Samsung Galaxy Phones : ఇది కదా డిస్కౌంట్.. శాంసంగ్ గెలాక్సీ S25 FE, గెలాక్సీ S25 ప్లస్‌పై దిమ్మతిరిగే ఆఫర్.. ఇలాంటి డిస్కౌంట్ ఇప్పట్లో రాదు..!
Samsung Galaxy Phones : శాంసంగ్ లవర్స్ తప్పక కొనాల్సిన ఫోన్లు.. శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎఫ్ఈ, శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ప్లస్ ఫోన్లు భారీగా తగ్గాయి. ఈ శాంసంగ్ మోడల్స్ అతి చౌకైన ధరకే ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దాం..
Samsung Galaxy Phone
- బ్యాంకు ఆఫర్లతో శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ ధర రూ. 50వేలకు పైగా తగ్గింపు
- శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ ధర రూ. 71,499 నుంచి రూ. 69వేలకు తగ్గింపు
- ఈ రెండు ఫోన్లు ఈఎంఐ ఆప్షన్లు, రూ. 40,990 వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్
Samsung Galaxy Phones : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేవారికి భారీ గుడ్ న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. మీరు ఆండ్రాయిడ్‌కు అప్‌గ్రేడ్ అవ్వాలనుకుంటే.. సుమారు రూ. 70వేల ధరలో కొత్త శాంసంగ్ ఫ్లాగ్షిప్ డివైస్ సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం మీకోసం రెండు అద్భుతమైన డీల్స్ లభిస్తున్నాయి.
గత జనరేషన్ శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్, లేటెస్ట్ ఫ్యాన్ ఎడిషన్ (Samsung Galaxy Phones) శాంసంగ్ గెలాక్సీ S25 FE భారీ ధర తగ్గింపుతో కొనేసుకోవచ్చు. ఈ డివైస్‌లలో ప్రతి ఫోన్ కనీసం రూ. 10వేల తగ్గింపుతో లభిస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ, శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ ధరల డీల్స్‌ను ఓసారి పరిశీలిద్దాం..
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ ఫ్లాగ్షిప్ ఫీచర్లతో సరసమైన ధరలో లభిస్తోంది. లేటెస్ట్ ఫ్యాన్ ఎడిషన్ ఇప్పుడు ఇంకా తక్కువ ధరకే లభిస్తోంది. ఈ శాంసంగ్ ఫోన్ అసలు ధర రూ. 59,999 ఉండగా రూ. 50,580 తక్కువ ధరకే లభిస్తోంది. అదనంగా, వినియోగదారులు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో రూ. 1,500 బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
ధర రూ. 50వేల కన్నా తక్కువకే లభిస్తోంది. వినియోగదారులు ఈ శాంసంగ్ ఫోన్ నెలకు రూ. 1,778 నుంచి ఈఎంఐ, రూ. 40,990 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూతో కూడా పొందవచ్చు. ఈఎంఐ, ఎక్స్చేంజ్ వాల్యూ అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. బ్యాంక్ నిబంధనలు, మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్ ఆధారంగా తగ్గింపు పొందవచ్చు.
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ ధర :
గత జనరేషన్ ఫ్లాగ్షిప్ శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ కూడా భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ శాంసంగ్ ప్లస్ మోడల్ రూ. 71,499కే పొందవచ్చు. రూ. 2,100 వరకు బ్యాంక్ ఆఫర్లతో ధర సుమారు రూ. 69,000కు తగ్గుతుంది. శాంసంగ్ గెలాక్సీ S25 FE మాదిరిగానే ఈ డివైస్‌కు కూడా ఎక్స్ఛేంజ్, ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
ఆసక్తిగల యూజర్లు రూ. 40,990 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ, నెలకు రూ. 2,510 ఈజీ ఈఎంఐలతో పొందవచ్చు. మీరు ఈ ఫోన్లలో ఏదైనా కొనుగోలు చేస్తే అదనపు మొత్తం చెల్లించి ఫుల్ మొబైల్ ప్రొటెక్షన్, స్క్రీన్ ప్రొటెక్షన్ వంటి యాడ్-ఆన్‌లను కూడా పొందవచ్చు.
