Mini Tata Indica : రెండు డోర్ల ‘మినీ టాటా ఇండికా’ కారు క్రేజీ లుక్ చూశారా?

టాటా ఇండికా క్రేజీ లుకింగ్ మాడిఫికేషన్ కారు చూశారా? .. అదే.. టాటా ఇండికా కారు.. టాటా ఇండికా కారుకు 4 డోర్ హ్యాచ్ బ్యాక్ ఉంటుంది.. ఇప్పుడు ఈ కారును కాస్తా 2 డోర్ హ్యాచ్ బ్యాక్ గా మాడిఫై చేసేశారు.

India’s 2 door Tata Indica car : ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వెహికల్ మాడిఫికేషన్ కామన్ అయిపోయింది. మోటార్ సైకిళ్ల నుంచి కార్ల వరకు తమ టేస్ట్‌కు కి తగినట్టుగా మాడిఫై చేసేస్తున్నారు. గతంలో ఇండియాలో చాలావరకు పాపులర్ వెహికల్స్ మాడిఫికేషన్స్ ఆకట్టుకున్నాయి. అలాంటి ఓ క్రేజీ లుకింగ్ మాడిఫికేషన్ కారు ఒకటి ఉంది.. అదే.. టాటా ఇండికా కారు.. మామూలుగా టాటా ఇండికా కారుకు 4 డోర్ హ్యాచ్ బ్యాక్ ఉంటుంది..

ఇప్పుడు ఈ కారును కాస్తా 2 డోర్ హ్యాచ్ బ్యాక్ గా మాడిఫై చేసేశారు. కారు కండీషన్ అంత పర్‌ఫెక్ట్ గా లేదు.. కారులో లోపల అన్ని ప్యానల్స్ తొలగించి ఇంటిరియర్స్ తిరిగి అమర్చారు.బంపర్ ఫ్రంట్ రెండు వైపులా రియర్ అమర్చారు. బంపర్లకు సిల్వర్ కోటింగ్ ఇచ్చారు. వీల్ ఆర్క్ లకు మాత్రం బ్లాక్ క్లాడింగ్ అమర్చారు. కస్టమ్ మేడ్ మెటల్ రూఫ్ రెయిల్ అమర్చారు. టాటా ఇండికా లోపల రియల్ కాబిన్ అంతా బ్లాకులో ఉంటుంది.


వీలాగర్ ఈ మినీ ఇండికాలో ఇంటిరియర్ లో కొన్ని ప్యానళ్లకు సిల్వర్ పెయింట్ వేసింది. రియర్ సీటు తొలగించడంతో బూట్ స్పేస్ కాస్తా కొంచెం ముందుకు పెరిగింది. అన్ని మార్చినప్పటికీ కారు ఇంజిన్ మాత్రం అలానే ఉంచారు. వీల్ బేస్ తగ్గించారు. టర్నింగ్ సర్కిల్ కూడా తగ్గింది. ఏదిఏమైనా ఒరిజినల్ లుక్ కు ఏమాత్రం తగ్గకుండా క్రేజీ లుక్ లో మాడిఫై చేసిన ఈ మినీ ఇండికా కారు సరికొత్తగా కనిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు