IRCTC booking: రైల్వే టిక్కెట్ల ముందస్తు రిజర్వేషన్ వ్యవధి 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గింపు
ఫారిన్ నుంచి వచ్చే వారు 365 రోజుల ముందుగానే టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఇంతకుముందు ఉంది.

రైల్వే టిక్కెట్ల ముందస్తు రిజర్వేషన్ వ్యవధిని 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గిస్తూ భారతీయ రైల్వే నిర్ణయం తీసుకున్నట్లు ఓ జాతీయ మీడియా తెలిపింది. ఇది నవంబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఈ మేరకు ఐఆర్‌సీటీసీ నిబంధనల్లో మార్పులు చేసింది.
టికెట్లను ఇప్పటికే బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు ఎలాంటి సమస్యా ఉండదు. ఈ నెల 31 వరకు బుకింగ్ చేసుకునే వారికి ఇంతకు ముందు ఉన్న నిబంధనలే వర్తిస్తాయి. అలాగే, తాజ్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు గోమతి ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్ల బుకింగ్ విషయంలో ఎలాంటి మార్పులూ ఉండవు.
ఆయా రైళ్లలో ఇంతకు ముందే బుకింగ్ వ్యవధి తక్కువగా ఉంది. ఫారిన్ నుంచి వచ్చే వారు 365 రోజుల ముందుగానే టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఇంతకుముందు ఉంది. అందులో ఎటువంటి మార్పులూ చేయలేదు.
నిజానికి గతంలో ప్రయాణికులు 60 రోజుల ముందే బుకింగ్ చేసుకునే అవకాశం ఉండేది. ఆ నిబంధనలను 120 రోజులకు పెంచారు. ఇప్పుడు మళ్లీ పాత నిబంధననే తీసుకొచ్చారు. రైల్వే తీసుకున్న ఈ నిర్ణయంతో ఐఆర్‌సీటీసీ షేరు విలువ 2 శాతం క్షీణించింది. ప్రస్తుతం రూ.873 వద్ద ట్రేడవుతోంది.
Viral Video: ఇదో ఫన్నీ పోరాటం.. “ఇడ్లీ బచావ్ ఆందోళన”కు పిలుపు