఫర్ ప్రొఫైల్ Netflixతో మీ సొంత పర్సనల్ మెంబర్‌షిప్ ప్రారంభిస్తుంది. మీ నెట్‌ఫ్లిక్స్ ప్రొఫైల్‌ను కొత్త అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసేందుకు ఇలా ప్రయత్నించండి.

How to transfer Netflix profile and avoid additional fees on password sharing
నెట్‌ఫ్లిక్స్ ప్రొఫైల్‌ను కొత్త అకౌంట్‌కు ఎలా బదిలీ చేయాలంటే? :
– వెబ్ బ్రౌజర్‌లో నెట్‌ఫ్లిక్స్ తెరవండి.
– మీరు ట్రాన్స్‌ఫర్ చేయాలనుకునే ప్రొఫైల్‌ను కలిగిన నెట్‌ఫ్లిక్స్ అకౌంట్‌కు సైన్ ఇన్ చేయండి.
– హోమ్‌పేజీలో ప్రొఫైల్ ఆప్షన్ డ్రాప్-డౌన్‌లో ఉన్న అకౌంట్ పేజీ ఎంపికను విజిట్ చేయండి.
– ప్రొఫైల్‌లు, పేరంట్స్ కంట్రోల్ సెక్షన్‌లో మీరు కొత్త అకౌంట్ ప్రారంభించాలనుకుంటే ప్రొఫైల్‌ను ఎంచుకోండి.
– మీరు ట్రాన్స్‌ఫర్ ప్రొఫైల్ విభాగంలో అందుబాటులోని ట్రాన్స్‌ఫర్ లింక్‌ను ఎంచుకోవాలి.
Note : నెట్‌ఫ్లిక్స్ మీ అకౌంట్లలో ప్రొఫైల్ కాపీని చేసుకోవచ్చు.
– ఆ తర్వాత, మీరు మీ కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకునే ఈమెయిల్ అడ్రస్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
– సెటప్‌ను పూర్తి చేసి, స్క్రీన్‌పై ప్రాంప్ట్‌లను ఫాలో అవ్వండి.
– ప్రొఫైల్ ట్రాన్స్‌ఫర్ పూర్తయిన తర్వాత Netflix మీకు నోటిఫికేషన్ పంపుతుంది.
– యూజర్లు ఎప్పుడైనా మీ అకౌంట్ సెట్టింగ్‌లలో ప్రొఫైల్ ట్రాన్స్‌ఫర్ కూడా ఆఫ్ చేయవచ్చు.

How to transfer Netflix profile and avoid additional fees on password sharing
నెట్‌ఫ్లిక్స్ యూజర్లు Android iOS డివైజ్‌లలో ప్రొఫైల్‌లను యాడ్ చేయడానికి లేదా డిలీట్ చేయడానికి కూడా అనుమతిస్తుంది. మీ ప్రొఫైల్‌ని ఇలా కస్టమజ్ చేసుకోవచ్చు.
– మీ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ Manage Profiles పేజీకి వెళ్లండి.
– ఆపై మీరు మార్చాలనుకుంటున్న ప్రొఫైల్‌ను ఎంచుకోండి.
– ప్రొఫైల్‌లో పేరు, ఫొటో లేదా భాషను మార్చండి.
– మీరు మీ డివైజ్ నుంచి ప్రొఫైల్‌ను ఎడిట్ చేయలేకపోతే.. వెబ్ బ్రౌజర్‌లో netflix.comని విజిట్ చేయండి.
– పైన పేర్కొన్న Steps ఫాలో అవ్వండి.
– మీరు చేసిన మార్పులను Save చేయండి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..