Digital Rupee App : ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. డిజిటల్ రూపీ యాప్‌తో మర్చంట్ QR కోడ్‌‌కు పేమెంట్ చేసుకోవచ్చు!

Digital Rupee App : ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. డిజిటల్ రూపీ యాప్ (Digital Rupee by ICICI Bank) ద్వారా సులభంగా మర్చంట్ QR కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసుకోవచ్చు.

Digital Rupee App : ప్రముఖ ఐసీఐసీఐ బ్యాంకు (ICICI Bank) తమ కస్టమర్ల కోసం సరికొత్త పేమెంట్ యాప్ తీసుకొచ్చింది. ‘డిజిటల్ రూపీ బై ఐసీఐసీఐ బ్యాంక్’ (Digital Rupee by ICICI Bank) పేరుతో బ్యాంక్ డిజిటల్ రూపీ యాప్‌ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త యాప్ ద్వారా లక్షలాది మంది ఖాతాదారులు ఏ మర్చంట్ QR కోడ్‌కు అయినా ఈజీగా పేమెంట్లు చేసే అవకాశం కల్పించినట్లు ఐసిఐసిఐ బ్యాంక్ వెల్లడించింది. ఈ డిజిటల్ రూపీ యాప్ UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్)తో ఇంటగ్రేషన్ చేసింది. తద్వారా కస్టమర్‌లు, మర్చంట్ అవుట్‌లెట్‌లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న UPI QR కోడ్‌ని స్కాన్ చేసి పేమెంట్లు చేసుకోవచ్చు.

80 నగరాల్లో ఈ కొత్త సదుపాయం :
అదే సమయంలో, వ్యాపారులు తమ ప్రస్తుత UPI QR కోడ్‌పై డిజిటల్ రూపీ పేమెంట్లను అంగీకరించడానికి సాయపడుతుంది. దాంతో ఆన్-బోర్డింగ్ ప్రాసెస్ అవసరాన్ని సైతం  తొలగిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ తమ డిజిటల్ రూపీ యాప్‌లో యూపీఐ ఇంటర్‌పెరాబిలిటీని అందించడం ద్వారా యూజర్లకు మరింత సౌకర్యాన్ని అందించడంతో పాటు డిజిటల్ రూపీ వినియోగాన్ని కూడా విస్తరించింది. డిసెంబర్ 2022లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రారంభించిన డిజిటల్ కరెన్సీపై పైలట్ ప్రాజెక్ట్‌లో మొదటి కోహోర్ట్‌లో పాల్గొనడానికి ఐసిఐసిఐ బ్యాంక్ ఎంపిక అయింది. దేశంలోని 80 నగరాల్లో బ్యాంక్ ఈ సదుపాయాన్ని కలిగి ఉంది.

Read Also : Tech Tips in Telugu : విదేశీ ప్రయాణాల్లో UPI పేమెంట్లు ఎలా చేయాలో తెలుసా? ఏయే దేశాల్లో భారతీయ యూపీఐ సర్వీసు అందుబాటులో ఉందంటే?

మర్చంట్ క్యూఆర్ కోడ్‌పై పేమెంట్లు :

ఈ కార్యక్రమంపై ఐసీఐసీఐ బ్యాంక్ హెడ్- మర్చంట్ ఎకోసిస్టమ్ బిజిత్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘ఐసిఐసిఐ బ్యాంక్‌లో మా కస్టమర్‌లకు సౌకర్యవంతమైన వినూత్నమైన డిజిటల్ బ్యాంకింగ్ పరిష్కారాలను అందించడానికి ప్రయత్నిస్తున్నాం. మా డిజిటల్ రూపీ యాప్‌లోని ఈ కొత్త ఫీచర్ ‘డిజిటల్ రూపీ బై ఐసీఐసీఐ బ్యాంక్’ ఇప్పటికే ఉన్న మర్చంట్ క్యూఆర్ కోడ్‌పై చెల్లింపులు చేయడానికి బ్యాంక్ కస్టమర్‌లను అనుమతిస్తుంది. తద్వారా పేమెంట్లను మరింతగా విస్తరిస్తుంది. ఈ కార్యక్రమంతో భారత్‌లో డిజిటల్ పేమెంట్లను భవిష్యత్తులో ఒక నమూనా మార్పును తీసుకువస్తుందని, కస్టమర్లలో డిజిటల్ కరెన్సీకి ఎక్కువ ఆమోదాన్ని ప్రోత్సహిస్తుందని, డిజిటల్ రూపీ ద్వారా లావాదేవీల పెరుగుదలకు దోహదం చేస్తుందని నమ్ముతున్నాం’ అని అన్నారు.

digital rupee app merchant QR code

ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లకు సపోర్టు :

‘డిజిటల్ రూపీ బై ఐసీఐసీఐ బ్యాంక్’ యాప్ ఆండ్రాయిడ్, iOS డివైజ్‌ల కోసం అందుబాటులో ఉంది. ఈ యాప్ యూజర్లకు ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ నుంచి తమ డిజిటల్ వాలెట్‌ను లోడ్ చేసుకునే సౌలభ్యాన్ని అందిస్తుంది. అంతేకాదు.. కస్టమర్లు తమ డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు లేదా ఇతరులకు పేమెంట్లు కూడా చేయవచ్చు.

వ్యాలెట్‌లోని బ్యాలెన్స్ నిర్దేశిత మొత్తం కన్నా తక్కువగా ఉంటే.. యాప్ కస్టమర్ సేవింగ్స్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా డబ్బును వాలెట్‌కి లోడ్ చేస్తుంది. బ్యాంకు తమ బ్రాంచ్‌లు, ఏటీఎంలు, కాల్ సెంటర్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ (www.icicibank.com) మొబైల్ బ్యాంకింగ్ మల్టీ-ఛానల్ డెలివరీ నెట్‌వర్క్ ద్వారా ఐసీఐసీఐ బ్యాంక్ తమ భారీ కస్టమర్ బేస్‌కు సర్వీసులు అందిస్తుంది.

ఐసీఐసీఐ బ్యాంక్ ద్వారా డిజిటల్ రూపీతో పేమెంట్ చేయాలంటే?
* ‘ఐసీఐసీఐ బ్యాంక్ ద్వారా డిజిటల్ రూపీ’ని లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోండి.
* యాప్‌స్టోర్ లేదా ప్లేస్టోర్ ఓపెన్ చేయండి.
* యాప్ ద్వారా Login చేయండి.
* స్కాన్ QR ఎంపికపై క్లిక్ చేసి, మర్చంట్ UPI QR కోడ్‌ని స్కాన్ చేయండి.
* మొత్తాన్ని ఎంచుకుని, పిన్‌ను ఎంటర్ చేయండి. ట్రాన్సాక్షన్ పూర్తి చేయండి.

Read Also : Tech Tips in Telugu : BHIM యూపీఐ ద్వారా UPI PIN రీసెట్ చేసుకోవచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

ట్రెండింగ్ వార్తలు