Indian Railway Data Leak : డార్క్ వెబ్‌లో విక్రయానికి 3 కోట్ల మంది ప్రయాణీకుల పేరు, ఫోన్ నంబర్లు లీక్..? ఇందులో నిజమెంత?!

Indian Railway Data Leak : మిలియన్ల మంది భారతీయ రైల్వే వినియోగదారుల డేటా ఆన్‌లైన్‌లో లీక్ అయినట్లు సమాచారం. డార్క్ వెబ్ ద్వారా ఒక హ్యాకర్ డేటాను అమ్మకానికి పెట్టినట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి.

Indian Railway Data Leak _ Name and phone number of over 3 crore passengers leak, up for sale on dark web

Indian Railway Data Leak : మిలియన్ల మంది భారతీయ రైల్వే వినియోగదారుల డేటా ఆన్‌లైన్‌లో లీక్ అయినట్లు సమాచారం. డార్క్ వెబ్ ద్వారా ఒక హ్యాకర్ డేటాను అమ్మకానికి పెట్టినట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. భారత్‌లోని అత్యున్నత వైద్య సంస్థ – ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS)పై డేటా ఉల్లంఘన జరిగిన కొద్ది రోజులకే ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఇప్పటివరకు, ప్రభుత్వం లేదా భారతీయ రైల్వేలు డేటా ఉల్లంఘన గురించి ఏమీ ధృవీకరించలేదు. ఇందులో నిజమెంత అనేది క్లారిటీ లేదు. అందులోనూ హ్యాకర్ అందించిన డేటా కచ్చితమైనదో లేదో తెలియదు Times Now నుంచి వచ్చిన నివేదిక ప్రకారం.. హ్యాకర్లు ఈ-మెయిల్, మొబైల్ నంబర్, అడ్రస్, వయస్సు, లింగంతో సహా చాలా యూజర్ డేటాను పొందారని తెలిసింది.

భారతీయ రైల్వే ప్రయాణికుల ట్రావెల్ హిస్టరీ, ఇన్‌వాయిస్‌లను కూడా గ్రూప్ లీక్ చేసిందని ఆ హ్యాకర్ పేర్కొన్నాడు. లీక్ అయిన డేటాలో యూజర్ డేటాతో పాటు యూజర్ల బుకింగ్ డేటా కూడా ఉందని తెలిసింది. ఫోరమ్ డేటా కాపీకి 400 డాలర్లు వసూలు చేస్తోంది. కొనుగోలుదారు కేవలం 5 కాపీలను మాత్రమే పొందగలరు. మరో నివేదిక ప్రకారం.. డేటాకు ప్రత్యేకమైన యాక్సెస్ కావాలనుకునే వారు డేటా, ఇతర వివరాల కోసం 1,500 డాలర్లు నుంచి 2000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. డేటా ఉల్లంఘన డిసెంబర్ 27న జరిగినట్లు తెలిసింది.

Indian Railway Data Leak _ Name and phone number of over 3 crore passengers leak

Read Also : QR Code Scam : QR కోడ్ స్కామ్‌తో తస్మాత్ జాగ్రత్త.. ఇలాంటి స్కామర్ల నుంచి ఎలా సేఫ్‌గా ఉండాలి? ఎలా గుర్తించాలో తెలుసా?

డేటా లీక్ గురించిన వివరాలను ఎవరో హ్యాకర్ ఫోరమ్‌లో పోస్ట్ చేశారు. అసలు వారు ఎవరు అనేది మాత్రం అసలు గుర్తింపు ఇంకా తెలియదు. దీనిని ‘షాడో హ్యాకర్’ అనే వ్యక్తి పోస్ట్ చేశారు. అదో ఫేక్ నేమ్. ప్రభుత్వ శాఖల్లోని పలువురి అధికారిక ఈ-మెయిల్ అకౌంట్లను కూడా యాక్సస్ చేసినట్టు అదే హ్యాకర్ గ్రూప్ చెబుతోంది. ప్రస్తుతానికి, హ్యాకర్ గ్రూప్ IRCTC డేటాను ఎలా యాక్సెస్ చేయగలదో సమాచారం లేదు. లేటెస్ట్ డేటా ఉల్లంఘన అథెంటికేషన్ సైబర్‌ సెక్యూరిటీ సంస్థలు సైతం ఇంకా ధృవీకరించలేదు.

ఇలాంటివి ఉల్లంఘనలు జరగడం ఇదే మొదటిసారి కాదు. 2019లోనూ ఇదే విధమైన ఉల్లంఘన జరిగింది. సుమారు 9 మిలియన్ల మంది యూజర్ల డేటా ఆన్‌లైన్‌లో లీక్ అయింది. ఆ తరువాత, సవరించిన డేటా ప్రొటెక్షన్ బిల్లు ప్రకారం.. డేటా ఉల్లంఘనలకు రూ. 500 కోట్ల వరకు జరిమానా విధించారని ప్రభుత్వం ప్రకటించింది.

అయినప్పటికీ, డేటా ఉల్లంఘనల రేటులో తగ్గుదల కనిపించడం లేదు. వినియోగదారులు తమ వ్యక్తిగత డేటాను తెలియని వ్యక్తి లేదా అకౌంట్లతో షేర్ చేయకూడదని కూడా అధికారులు సూచనలు చేశారు. వినియోగదారుల డబ్బును దొంగిలించడానికి హ్యాకర్లు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. అందుకే వినియోగదారులు ముఖ్యంగా ఆన్‌లైన్ లావాదేవీలతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Vi Users Data Leak : 30 కోట్ల మంది వోడాఫోన్ ఐడియా యూజర్ల పర్సనల్ డేటా లీక్.. కస్టమర్ల డేటాకు భద్రత లేనట్టేనా? కంపెనీ వివరణ ఇదే..!

ట్రెండింగ్ వార్తలు