Instagram Kids : పిల్లల కోసం ఇన్‌స్టాగ్రామ్‌‌ కిడ్స్ యాప్.. విమర్శలతో ఆపేసిన ఫేస్‌బుక్!

ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నపిల్లల వెర్షన్ కొత్త కిడ్స్ యాప్ డెవలప్ మెంట్ నిలిపివేసింది. ఇన్‌స్టాగ్రామ్‌ కిడ్స్‌ (Instagram Kids) పేరిట ఈ స్పెషల్ యాప్‌ వెర్షన్ తీవ్ర విమ

Instagram Kids Version: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సొంత ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నపిల్లల వెర్షన్ కొత్త కిడ్స్ యాప్ డెవలప్ మెంట్ నిలిపివేసింది. ఇన్‌స్టాగ్రామ్‌ కిడ్స్‌ (Instagram Kids) పేరిట ఈ స్పెషల్ యాప్‌ వెర్షన్ తీసుకురావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చైల్డ్ ప్రొటెక్షన్ అథారిటీలు, పిల్లల తల్లిదండ్రులు, విశ్లేషకుల నుంచి విమర్శలు రావడంతో ప్రస్తుతానికి ఈ కిడ్స్ యాప్ డెవలప్ మెంట్ నిలిపివేసినట్టు ఫేస్ బుక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. 13ఏళ్ల లోపు చిన్నారుల కోసం ఈ Instagram Kids వెర్షన్ లాంచ్ చేసేందుకు ఫేస్ బుక్ సీఈఓ జుకర్ బర్గ్ అనేక ప్రయత్నాలు చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి యాప్ డెవలప్ మెంట్ పనులు కూడా మొదలుపెట్టేసింది. రేపో మాపో యాప్ లాంచ్ చేద్దామని ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలో చిన్నారులపై లైంగిక వేధింపుల విషయంలో విమర్శలు వెల్లువెత్తడంతో ఫేస్ బుక్ ఈ యాప్ ప్రాజెక్టును సస్పెండ్ చేసింది.
Bomma Blockbuster: నీయయ్య పుట్టడానికే ఇన్ని యుద్దాలు చేసిన నీకు లైఫ్ ఒక లెక్కనా?

సోషల్‌ మీడియాలో ఫేస్‌బుక్‌ వికృతమైన అడ్డాగా మారుతోందని వాల్ స్ట్రీట్ జర్నల్‌ కూడా విరుచుకుపడింది. ఇన్‌స్టాగ్రామ్‌ వల్ల యువత మానసికంగా కుంగిపోతోందని, ఆత్మహత్యలకు పాల్పడుతోందని కథనాలను ప్రచురించింది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌ హెడ్‌ ‘ఆడమ్‌ మోసెరి’ కథనాల్ని ఖండించారు. కిడ్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ యాప్ విషయమై ఆయన స్పందించారు. ఇన్ స్టాగ్రామ్ కిడ్స్ వెర్షన్ విషయంలో తప్పుగా అర్థం చేసుకున్నారంటూ ఆడమ్ వివరణ ఇచ్చారు. ఇప్పటికే ఈ కిడ్స్ యాప్ పై చాలా అభ్యంతరాలు వస్తున్నాయని, అందుకే ముందుగా తల్లిదండ్రులు, మేధావులు, విశ్లేషకులు, పాలసీ మేకర్స్‌, నియంత్రణ విభాగాల నుంచి పూర్తి స్థాయి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోనున్నట్టు తెలిపారు. ఆ తర్వాతే కిడ్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ను లాంచ్ చేస్తామని వెల్లడించారు. ఈ వెర్షన్‌లో పేరెంటింగ్‌ టూల్‌ ఉంటుందని తెలిపారు. అలాగే పిల్లల యాక్టివిటీస్‌ను నిరంతరం పెద్దలు మానిటర్ చేస్తుండవచ్చునని పేర్కొన్నారు. త్వరలోనే ఈ వెర్షన్ వివరాలను రిలీజ్ చేస్తామని మోసెరి స్పష్టం చేశారు.

ఈ ఏడాది మార్చిలోనే కిడ్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వెర్షన్‌ అధికారికంగా ప్రకటించింది ఫేస్ బుక్. మే నెలలో లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు చేపట్టగా.. 44 మంది అటార్నీ జనరల్స్‌ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే ఈ వెర్షన్ ఆపేయాలంటూ ఫేస్ బుక్ కు లేఖ రాశారు. చిన్న పిల్లల కోసం యాప్ తీసుకొస్తే.. అది సైబర్‌ వేధింపులు, లైంగిక వేధింపులకూ దారితీసే ప్రమాదం ఉందని పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దాంతో ఇన్‌స్టా కిడ్స్ వెర్షన్‌ను ప్రయత్నాలను తాత్కాలికంగా నిలిపివేయాలని జుకర్ బర్గ్ కంపెనీ నిర్ణయించుకుంది.
Love Story Magical Success Meet : నాగార్జున – సుకుమార్ అతిథులుగా..

ట్రెండింగ్ వార్తలు