Indian Government : మొజిల్లా ఫైర్‌ఫాక్స్, క్రోమ్ యూజర్లకు హెచ్చరిక.. అర్జెంట్‌గా మీ బ్రౌజర్ అప్‌డేట్ చేసుకోండి.. హ్యాకర్ల నుంచి సేఫ్‌గా ఉండాలంటే?

Indian Government : మొజిల్లా ఫైర్‌ఫాక్స్, క్రోమ్ బ్రౌజర్ యూజర్లకు బిగ్ అలర్ట్.. హ్యాకింగ్ రిస్క్.. ఇప్పుడే మీ బ్రౌజర్ అప్‌డేట్ చేసుకోండి.

Indian Government : మొజిల్లా ఫైర్‌ఫాక్స్, క్రోమ్ యూజర్లకు హెచ్చరిక.. అర్జెంట్‌గా మీ బ్రౌజర్ అప్‌డేట్ చేసుకోండి.. హ్యాకర్ల నుంచి సేఫ్‌గా ఉండాలంటే?

Indian Government

Updated On : October 21, 2025 / 2:54 PM IST

Indian Government : మీరు వాడే బ్రౌజర్ ఏంటి? ఏ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారు.. ఒకవేళ మీరు మొజిల్లా ఫైర్‌ఫాక్స్, క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. దేశంలో లక్షలాది మంది డెస్క్‌టాప్ యూజర్లు హ్యాకింగ్ ముప్పును ఎదుర్కొంటున్నారు.

భారత ప్రభుత్వం గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ యూజర్లకు హై-రిస్క్ హెచ్చరిక జారీ చేసింది. ఈ రెండు బ్రౌజర్‌లలో భద్రతా లోపాల గుర్తించింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ సంస్థ, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) ఈ హెచ్చరికను జారీ చేసింది.

ఈ యూజర్లు రిస్క్‌లో పడినట్టే :
ప్రభుత్వ సంస్థ హెచ్చరిక ప్రకారం.. 144 కన్నా పాత (Indian Government) మొజిల్లా ఫైర్‌ఫాక్స్ వెర్షన్‌లు, 115.29 కన్నా పాత మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ESR వెర్షన్‌లు, 140.4 కన్నా పాత మొజిల్లా థండర్‌బర్డ్ వెర్షన్‌లు, 16404.45.0 కన్నా పాత గూగుల్ క్రోమ్‌OS వెర్షన్‌లను వాడే వినియోగదారులు హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. మొజిల్లా బ్రౌజర్‌లోని లోపం హ్యాకర్లు సిస్టమ్ నుంచి సమాచారాన్ని తస్కరిస్తారు. కొన్ని సందర్భాలలో సిస్టమ్‌ కూడా క్రాష్ అవుతుంది.

విండోస్, ఆండ్రాయిడ్‌లో ఈ బ్రౌజర్‌ను ఉపయోగించే యూజర్లు సైబర్ దాడుల ప్రమాదంలో ఉన్నట్టే.. గూగుల్ క్రోమ్‌కు సంబంధించి వీడియో, సింక్ వెబ్‌జిపీయులో హీప్ బఫర్ ఓవర్‌ఫ్లోల కారణంగా ఈ భద్రతా లోపం తలెత్తింది. ఈ లోపం కారణంగా హ్యాకర్లు మాల్‌వేర్ పేజీలను విజిట్ చేసేలా యూజర్లను ప్రేరేపించవచ్చు.

బ్రౌజర్ యూజర్లకు ఆప్షన్లు ఇవే :
CERT-In ప్రకారం.. ఈ సెక్యూరిటీ లోపాలు పాత ఈ బ్రౌజర్‌ వెర్షన్‌లలో గుర్తించారు. ఈ రెండు కంపెనీలు సెక్యూరిటీ ప్యాచ్‌లను రిలీజ్ చేశాయి. అందుకే వినియోగదారులు తమ బ్రౌజర్‌లను అప్‌డేట్ చేయడం ద్వారాఈ లోపాలను నివారించవచ్చు. మీ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయడం మర్చిపోతే ఆటో-అప్‌డేట్‌కు సెట్ చేయండి. మీ సిస్టమ్‌లో అవసరమైన అన్ని అప్‌డేట్స్ ఆటోమాటిక్‌గా ఇన్‌స్టాల్ చేస్తుంది. మీరు భద్రతా లోపాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

Read Also : Bank Savings Scheme : FDపై అద్భుతమైన స్కీమ్.. ఈ బ్యాంకులో రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే చాలు.. ఎంత వడ్డీ సంపాదించుకోవచ్చంటే?

ఏయే బ్రౌజర్ వెర్షన్లు రిస్క్‌లో ఉన్నాయంటే? :
CERT-In ప్రకారం.. ఈ కింది వెర్షన్‌లు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయి. మీ సిస్టమ్ ఈ వెర్షన్‌ కలిగి ఉంటే రిస్క్‌లో పడినట్టే.

