భీమ్ యూపీఐ ద్వారా యూపీఐ పిన్ రీసెట్ చేసుకోవచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!
Tech Tips in Telugu : భీమ్ యూపీఐ యాప్ వాడుతున్నారా? మీ యూపీఐ పిన్ రీసెట్ చేసుకోవడం తెలుసా? ఇదిగో ఈ సింపుల్ టిప్స్ ప్రయత్నించండి.

Tech Tips in Telugu : యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) గేమ్-ఛేంజర్‌గా మారింది. మునుపెన్నడూ లేని విధంగా బ్యాంక్-టు-బ్యాంక్ లావాదేవీలను సులభతరం చేసింది. UPI PIN, UPI కీలకమైన అంశంగా చెప్పవచ్చు. అనధికార లావాదేవీల నుంచి ప్రొటెక్షన్ అందిస్తుంది. నిజమైన వినియోగదారుల ద్వారా పేమెంట్లు జరుగుతాయని నిర్ధారిస్తుంది.
సైబర్ బెదిరింపులు పెరిగిపోతున్న క్రమంలో మీ ఆర్థిక సమాచారాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చర్యలు తీసుకోవడం అత్యవసరం. మీ UPI పిన్‌ని క్రమం తప్పకుండా రీసెట్ చేసుకోవాలి. మీ UPI పిన్‌ని రీసెట్ చేయడానికి Google Pay, Paytm, PhonePe, BHIM UPI వంటి యాప్‌లను ఉపయోగించవచ్చు. BHIM UPI యాప్‌ని ఉపయోగించి మీ UPI పిన్‌ని ఎలా రీసెట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
* మీ డెబిట్ కార్డ్‌లో చివరి 6 అంకెలు ఎంటర్ చేయండి.
* మీ డెబిట్ కార్డ్ గడువు తేదీ.
* మీ బ్యాంక్ అకౌంట్‌కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి.
* BHIM UPI యాప్‌ను ఓపెన్ చేయండి.
* అప్పుడు, బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ ఎంచుకోండి.
* రీసెట్ UPI పిన్ ఆప్షన్‌పై నొక్కండి.
* కొత్త UPI పిన్‌ని సెటప్ చేయడానికి మీ డెబిట్ కార్డ్ చివరి 6 అంకెలు, గడువు తేదీని ఎంటర్ చేయండి.
* మీ బ్యాంక్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTPని పంపుతుంది.
* అది యాప్‌లో ఆటోమాటిక్‌గా డిటెక్ట్ అవుతుంది.
* ఆ తర్వాత, మీ కొత్త UPI పిన్‌ని ఎంటర్ చేయవచ్చు.
* ఆ తర్వాత, మీ కొత్త UPI పిన్‌ని మళ్లీ ఎంటర్ చేయమని అడుగుతుంది.
* మీ UPI పిన్ విజయవంతంగా మారిపోతుంది.
BHIM UPI యాప్‌ని ఉపయోగించి మీ UPI పిన్‌ని రీసెట్ చేయడం ద్వారా ఇప్పుడు డిజిటల్ లావాదేవీలను సురక్షితంగా చేయవచ్చు. మీరు Google Pay, PhonePe, Paytm లేదా ఏదైనా ఇతర డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌ని ఉపయోగించినా, ఈ చర్య కారణంగా మీ ఆర్థిక సమాచారం సురక్షితంగా ఉంటుంది. సైబర్ ప్రమాదాల నుంచి ముందుగానే అప్రమత్తంగా ఉండాలని మీ UPI పిన్‌ని క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయాలని గుర్తుంచుకోండి.