Infinix Note 40 5G Launch : ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. వచ్చేవారమే లాంచ్.. కీలక ఫీచర్లు, డిజైన్ వివరాలు ఇవే!

Infinix Note 40 5G Launch : ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ ఇండియా లాంచ్ తేదీని ప్రకటించింది. అయితే, ఈ హ్యాండ్‌సెట్ కొన్ని కీలక వివరాలను డిజైన్, కలర్ ఆప్షన్లతో సహా వెల్లడించింది.

Infinix Note 40 5G Launch : ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. వచ్చేవారమే లాంచ్.. కీలక ఫీచర్లు, డిజైన్ వివరాలు ఇవే!

Infinix Note 40 5G India Launch Date Set for June 21 ( Image Source : Google )

Infinix Note 40 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి ఇన్ఫినిక్స్ నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం.. వచ్చేవారం భారత్‌లో ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ ఫోన్ లాంచ్ కానుందని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశంలో ప్రవేశపెట్టిన ఇన్ఫినిక్స్ నోట్ 40ప్రో 5జీ లైనప్‌లో స్మార్ట్‌ఫోన్ చేరనుంది.

Read Also : Multiple SIM Cards : ఫోన్ నెంబర్లపై ఇక ఛార్జీలు చెల్లించాల్సిందేనా? అంతా అవాస్తవం.. ట్రాయ్ క్లారిటీ ఇచ్చిందిగా..!

ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ ఇండియా లాంచ్ తేదీని ప్రకటించింది. అయితే, ఈ హ్యాండ్‌సెట్ కొన్ని కీలక వివరాలను డిజైన్, కలర్ ఆప్షన్లతో సహా వెల్లడించింది. ముఖ్యంగా, ఈ ఫోన్ గత నెలలో ఫిలిప్పీన్స్‌లో లాంచ్ అయింది. ఇదే వెర్షన్ భారత మార్కెట్లో లాంచ్ కానుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ భారత్ లాంచ్ డేట్, డిజైన్, కలర్ ఆప్షన్లు :
కంపెనీ ప్రకారం.. ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ ఫోన్ ఈ నెల 21న భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని తెలిపింది. ఈ హ్యాండ్‌సెట్ దీర్ఘచతురస్రాకార మాడ్యూల్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. డిస్‌ప్లే స్లిమ్ బెజెల్స్‌తో, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సెన్సార్‌ని కలిగి హోల్ పంచ్ కటౌట్‌తో కనిపిస్తుంది.

యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ గ్రిల్స్ హ్యాండ్‌సెట్ దిగువ అంచున కనిపిస్తాయి. అయితే, రైట్ ఎడ్జ్ వాల్యూమ్ రాకర్, పవర్ బటన్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ దేశంలో అబ్సిడియన్ బ్లాక్, టైటాన్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ కానుందని కంపెనీ ధృవీకరించింది.

ఇన్పినిక్స్ నోట్ 40 5జీ ఇండియా వేరియంట్ ఫీచర్లు :
ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ ఫోన్ భారతీయ వేరియంట్ 120Hz రిఫ్రెష్ రేట్, 93.8 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో 6.78-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 33డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే 15డబ్ల్యూ వైర్‌లెస్ మ్యాగ్ ఛార్జ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో బ్యాకప్ అందిస్తుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ కూడా ఇన్ఫినిక్స్ నోట్ 40ప్రో ప్లస్ 5జీ, ఇన్ఫినిక్స్ నోట్ 40ప్రో 5జీలో కనిపించే విధంగా జేబీఎల్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన సౌండ్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ సిస్టమ్ లీనమయ్యే ఆడియో 360-డిగ్రీ సిమెట్రిక్ సౌండ్ బూస్ట్డ్ బాస్‌ని అందిస్తుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ స్పెసిఫికేషన్‌లు (అంచనా) :
ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ భారతీయ వేరియంట్ స్పెసిఫికేషన్లు ఇంకా ప్రకటించలేదు. ఫిలిప్పీన్స్‌లో ప్రారంభమైన మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020ఎస్ఓసీ ద్వారా 8జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14-ఆధారిత ఎక్స్ఓఎస్ 14 దుమ్ము, స్ప్లాష్ నిరోధకతకు ఐపీ53 రేటింగ్‌తో అందిస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఇన్ఫినిక్స్ నోట్ 40 5జీ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో రెండు 2ఎంపీ సెన్సార్‌లతో పాటు 108ఎంపీ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ఫ్రంట్ కెమెరా 32ఎంపీ సెన్సార్‌తో అమర్చి ఉంటుంది.

Read Also : Whatsapp Calling Features : వాట్పాప్ యూజర్లకు పండుగే.. 3 మేజర్ కాలింగ్ ఫీచర్లు.. 32 మందితో వీడియో కాల్స్, ఆడియోతో స్ర్కీన్ సేరింగ్..!