  • 144కి ముందు మొజిల్లా ఫైర్‌ఫాక్స్ వెర్షన్లు
  • 115.29కి ముందు మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ESR వెర్షన్లు
  • 140.4కి ముందు మొజిల్లా థండర్‌బర్డ్ వెర్షన్లు
  • 16404.45.0కి ముందు గూగుల్ క్రోమ్OS వెర్షన్

ఈ బ్రౌజర్ బగ్‌లను ఎలా నివారించాలి? :

  • వెంటనే మీ బ్రౌజర్ అప్‌డేట్ చేయండి.
  • మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ను లేటెస్ట్ వెర్షన్ 144 లేదా అంతకంటే ఎక్కువకు అప్‌డేట్ చేయండి.
  • ChromeOS యూజర్లు 16404.45.0 లేదా ఆపై వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
  • ఆటో-అప్‌డేట్‌ను ఆన్ చేయండి
  • కొత్త సెక్యూరిటీ ప్యాచ్ రిలీజ్ అయిన ప్రతిసారీ బ్రౌజర్ ఆటోమాటిక్‌గా అప్‌డేట్ అవ్వాలి.

అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు :

  • గుర్తుతెలియని వెబ్‌సైట్, ఇమెయిల్ లింక్ లేదా టెలిగ్రామ్/వాట్సాప్ షార్ట్ లింక్‌పై క్లిక్ చేయొద్దు.
  • సేఫ్ పాస్‌వర్డ్‌లు, టూ ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ ఉపయోగించండి.
  • ఈ టెక్నికల్ ఇష్యూ ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
  • పాస్‌వర్డ్‌లు, బ్యాంకింగ్ వివరాలు, ఇమెయిల్ డేటా వంటి సున్నితమైన సమాచారాన్ని హ్యాక్ చేయవచ్చు.
  • హ్యాకర్లు సిస్టమ్‌ రిమోట్‌గా క్రాష్ చేయవచ్చు లేదా కంట్రోల్ పొందవచ్చు.
  • మాల్వేర్‌ను యూజర్ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేయవచ్చు.

ఈ హ్యాకింగ్ ఎలా పనిచేస్తుంది? :
CERT-In రిపోర్టు ప్రకారం.. మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌లో గుర్తించిన బగ్స్, యూజ్-ఆఫ్టర్-ఫ్రీ, మెమరీ కరప్షన్ వంటి టెక్నికల్ లోపాలకు సంబంధించినవి. ఈ లోపాలు సైబర్ దాడి చేసేవారు యూజర్ సిస్టమ్‌లో స్టోర్ చేసిన డేటాను యాక్సెస్ చేయగలరు. ఈ సమస్య డెస్క్‌టాప్‌లకే పరిమితం కాదు. ఆండ్రాయిడ్ బ్రౌజర్‌ల అడ్రస్ బార్ కూడా స్పూఫింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని తేలింది. వినియోగదారులకు రియల్ వెబ్‌సైట్‌కు బదులుగా ఫేక్ వెబ్‌సైట్ కనిపిస్తుంది.

దాంతో యూజర్ల పాస్‌వర్డ్‌లు లేదా బ్యాంకింగ్ వివరాలను తస్కరించే అవకాశం ఉంది. గూగుల్ క్రోమ్‌లో కనిపించే బగ్‌లు వీడియో, సింక్, (WebGPU) మాడ్యూళ్లలో ఉండే హీప్ బఫర్ ఓవర్‌ఫ్లోకి సంబంధించినవి. దీనికి కావలసిందల్లా “ప్రత్యేకంగా రూపొందించిన” వెబ్‌సైట్‌పై క్లిక్ చేయమని యూజర్లను ప్రేరేపించడం, హ్యాకర్ సిస్టమ్‌పై రిమోట్‌గా అటాక్ చేయడం వంటివి ఉంటాయి.

సైబర్ థ్రెట్స్ ఎందుకు పెరుగుతున్నాయంటే? :
భారత్‌లో 800 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. బ్రౌజర్లు ఆధారిత అటాక్స్‌కు హ్యాకర్లకు ఈజీగా మారింది. గత ఏడాదిలో CERT-In ప్రకారం.. లక్షా 40వేల కన్నా ఎక్కువ బ్రౌజర్ సంబంధిత సైబర్ అటాక్స్ నివేదించింది. ఇందులో ఎక్కువ భాగం పాత వెర్షన్‌ బ్రౌజర్ డివైజ్‌లను లక్ష్యంగా జరిగింది. మీరు గూగుల్ క్రోమ్ లేదా మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ఉపయోగిస్తుంటే.. జర జాగ్రత్త.. మీ ప్రైవసీ మీ చేతుల్లో.. చిన్న అప్‌డేట్ కూడా హ్యాకింగ్ రిస్క్ నుంచి బయటపడేస్తుంది. అందుకే మీ బ్రౌజర్‌ను ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి.