Aadhaar Card Update : మరోసారి ఆధార్ కార్డు ప్రీ అప్‌డేట్ గడువు పొడిగింపు.. ఎప్పటివరకుంటే?
Aadhaar Card Update : యూఐడీఏఐ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసే ప్రక్రియ అందుబాటులో ఉంటుంది.

Govt extends free Aadhaar Card update deadline
Aadhaar Card Update : మీ ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకున్నారా? ఆధార్ కార్డు ప్రీ అప్ డేట్ గడువు మళ్లీ పెంచారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ హోల్డర్ల గడువును మళ్లీ పొడిగించింది. మీరు ఇప్పుడు మీ ఆధార్ వివరాలను డిసెంబర్ 14, 2024 వరకు ఉచితంగా అప్‌డేట్ చేయవచ్చు. జూన్ 2024 నుంచి ఇది రెండోసారి పొడిగింపు.
యూఐడీఏఐ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసే ప్రక్రియ అందుబాటులో ఉంటుంది. అయితే, బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయడానికి ఉచిత ఆప్షన్ అందుబాటులో లేదు. బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేసేందుకు మీరు ఆధార్ సెంటర్లను సందర్శించి రుసుము చెల్లించాలి.
ఆధార్ అప్‌డేట్ ఎందుకు ముఖ్యం? :
ఆధార్ అనేది భారత ప్రభుత్వం జారీ చేసిన 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య. దేశీయ పౌరులు ప్రభుత్వ పథకాలలో రిజిస్టర్ చేసుకోవడం, ప్రయాణ టిక్కెట్లను బుక్ చేసుకోవడం, బ్యాంకు అకౌంట్లను ఓపెన్ చేయడం, పన్నులను దాఖలు చేయడంతో సహా అనేక రకాల సేవలను యాక్సెస్ చేసేందుకు వారి ఆధార్‌ను ఉపయోగించవచ్చు.
మీ ఆధార్ వివరాలు పాతవి లేదా తప్పుగా ఉంటే.. ఆధార్ అథెంటికేషన్ అవసరమయ్యే సేవలను పొందలేరు. మీ అడ్రస్ మ్యాచ్ కాకపోతే ఆర్థిక లావాదేవీలలో చేయలేరని గమనించాలి. ఆధార్ సంబంధిత మోసాలు లేకుండా ఉండేలా ఈ సెక్యూరిటీ అథెంటికేషన్ తప్పనిసరి. రెగ్యులర్ అప్‌డేట్‌ల ద్వారా ప్రభుత్వం కచ్చితమైన సురక్షితమైన డేటాబేస్‌ను అందిస్తుంది. ఆధార్ దుర్వినియోగం అవకాశాలను తగ్గిస్తుంది.
ఆధార్‌ను ఎవరు అప్‌డేట్ చేయాలి? :
ప్రతి ఆధార్ హోల్డర్ రెగ్యులర్ అప్‌డేట్‌ల నుంచి ప్రయోజనం పొందగలిగినప్పటికీ, కొంతమంది వ్యక్తులు తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలి.
10 ఏళ్ల క్రితం ఆధార్ జారీ : మీ ఆధార్ జారీ అయి దశాబ్దం దాటితే.. వెంటనే ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి.
15 ఏళ్లు నిండిన పిల్లలు : చిన్న వయస్సులో ఆధార్ కలిగిన పిల్లలు.. 15 ఏళ్లు నిండిన తర్వాత బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయాలి. ఐడెంటిటీ కోసం వారి బయోమెట్రిక్‌లు వ్యాలిడ్ అయి ఉండాలి.
బయోమెట్రిక్ మార్పులు : ప్రమాదం, శస్త్రచికిత్స అనంతరం వేలిముద్రలు లేదా ఐరిస్ స్కాన్‌ల వంటివి పనిచేయవు. మీ బయోమెట్రిక్ డేటాను మార్చుకునేందుకు తప్పనిసరిగా మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయాలి.
ఆన్‌లైన్‌లో ఆధార్ ఉచితంగా ఎలా అప్‌డేట్ చేయాలి :
UIDAI పోర్టల్‌ని విజిట్ చేయండి. (myaadhaar.uidai.gov.in)ని విజిట్ చేయడం ద్వారా ఆధార్ సర్వీసు అప్‌డేట్ పోర్టల్ యాక్సస్ చేయొచ్చు.
ఆధార్, ఓటీపీతో లాగిన్ చేయండి. మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి. లాగిన్ చేయడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP)ని ఉపయోగించండి.
మీ వివరాలను రివ్యూ చేయండి. ఆధార్ ప్రొఫైల్‌లో చూపిన జనాభా సమాచారాన్ని (పేరు, చిరునామా మొదలైనవి) చెక్ చేయండి. ఏవైనా వివరాలు పాతవి లేదా తప్పుగా ఉంటే వెంటనే అప్ డేట్ చేసుకోండి.
Read Also : IRCTC booking: రైల్వే టిక్కెట్ల ముందస్తు రిజర్వేషన్ వ్యవధి 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గింపు