Tech Tips in Telugu : విదేశీ ప్రయాణాల్లో UPI పేమెంట్లు ఎలా చేయాలో తెలుసా? ఏయే దేశాల్లో భారతీయ యూపీఐ సర్వీసు అందుబాటులో ఉందంటే?

Tech Tips in Telugu : భారత పాపులర్ డిజిటల్ పేమెంట్ మెథడ్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI), ఇప్పుడు అంతర్జాతీయ లావాదేవీల కోసం అందుబాటులో ఉంది. ప్రవాస భారతీయులకు (NRIs)లు, విదేశాలకు వెళ్లే భారతీయులకు సౌకర్యవంతంగా ఉంటుంది.

Tech Tips in Telugu : విదేశీ ప్రయాణాల్లో UPI పేమెంట్లు ఎలా చేయాలో తెలుసా? ఏయే దేశాల్లో భారతీయ యూపీఐ సర్వీసు అందుబాటులో ఉందంటే?

Tech Tips in Telugu _ How to make UPI payments while travelling to other countries

Tech Tips in Telugu : భారత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) అనేది దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ పేమెంట్ పద్ధతుల్లో ఒకటి. ఈ UPI సర్వీసు ద్వారా వేగంగా, సౌకర్యవంతంగా సురక్షితంగా చేసుకోవచ్చు. UPI ID లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్‌తో ఎవరికైనా పేమెంట్లు చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. మొదట్లో దేశీయ అవసరాల కోసం ప్రారంభించిన ఈ వ్యవస్థ దేశంలో పేమెంట్ల ప్రాధాన్యత మోడ్‌గా మారింది. ఇప్పుడు విదేశాలకు ప్రయాణించే భారతీయులకు కూడా UPI పేమెంట్లు అందుబాటులో ఉండాలనే డిమాండ్ పెరుగుతోంది.

ఈ క్రమంలోనే విదేశాల్లోని భారతీయుల కోసం లావాదేవీలను సులభతరం చేసేందుకు భారత ప్రభుత్వం ఫ్రాన్స్, UAEతో సహా అనేక అంతర్జాతీయ దేశాలలో UPI పేమెంట్లను అందుబాటులోకి తెచ్చింది. అంతర్జాతీయ లావాదేవీలను ప్రారంభించడానికి ప్రవాస భారతీయులకు (NRIs) కూడా అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం UPI పేమెంట్లు అందుబాటులో ఉన్న దేశాల జాబితా మీకోసం అందిస్తున్నాం. ఇందులో ఈ కింది దేశాలకు ప్రయాణించే భారతీయులు UPIని ఉపయోగించి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు.

Read Also : Google Job Resume Tips : మీ రెజ్యూమ్‌‌లో ఈ 2 పెద్ద తప్పులు చేస్తే.. మీకు గూగుల్‌ ఉద్యోగం ఇవ్వదు.. ఇలా ప్రీపేర్ చేస్తే జాబ్ పక్కా..!

* ఫ్రాన్స్
* భూటాన్
* నేపాల్
* ఒమన్
* UAE
* మలేషియా
* థాయిలాండ్
* ఫిలిప్పీన్స్
* వియత్నాం
* సింగపూర్
* కంబోడియా
* హాంగ్ కొంగ
* తైవాన్
* దక్షిణ కొరియా
*జపాన్
* యునైటెడ్ కింగ్‌డమ్
* యూరప్

భారత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) అందుబాటులో ఉన్న దేశాలలో ప్రయాణిస్తున్నట్లయితే.. మీరు లావాదేవీలు చేయడానికి PhonePe, Amazon Pay, Google Pay, Paytm, ఇతర UPI పేమెంట్ యాప్‌లను ఉపయోగించవచ్చు. ఈ యాప్‌లు మీ UPI ID లేదా లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నంబర్‌ని ఉపయోగించి డిజిటల్ పేమెంట్లను నిర్వహించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. విదేశాలలో ఉన్నప్పుడు పేమెంట్లు చేయడానికి సురక్షితమైన మార్గాన్ని అందిస్తాయి.

ఇతర దేశాలలో UPI యాప్‌లను ఎలా ఉపయోగించాలి :
* దేశంలో అంతర్జాతీయ UPI లావాదేవీలను అనుమతించే PhonePe, Google Pay లేదా Paytm ద్వారా UPI ఆధారిత మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి.
* ఈ UPI యాప్‌తో మీ భారతీయ బ్యాంక్ అకౌంట్ రిజిస్టర్ చేసుకోండి.
* మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసిన తర్వాత రిసీవర్ వివరాలు, వారి బ్యాంక్ అకౌంట్ నంబర్, IBAN, BICతో సహా ట్రాన్స్‌ఫర్ మొత్తం కరెన్సీతో సహా అందించాలి.
* లావాదేవీ పూర్తయిన తర్వాత Confirm మెసేజ్ అందుకుంటారు.

Tech Tips in Telugu _ How to make UPI payments while travelling to other countries

Tech Tips in Telugu _ How to make UPI payments while travelling to other countries

ముఖ్యంగా, మీరు చేసే ప్రతి లావాదేవీ అనేది ఇప్పటికీ ఎక్స్చేంజ్ ఛార్జీలు, విదేశీ మారకపు రుసుములు వంటి మరిన్ని నిర్దిష్ట రుసుములకు లోబడి ఉంటాయని గమనించాలి. అలాగే, సిస్టమ్ విదేశాలలో క్రమంగా అందుబాటులోకి వస్తుంది. అందుకే, ఈ సిస్టమ్ అన్ని లిస్టు చేసిన దేశాలలో అందుబాటులో ఉండకపోవచ్చు. మీరు NRI అయితే.. UPIని ఎలా ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం..

* PhonePe, Google Pay లేదా Paytm వంటి UPI ఆధారిత మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి.
* యాప్‌తో మీ NRE లేదా NRO అకౌంట్ రిజిస్టర్ చేసుకోండి.
* మీ భారతీయ మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలను అందించాలి.
* మీ అకౌంట్ లింక్ చేసిన తర్వాత, భారత్‌లో UPI IDని కలిగిన ఎవరికైనా పేమెంట్లు చేయడానికి మీ UPIని ఉపయోగించవచ్చు.
* భారత్‌లో మర్చంట్ అవుట్‌లెట్‌లలో వస్తువులు, సర్వీసుల కోస చెల్లించడానికి UPIని కూడా ఉపయోగించవచ్చు.

Read Also : Netflix Account New Rules : భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ కొత్త రూల్స్ ఇవే.. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో పాస్‌‌వర్డ్ షేరింగ్ విధానం ఎలా పనిచేస్తుందంటే?