Love Story Magical Success Meet : నాగార్జున – సుకుమార్ అతిథులుగా..
‘లవ్ స్టోరీ మ్యాజికల్ సక్సెస్ మీట్’.. అతిథులుగా కింగ్ నాగార్జున - బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్..

Love Story Magical Success Meet
Love Story Magical Success Meet: సరైన టైం లో సరైన సినిమా పడితే ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుంది అనే దానికి చక్కని ఉదాహరణగా నిలిచింది ‘లవ్ స్టోరీ’ సినిమా.. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్స్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘లవ్ స్టోరీ’ సెప్టెంబర్ 24న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది.
Love Story : పవన్ సినిమాను దాటేసిందిగా..
సినిమాను ఇంత సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలపడానికి మూవీ టీం ‘లవ్ స్టోరీ మ్యాజికల్ సక్సెస్ మీట్’ ఏర్పాటు చేశారు. కింగ్ నాగార్జున, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు.
Love Story : పవన్‌ను ప్రశంసిస్తూ మహేష్ ట్వీట్.. రిప్లై ఇచ్చిన రెహమాన్..
పాండమిక్ తర్వాత థియేటర్లలో భారీగా రిలీజ్ అయిన సినిమా కావడంతో ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకు తరలి వచ్చారు. ఇక యూఎస్ ప్రీమియర్స్‌లోనూ సత్తా చాటింది ‘లవ్ స్టోరీ’. 226 లొకేషన్లలో ప్రీమియర్స్ ద్వారా ‘వకీల్ సాబ్’ కలెక్షన్లను దాటేసింది. ఇప్పుడు 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసి 2 మిలియన్ల దిశగా పయనిస్తోంది.
Love Story : సరైన టైంలో సాలిడ్ హిట్ కొట్టిన చైతూ
పాండమిక్‌కి ముందు వచ్చిన ‘జాతి రత్నాలు’ తర్వాత 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసిన మూవీ ‘లవ్ స్టోరీ’ నే కావడం విశేషం. ఇక వరల్డ్ వైడ్‌గా కేవలం మూడు రోజుల్లో 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాల వారిని సైతం ఆశ్చర్య పరిచింది. అక్కినేని అభిమానులు, యువత, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు.
Kajal Aggarwal : నాగ్ సినిమా క్యాన్సిల్.. కాజల్ కన్ఫమ్ చేసేసిందా..?