Huawei Pura X Max : హువావే నుంచి ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్.. 50MP కెమెరా, 5300mAh బ్యాటరీతో పురా X మ్యాక్స్.. ధర ఎంతంటే?

Huawei Pura X Max : హువావే ఫస్ట్ వైడ్-ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్ హువావే పురా ఎక్స్ మ్యాక్స్‌ను చైనా మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.

Huawei Pura X Max

  • హువావే పురా ఎక్స్ మ్యాక్స్ 7.7-అంగుళాల ఎల్టీపీఓ 2.0 ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే
  • ఈ ఫోల్డబుల్ ఫోన్ కిరిన్ 9030 ప్రో చిప్‌సెట్‌తో రన్ అవుతుంది
  • హువావే 5,300mAh బ్యాటరీ, 50MP ప్రైమరీ కెమెరా

Huawei Pura X Max : హువావే ఫస్ట్ వైడ్-ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. హువావే పురా X మ్యాక్స్‌ను చైనా మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోల్డబుల్ ఫోన్ కిరిన్ 9030 ప్రో చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ఇందులో 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,300mAh బ్యాటరీ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా కూడా ఉంది. హువావే పురా ఎక్స్ మ్యాక్స్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

హువావే పురా ఎక్స్ మాక్స్ ధర ఎంతంటే? :
హువావే పురా ఎక్స్ మ్యాక్స్ 12GB/256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 10,999 (సుమారుగా రూ. 1,50,000), 12GB/512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 11,999 (సుమారుగా రూ. 1,64,000), 16GB/512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 12,999 (సుమారుగా రూ. 1,77,000), 16GB/1TB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 13,999 (సుమారుగా రూ. 1,91,000)గా ఉంటాయి.

ఈ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 25న హువావే చైనా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా చైనాలో అమ్మకానికి రానుంది. ఇంటర్‌స్టెల్లార్ బ్లూ, ఆలివ్ గోల్డ్, ఫాంటమ్ బ్లాక్, వైబ్రెంట్ ఆరెంజ్, జీరో డిగ్రీ వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

హువావే పురా :
హువావే పూరా X మ్యాక్స్ 7.7-అంగుళాల ఎల్టీపీఓ 2.0 ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. రిజల్యూషన్ 2584×1828 పిక్సెల్స్, 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ టాప్ బ్రైట్ నెస్ ఉంటుంది. 5.4-అంగుళాల ఎక్స్ ట్రనల్ రెండో జనరేషన్ కున్లున్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 1848×1264 పిక్సెల్స్ రిజల్యూషన్, 3500 నిట్స్ వరకు టాప్ బ్రైట్ నెస్ అందిస్తుంది.

Read Also : BSNL Fiber Plan : గుడ్ న్యూస్.. రూ.1099కే 3 నెలల BSNL వై-ఫై, 1400GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్.. ఎలా బుక్ చేయాలంటే?

ఈ ఫోన్ హార్మొనీఓఎస్ 6.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. పూరా X మ్యాక్స్ కంపెనీ కిరిన్ 9030 ప్రో చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో 16GB వరకు ర్యామ్, 1TB వరకు ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP58 + IP59 రేటింగ్‌తో వస్తుంది.

కెమెరా సెటప్ విషయానికి వస్తే..
హువావే పూరా ఎక్స్ మ్యాక్స్‌లో బ్యాక్ సైడ్ OIS సపోర్ట్, ఎఫ్/1.4 నుంచి ఎఫ్/4.0 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, OIS, ఎఫ్/2.2 అపర్చర్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, ఎఫ్/2.2 అపర్చర్‌తో 12.5MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోల్డబుల్ డిస్‌ప్లేపై ఎఫ్/2.2 అపర్చర్‌తో 8MP కెమెరా, కవర్ డిస్‌ప్లేపై ఎఫ్/2.4 అపర్చర్‌తో మరో 8MP కెమెరా ఉన్నాయి.

హువావే పూరా ఎక్స్ మ్యాక్స్ 5,300mAh బ్యాటరీతో వస్తుంది. 66W వైర్డ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. సేఫ్టీ కోసం ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. కొలతల విషయానికి వస్తే.. ఈ ఫోన్ ఫోల్డ్ చేసినప్పుడు 120mm పొడవు, 85mm వెడల్పు, 11.2mm మందం ఉంటుంది.

ఈ ఫోన్ ఫోల్డ్ ఓపెన్ చేస్తే.. 120mm పొడవు, 166.5mm వెడల్పు, 5.2mm మందం ఉంటుంది. సుమారుగా 229 గ్రాముల బరువు ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, 4G LTE, బ్లూటూత్ 6, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, USB టైప్-C పోర్ట్, GPS ఉన్నాయి.