Instagram Longer Reels : ఇన్‌స్టా యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 60 సెకన్ల రీల్స్ పోస్టు చేసుకోవచ్చు!
ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై రీల్స్ (Reels) ఫీచర్‌లో 60 సెకన్ల వరకు పోస్టు చేసుకోవచ్చు. మీ స్నేహితులు, ఫాలోవర్లకు కూడా షేర్ చేసుకోవచ్చు. ఇప్పటివరకూ యూజర్లు Reels వీడియోలను 15 సెకన్ల నుంచి 30 సెకన్ల వరకు మాత్రమే పోస్టు చేసే వీలుంది.

Instagram Now Lets You Post 60 Seconds Reels
Instagram Longer Reels : ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై రీల్స్ (Reels) ఫీచర్‌లో 60 సెకన్ల వరకు పోస్టు చేసుకోవచ్చు. మీ స్నేహితులు, ఫాలోవర్లకు కూడా షేర్ చేసుకోవచ్చు. ఇప్పటివరకూ యూజర్లు Reels వీడియోలను 15 సెకన్ల నుంచి 30 సెకన్ల వరకు మాత్రమే పోస్టు చేసే వీలుంది. ఇప్పుడా రీల్స్ నిడివిని పెంచుతున్నట్టు ఇన్ స్టాగ్రామ్ ప్రకటించింది. లాంగర్ రీల్స్ (Longer Reels) షేర్ చేయాలనుకునే యూజర్ల కోసం ఇన్ స్టా ఈ కొత్త అప్ డేట్ తీసుకొస్తోంది.
దేశంలో Tiktok బ్యాన్ కావడంతో ఇన్ స్టాగ్రామ్ Reels ప్రవేశపెట్టింది. ఇప్పుడా రీల్స్ వీడియో నిడివిని 60 సెకన్లకు పెంచింది. భారత షార్ట్ వీడియో ప్లాట్ ఫాంలైన Mitron, Roposo, Chingari సహా ఇతర ప్లాట్ ఫాంలకు పోటీగా రీల్స్ మరింత ఆకర్షణీయంగా అందిస్తోంది. టిక్ టాక్ వీడియోలను క్రియేట్ చేసేందుకు 3 నిమిషాల నిడివి వరకు అనుమతి ఉంది. ప్రస్తుతం భారత్ లో టిక్ టాక్ (TikTok Ban In India)లో అందుబాటులో లేదు. చైనీస్ TikTok యాప్ ను భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. గత ఏడాదిలోనే మరో చైనీస్ గేమింగ్ యాప్ PUBG Mobile సహా ఇతర యాప్స్ ను కూడా ప్రభుత్వం బ్యాన్ చేసింది.
ఇన్ స్టాలో 60 సెకన్ల నిడివి గల రీల్స్ క్రియేట్ చేయడం గతంలో మాదిరిగానే ఉంటుంది. యాప్ లోకి వెళ్లి Reels tabపై లోకి వెళ్లండి. ఫోన్ స్టోరేజీ నుంచి ఏదైనా కంటెంట్ అప్ లోడ్ చేసి రికార్డు చేయటమే.. ఒకసారి Reels అప్ లోడ్ అయ్యాక .. ఆ వీడియోను మీ ఫాలోవర్లు లేదా ఇన్ స్టా స్నేహితులకు షేర్ చేసుకోవచ్చు.
మరోవైపు.. ఇన్ స్టాలో కొత్తగా టీనేజర్స్ (16-18) వయసు వారికోసం (new protection for teens) రూల్ తీసుకొచ్చింది. తద్వారా టీనేజర్ల అకౌంట్లు ప్రారంభం నుంచే డిఫాల్ట్ గా ప్రైవేట్లోకి మార్చనుంది. తెలియనివారి నుంచి ఎలాంటి అభ్యంతరకరమైన మెసేజ్ లు రావు. యూజర్ల వివరాలకు భంగం కలగకుండా ఉండేందుకు వీలుగా ఈ కొత్త విధానం తీసుకొస్తోంది. ఇప్పటికే టీనేజ్ యూజర్ల ప్రైవసీకి సంబంధించి ఇన్ స్టా పుష్ నోటిఫికేషన్లను పంపిస్తున్నట్లు వెల్లడించింది. నోటిఫికేషన్ ద్వారా టీనేజ్ ఇన్ స్టా యూజర్లు తమ అకౌంట్లను ప్రైవేటులోకి మార్చుకోవాలని సూచిస్తోంది.