iOS 18.5 Public Beta : ఆపిల్ లవర్స్ కోసం iOS 18.5 పబ్లిక్ బీటా రిలీజ్.. ఐఫోన్ యూజర్లు ఇప్పుడే ఇలా చెక్ చేసుకోండి..!

iOS 18.5 Public Beta : ఆపిల్ iOS 18.5 పబ్లిక్ బీటా టెస్టింగ్ ప్రారంభించింది. బీటా ఇప్పుడు కొన్ని అప్‌గ్రేడ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మీ ఫోన్‌లో అప్‌డేట్ వచ్చి ఉంటే ఓసారి చెక్ చేయండి.

iOS 18 5 Public Beta

iOS 18.5 Public Beta : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. iOS 18.4 అప్‌డేట్ రిలీజ్ తర్వాత టెక్ దిగ్గజం ఇటీవలే iOS 18.5 ఫస్ట్ పబ్లిక్ బీటాను రిలీజ్ చేసింది. ఈ కొత్త OS అప్‌డేట్ భారీగా కొత్త ఫీచర్లను అందించలేదు. కానీ, కొద్ది మార్పులతో వచ్చింది. ఎక్కువగా హుడ్ కింద ఆపిల్ దశలవారీగా రిలీజ్ చేస్తున్న iOS 18 ఫీచర్లపైనే రూపొందించింది.

Read Also : Instagram Blend : వావ్.. ఇన్‌స్టాగ్రామ్ ‘బ్లెండ్‌’ ఫీచర్ భలే ఉందిగా.. రీల్స్ ఫీడ్‌ను మీ ఫ్రెండ్స్‌తో ఈజీగా షేర్ చేయొచ్చు..!

iOS 18.5లో ముఖ్యమైన అప్‌డేట్స్‌లో ఆపిల్ మెయిల్ (Apple Mail) యాప్ ఒకటి. గతంలో iOS 18.2తో ఆపిల్ యాప్ డిజైన్‌లో మార్పులను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ కేటగిరీలు, గ్రూపు మెసేజ్‌లను ఏఐతో ఇంటిగ్రేట్ చేసింది. అయితే, ఈ మార్పులు ఐఫోన్ సెట్టింగ్స్ యాప్ ద్వారా ఈ ఫీచర్లలో కొన్నింటిని అనుమతించలేదు. ఇప్పుడు, iOS 18.5తో ఆపిల్ యూజర్లు ఆయా ఫీచర్లను మెయిల్ ఇంటర్‌ఫేస్‌లో నేరుగా యాక్సస్ చేయొచ్చు.

మెయిల్ యాప్ రైట్ టాప్ కార్నర్‌లో త్రిడాట్స్ మెను ద్వారా ఫీచర్ సెట్టింగ్స్ కొత్త అప్‌డేట్ అందుబాటులో ఉంది. వినియోగదారులు ఇప్పుడు కేటగిరీలను ఏఐతో మెసేజ్ గ్రూపులను టోగుల్ చేయవచ్చు. ఆపిల్ అదే మెనూకు కొత్త ఆప్షన్ కూడా యాడ్ చేయొచ్చు. ఈ కొత్త ఫీచర్ ఇప్పుడు యూజర్లకు కాంటాక్ట్ ఫొటోలను ఇన్‌బాక్స్ వ్యూలో హైడ్ చేయొచ్చు. iOS 18.5 నుంచి రెండో అప్‌డేట్ (AppleCare & Warranty Section) కోసం సెట్టింగ్స్ యాప్‌లో ఉంది.

ఈ అప్‌డేట్ కొన్ని వ్యూ అప్‌గ్రేడ్స్ అందిస్తుంది. ఇప్పుడు ఆపిల్ సపోర్టు సైట్‌కు డైరెక్ట్ లింక్‌లను కలిగి ఉంది. డివైజ్ సమస్యలను ఫిక్స్ చేసేందుకు యూజర్లు సంబంధిత హెల్ప్ అసిస్టెంట్ యాక్సెస్ చేయొచ్చు.

కొన్ని అప్‌గ్రేడ్‌లు మాత్రమే కాకుండా iOS 18.5 ఎక్కువగా పర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్స్, అండర్-ది-హుడ్ అడ్జెస్ట్‌లపై దృష్టి పెడుతుంది. మీరు ఆపిల్ బీటా ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వొచ్చు. అయితే, ఎప్పటిలాగే, పబ్లిక్ బీటా వెర్షన్‌లు వార్నింగ్ అలర్ట్‌తో వస్తాయి. iOS 18.5 ఫస్ట్ బీటా ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. మీ ఫోన్‌‌లో ఇన్‌స్టాల్ చేస్తే ఎక్కువగా బగ్స్ ఉండే అవకాశం ఉంది.

ఆపిల్ iOS 18.4.1 రిలీజ్ :
ఆపిల్ ఇటీవలే iOS 18.4.1 అప్‌డేట్ రిలీజ్ చేసింది. ఈ కొత్త అప్‌డేట్ iOS 18.4 రిలీజ్‌తో వచ్చింది. కానీ, ఎలాంటి ముఖ్యమైన ఫీచర్లు లేదా మార్పులను తీసుకురాలేదు. అయితే, సెక్యూరిటీ పరంగా iOS 18.4.1 చాలా ముఖ్యం.

వినియోగదారులు అప్‌డేట్ వచ్చిన వెంటనే తమ ఐఫోన్‌లను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. iOS యూజర్ల ప్రధాన భద్రతా లోపాలను అప్‌డేట్ ఫిక్స్ చేస్తుంది. అదనంగా, iOS 18.4.1 కార్‌ప్లేకు సంబంధించిన సమస్యను కూడా ఫిక్స్ చేస్తుంది.

ఆపిల్ రిలీజ్ నోట్స్‌లో iOS 18.4.1, iPadOS 18.4.1 కొత్త అప్‌డేట్స్ గురించి హైలెట్ చేసింది. మొబైల్, టాబ్లెట్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో లో లెవల్ API (CoreAudio)లోని లోపాన్ని పరిష్కరిస్తుందని పేర్కొంది. CVE-2025-31200గా గుర్తించిన ఈ లోపాన్ని మొదట ఆపిల్, గూగుల్ థ్రెట్ అనాలిసిస్ గ్రూప్ కనుగొన్నాయి.

Read Also : Samsung One UI 7 : శాంసంగ్ వాడుతున్నారా? మీ ఫోన్‌కు వన్ UI 7 అప్‌డేట్ వచ్చిందోచ్.. ఇప్పుడే చెక్ చేసి అప్‌డేట్ చేసుకోండి..!

ఈ భద్రతా లోపాన్ని డేంజరస్ మీడియా ఫైల్‌లో ఆడియో స్ట్రీమ్‌ను ప్రాసెస్ చేసే కోడ్ రన్ అవుతుంది. ఈ కొత్త అప్‌డేట్‌తో ఆపిల్ బౌండ్స్ చెకింగ్‌తో మెమరీ అప్‌గ్రేడ్ ఇష్యూను పరిష్కరించింది. ఐఫోన్ యూజర్లు General > Software Update > Install Nowలో అప్‌డేట్ కోసం చెక్ చేయండి.