Infinix Zero Flip Launch : ఇన్ఫినిక్స్ మడతబెట్టే ఫోన్ చూశారా? ఫీచర్లు భలే ఉన్నాయి.. ధర ఎంతంటే?
Infinix Zero Flip Launch : ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ పేరుతో కంపెనీ భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్‌లోని కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

Infinix Zero Flip With 6.9-Inch AMOLED Screen
Infinix Zero Flip Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఇన్ఫినిక్స్ నుంచి మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది. ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ పేరుతో కంపెనీ భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ క్లామ్‌షెల్ ఫోల్డబుల్ ఫోన్ 6.9-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ ఇంటర్నల్ స్క్రీన్, 3.64-అంగుళాల అమోల్డ్ కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
మీడియాటెక్ డైమన్షిటీ 8020 చిప్‌సెట్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. గరిష్టంగా 16జీబీ ర్యామ్‌తో వస్తుంది. ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్‌లో రెండు 50ఎంపీ ఔటర్ కెమెరాలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. రెండు ఆండ్రాయిడ్ ఓఎస్ వెర్షన్ అప్‌గ్రేడ్‌లు, 3 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను కూడా అందుకుంటుంది.
భారత్‌లో ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ ధర ఎంతంటే? :
ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ సింగిల్ 8జీబీ + 512జీబీ ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ. 54,999కు పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేక లాంచ్ ధర రూ. 49,999 కాగా, బ్లోసమ్ గ్లో, రాక్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా అక్టోబర్ 24 నుంచి భారత మార్కెట్లో సేల్ ప్రారంభమవుతుంది. వినియోగదారులు ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 5వేల డిస్కౌంట్ పొందవచ్చు. ఇ-కామర్స్ వెబ్‌సైట్ నుంచి ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్‌ను కొనుగోలు ధరను రూ. 44,999కు పొందవచ్చు.
ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు :
డ్యూయల్ సిమ్ (నానో+నానో) ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ కంపెనీ ఎక్స్ఓఎస్ 14.5 స్కిన్‌తో ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 6.9-అంగుళాల పూర్తి-హెచ్‌డీ+ ఎల్‌టీపీఓ అమోల్డ్ఇంటర్నల్ స్క్రీన్‌తో పాటు యూటీజీ తర్వాత, 120Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఔట్ సైడ్ 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో 3.64-అంగుళాల అమోల్డ్ కవర్ డిస్‌ప్లే 120Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది.
ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్‌సెట్‌తో వస్తుంది. 8జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ కలిగి ఉంది. 512జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీని కలిగి ఉంది. ఔటర్ స్క్రీన్‌పై డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 114-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూతో 50ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. 4కె/30fps వద్ద వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. లోపలి భాగంలో 4కె/60ఎఫ్‌పీఎస్ వద్ద వీడియో రికార్డింగ్ 50ఎంపీ కెమెరా ఉంది.
ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్‌లోని కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. డ్యూయల్ జేబీఎల్-ట్యూన్డ్ స్పీకర్‌లను కలిగి ఉంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం పవర్ బటన్‌పై ఫింగర్ ఫ్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ 70డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,720mAh బ్యాటరీని అందిస్తుంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ 170.75×73.4×16.04ఎమ్ఎమ్, మడతపెట్టినప్పుడు 87.8×73.4×7.64ఎమ్ఎమ్, బరువు 195 గ్రాములు ఉంటుంది.
Read Also : Aadhaar Card Update : మరోసారి ఆధార్ కార్డు ప్రీ అప్‌డేట్ గడువు పొడిగింపు.. ఎప్పటివరకుంటే?