ATM Withdraw Money : ఏటీఎంలో డెబిట్, క్రెడిట్ కార్డు లేకుండానే డబ్బులు విత్‌డ్రా చేయొచ్చు!

ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేయాలంటే ఇకపై డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు అవసరం లేదు. ఏటీఎంలో నుంచి నేరుగా డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు.

ATM Withdraw Money : ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేయాలంటే ఇకపై డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు అవసరం లేదు. ఏటీఎంలో నుంచి నేరుగా డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశాల ప్రకారం.. అన్ని బ్యాంకులు, ATM నెట్‌వర్క్‌లు, వైట్ లేబుల్ ATM ఆపరేటర్లు లేదా WLAOలు దేశంలోని అన్ని ATMలలో ఇంటర్‌ఆపరబుల్ కార్డ్-లెస్ క్యాష్ విత్‌డ్రావల్ (ICCW) సౌకర్యాన్ని అందించనున్నాయి. ఈ సదుపాయం అన్ని బ్యాంకులకు అందుబాటులోకి రానుంది. ప్రతి ఒక్కరూ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించకుండానే ATMల నుంచి నగదును తీసుకోవచ్చు.

అన్ని బ్యాంకులు ATM నెట్‌వర్క్‌లతో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఇంటిగ్రేషన్‌ను సులభతరం చేయాలని RBI నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)ని కోరింది. అన్ని బ్యాంకులు, ATM నెట్‌వర్క్‌లు, WLAOలు ATMలలో ICCW ఆప్షన్ అందించవచ్చు. అన్ని బ్యాంకులు, ATM నెట్‌వర్క్‌లతో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఇంటిగ్రేషన్‌ను సులభతరం చేయాలని NPCIకి సూచించినట్టు RBI సర్క్యులర్‌లో వెల్లడించింది.

ప్రస్తుతం, ఐసిఐసిఐ, హెచ్‌డిఎఫ్‌సి ఎంపిక చేసిన బ్యాంకులకు మాత్రమే ఏటీఎంల్లో కార్డ్‌లెస్ నగదు ఉపసంహరణ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. రోజులు గడిచేకొద్దీ.. దేశంలోని అన్ని ఇతర బ్యాంకులు కస్టమర్‌లు తమ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ సాయం లేకుండానే ATM నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతించింది.డెబిట్, క్రెడిట్ కార్డ్ ఉపయోగించకుండా మీరు ATM నుంచి డబ్బును ఎలా విత్‌డ్రా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..

కార్డును ఉపయోగించకుండా నగదును ఎలా విత్ డ్రా చేయాలంటే? :
ఈ సదుపాయాన్ని ఉపయోగించడానికి ముందుగా.. బ్యాంకుకు వెళ్లి రిక్వెస్ట్ పెట్టుకోవాలి. 

ICICI బ్యాంక్ :
-ఐసిఐసిఐ బ్యాంక్ మొబైల్ యాప్‌లో సర్వీసులకు వెళ్లండి.
-కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
– 4-అంకెల టెంపరరీ పిన్‌తో పాటు మొత్తాన్ని నమోదు చేయండి.
– మీరు డబ్బును విత్ డ్రా చేయడానికి అకౌంట్ నంబర్‌ను ఎంచుకోండి.
– మీరు ముందస్తు నిర్ధారణ స్క్రీన్‌పై కనిపించే వివరాలను నిర్ధారించాలి.
-Submit ఎంపికపై క్లిక్ చేయండి.

How To Withdraw Money From Atm Without Debit Or Credit Card 

ఒకసారి ఇది యాక్టివేట్ అయిన తర్వాత.. మీరు బ్యాంక్ నుంచి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు స్పెషల్ 6-అంకెల కోడ్‌తో మెసేజ్ వస్తుంది. ఆ కోడ్ 6 గంటల వరకు మాత్రమే వ్యాలిడిటీలో ఉంటుంది.

– మీ సమీపంలోని బ్యాంక్ ATM (ICICI బ్యాంక్ ATM) సందర్శించండి
– రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, మీరు సెట్ చేసిన టెంపరరీ 4-అంకెల కోడ్ ఎంటర్ చేయాలి.
– SMSలో వచ్చిన 6-అంకెల కోడ్, విత్ డ్రా ఎంత చేయాలో ఆ మొత్తాన్ని ఎంటర్ చేయాలి.
– మీ వివరాలు ధృవీకరించిన తర్వాత, ATM నుంచి నగదు విత్ డ్రా అవుతుంది.

Read Also : RBI : ఆర్బీఐ సంచలన నిర్ణయం..భారీగా పెరుగనున్న బ్యాంకు రుణాల వడ్డీ రేట్లు

ట్రెండింగ్ వార్తలు