మీ ఆధార్ కార్డు పోయిందా? : e-Aadhaar డౌన్ లోడ్ చేసుకోండిలా

ఆధార్ కార్డు.. ఈ గుర్తింపు కార్డు లేకుండా ఏ పథకం వర్తించదు. అన్నింటికి ఆధార్ కావాల్సిందే. ప్రభుత్వ పథకాల నుంచి వ్యక్తిగత అవసరాలకు ప్రతిఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది.

  • Publish Date - April 23, 2019 / 11:00 AM IST

ఆధార్ కార్డు.. ఈ గుర్తింపు కార్డు లేకుండా ఏ పథకం వర్తించదు. అన్నింటికి ఆధార్ కావాల్సిందే. ప్రభుత్వ పథకాల నుంచి వ్యక్తిగత అవసరాలకు ప్రతిఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది.

ఆధార్ కార్డు.. ఈ గుర్తింపు కార్డు లేకుండా ఏ పథకం వర్తించదు. అన్నింటికి ఆధార్ కావాల్సిందే. ప్రభుత్వ పథకాల నుంచి వ్యక్తిగత అవసరాలకు ప్రతిఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI)జారీచేసిన ఈ ఆధార్ కార్డుకు 12 అంకెల నెంబర్ ఉంటుంది. భారతీయ పౌరుల కోసం ఈ ఆధార్ కార్డును జారీ చేయడం జరిగింది.
Also Read : చెక్ చేశారా? : Paytmలో క్రెడిట్ స్కోరు ఫీచర్

వయస్సు, ఆడ, మగ సంబంధం లేకుండా ఇండియాలో ప్రతిఒక్కరికి ఈ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆధార్ కార్డు ఎన్రోలింగ్ ప్రాసెస్ ఒకసారి మాత్రమే ఉంటుంది. ఈ కార్డును పూర్తి ఉచితంగా పొందవచ్చు. ఎంతో ముఖ్యమైన ఈ ఆధార్ కార్డును ఒకవేళ కోల్పోతే ఎలా? మళ్లీ ఆధార్ కార్డు పొందవచ్చా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. 

నిజానికి ఇప్పుడు అందరికి ఈ ఆధార్ సేవా సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. కొంతమంది ఒరిజనల్ ఆధార్ కార్డు కోల్పోయామని తెగ బాధపడుతుంటారు. డోంట్ వర్రీ.. ఆన్ లైన్ ద్వారా అధికారిక ఆధార్ వెబ్ సైట్ ద్వారా ఎలక్ట్రానిక్ కాపీ ఈ-ఆధార్ కార్డు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది.

ఆధార్ యాక్ట్ ప్రకారం.. ఈ ఆధార్ కార్డు.. కూడా ఒరిజనల్ ఆధార్ కార్డుతో సమానం. ఆన్ లైన్ లో ఎన్నిసార్లు అయిన ఈ వెర్షన్ ఆధార్ కార్డు ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. లేదంటే.. మీ బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ఈసేవా సెంటర్లో కూడా ఆధార్ కార్డును పొందవచ్చు. 
Also Read : మీరు రెడీనా? : పెరగనున్న జియో టారిఫ్ ధరలు?

ఈ-ఆధార్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవాలంటే : 
* UIDAI వెబ్ సైట్ uidai.gov.in ను విజిట్ చేయండి. 
* మై ఆధార్ సెక్షన్ కింద ఆధార్ కార్డు డౌన్ లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. 
* ఎన్రోల్ మెంట్ ఐడీ (ID) లేదా వర్ట్యువల్ ఐడీ (VID)ఒక ఆప్షన్ ఎంచుకోండి. 
* మీ వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయండి. 
* ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి.. లేదంటే.. EID ఉంటే అదే ఎంటర్ చేయండి.
* captcha నెంబర్ ఎంటర్ చేసి.. Send OTP బటన్ పై క్లిక్ చేయండి.
* OTP బదులుగా TOTP option కు కూడా వాడవచ్చు. 
* maadhaar మొబైల్ యాప్ నుంచి TOTP నెంబర్ ను జనరేట్ చేసుకోవచ్చు.
* రిజిస్టర్డ్ మొబైల్ కు వచ్చిన OTPని ఎంటర్ చేయండి.
* Verify బటన్ పై క్లిక్ చేసి.. e-Aadhaar ను డౌన్ లోడ్ చేసుకోండి.