Vi Users Data Leak : 30 కోట్ల మంది వోడాఫోన్ ఐడియా యూజర్ల పర్సనల్ డేటా లీక్.. కస్టమర్ల డేటాకు భద్రత లేనట్టేనా? కంపెనీ వివరణ ఇదే..!

Vodafone Idea Users : ప్రముఖ దేశీయ అతిపెద్ద టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vodafone idea) Vi యూజర్లకు షాకింగ్ న్యూస్.. వోడాఫోన్ ఐడియా యూజర్ల పర్సనల్ డేటా లీక్ (User Personal Data Leak) అయి అయింది.

Vi Users Data Leak : 30 కోట్ల మంది వోడాఫోన్ ఐడియా యూజర్ల పర్సనల్ డేటా లీక్.. కస్టమర్ల డేటాకు భద్రత లేనట్టేనా? కంపెనీ వివరణ ఇదే..!

Vodafone Idea Users Personal data of 30 crore Vodafone Idea users leaked Here's what the company said

Vodafone Idea Users : ప్రముఖ దేశీయ అతిపెద్ద టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vodafone idea) Vi యూజర్లకు షాకింగ్ న్యూస్.. వోడాఫోన్ ఐడియా యూజర్ల పర్సనల్ డేటా లీక్ (User Personal Data Leak) అయి అయింది. గతంలోనే Vodafone Idea కంపెనీ సిస్టమ్‌లోని బగ్ డేటా ఉల్లంఘనకు కారణమని స్పష్టం చేసింది. సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ టీమ్ ప్రకారం.. CyberX9 మల్టీ సెక్యూరిటీ లోపం కారణంగా దాదాపు 301 మిలియన్ (30.1 కోట్లు) కస్టమర్‌ల కాల్ లాగ్‌లతో సహా కస్టమర్ పర్సనల్ డేటా మొత్తం ఇంటర్నెట్‌లో బహిర్గతం అయినట్టు గుర్తించారు.

లీకైన డేటాలో మొత్తంగా 20 మిలియన్ల పోస్ట్‌పెయిడ్ Vi కస్టమర్‌ల డేటా ఉందని తేలింది. డేటా ఉల్లంఘన జరిగినట్టు వస్తున్న ఆరోపణలపై Vi కంపెనీ స్పందించింది. బిల్లింగ్ కమ్యూనికేషన్ సిస్టమ్‌లో లోపాన్ని గుర్తించినట్టు ఓ నివేదిక తెలిపింది. వెంటనే బగ్ సమస్యను పరిష్కరించినట్టు నివేదించింది. Vi పూర్తి స్థాయిలో ఫోరెన్సిక్ విశ్లేషణ నిర్వహించగా.. డేటా ఉల్లంఘన జరగలేదని వెల్లడించిందని నివేదిక తెలిపింది. డేటా ఉల్లంఘనకు సంబంధించి ఆరోపణలపై స్పందించిన Vi తీవ్రంగా ఖండించింది. టెల్కో తమ కంపెనీలో యూజర్ల డేటాకు మరింత భద్రతా అందించేందుకు ఎప్పటికప్పుడూ మానిటరింగ్ చేస్తూనే ఉంటామని, ఆడిట్‌లను నిర్వహిస్తుందని తెలిపింది.

Vodafone Idea Users Personal data of 30 crore Vodafone Idea users leaked Here's what the company said

Vodafone Idea Users Personal data of 30 crore Vodafone Idea users leaked 

CyberX9 పరిశోధన ఏం తేలిందంటే? :

Vi టెల్కో కంపెనీలో మిలియన్ల కొద్దీ కస్టమర్ల డేటాను (కాల్ లాగ్‌లు, కాల్ వ్యవధి, కాల్ చేసిన లొకేషన్, ఫోన్ నంబర్) పూర్తి డేటా లీక్ అయిందని CyberX9 బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. Vi యూజర్ల డేటాకు ముప్పు పొంచి ఉందని తెలిపింది. కస్టమర్ డేటా భద్రత పట్ల కంపెనీ అజాగ్రత్తగా ఉందని నివేదిక తెలిపింది. వోడాఫోన్ ఐడియా నిర్లక్ష్యం కారణంగానే డేటా లీక్ కావడానికి కారణమైందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. గత రెండు ఏళ్లుగా సైబర్ దాడులకు సంబంధించి ప్రధానంగా గుర్తించిన భద్రతా లోపాల్లో ఒకదానిని Vi అలసత్వం ప్రదర్శించినట్టు నివేదిక తెలిపింది.

గత రెండు ఏళ్లలో Vi యూజర్ల డేటా ఉల్లంఘనకు గురైందని నివేదిక సూచిస్తుంది. పరిశోధక బృందం గుర్తించిన భద్రతా లోపాలను కొన్ని గంటల్లో Viతో పరిశోధనల వివరాలను వెల్లడించింది. సాధారణంగా ఒక కంపెనీలో డేటా ఉల్లంఘనకు గురైనప్పుడు.. ముందుగా ఆ విషయాన్ని వినియోగదారులకు తెలియాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ప్రైవసీ, ప్రొటెక్షన్ అందించే దిశగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. వోడాఫోన్ ఐడియా ఈ విషయంలో క్లెయిమ్‌లను తిరస్కరించింది. వినియోగదారులు కంపెనీ నుంచి ఎలాంటి అలర్ట్స్ పొందలేదు. సైబర్ దాడిలో డేటా ఉల్లంఘనకు గురైందో లేదో తెలుసుకునేందుకు వినియోగదారులు ఇప్పటికీ HaveIBeenPwned వంటి వెబ్‌సైట్‌లను విజిట్ చేయడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Read Also : Google User Data Track : వామ్మో.. గూగుల్‌తో జాగ్రత్త.. ఫేస్‌బుక్, ఆపిల్ కన్నా ఎక్కువగా యూజర్ల డేటాను ట్రాక్ చేస్తోంది..!